UPSC Special | మెయిన్స్ పరీక్ష విధానం
మెయిన్స్ పరీక్ష విధానం
అర్హతకు సంబంధించిన పరీక్ష
పేపర్-A: రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న భాషల్లో నచ్చిన భారతీయ భాషలో పరీక్ష రాయాలి. ఇది అర్హతకు సంబంధించిన పరీక్ష మాత్రమే. ఇందులో ప్యాసేజ్ (Passage) పై అవగాహన, కచ్చితమైన రచన (Precis Writing), చిన్న వ్యాసాలు, ఇంగ్లిష్ నుంచి భారతీయ భాషలోకి అనువాదం తదితర అంశాలకు సంబంధించి ప్రశ్నపత్రం ఉంటుంది. ఈ ప్రశ్నపత్రంలో సమాధానాలను అభ్యర్థి ఎంచుకొన్న భారతీయ భాషలో మాత్రమే రాయాలి. ప్రశ్నపత్రంలో 600 పదాల్లో వ్యాసరచన (100 మార్కులు) 60 మార్కులకు ప్రస్తావిక (Passage) ఇస్తారు.
- సొంత వాక్యాలు 10, సమానార్థక పదాలు 10, వ్యతిరేకార్థక పదాలు 10, పదాల్లో తప్పులు సవరించడం 10 మార్కులకు సమాధానాలు రాయాలి. ఇంగ్లిష్ ప్రస్తావికను తెలుగు భాషలోకి అనువాదం 20, ప్రిసైస్ రైటింగ్ 60 మార్కులకు ఇస్తున్నారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే.
పేపర్-B: ఇది ఇంగ్లిష్ భాషకు సంబంధించిన పరీక్ష. ఈ ప్రశ్నపత్రానికి సంబంధించి సమాధానాలు ఇంగ్లిష్‌లో రాయాలి. దీనిలో వ్యాసరచనకు సంబంధించి నాలుగు ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు సంబంధించిన వ్యాసం రాయాలి. తర్వాత ప్యాసేజ్‌కు 75 మార్కులు, ప్రిసైస్ రైటింగ్‌కు 75 మార్కులు మిస్సింగ్ వర్డ్స్, వ్యతిరేకపదాలు, ఖాళీలను పూరించండం వంటివి ఉంటాయి. ఇది కూడా అర్హత పరీక్ష మాత్రమే. - మెయిన్స్‌లో జనరల్ స్టడీస్‌కు సంబంధించి ఐదు పేపర్లు ఉంటాయి.
పేపర్ 1: జనరల్ ఎస్సే (250 మార్కులు)
- ఈ ప్రశ్నపత్రంలో రెండు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్లో నాలుగు వ్యాసాలు ఇస్తారు. వాటిలో ఒక వ్యాసాన్ని 1000 నుంచి 1200 పదాల్లో రాయాలి. మొత్తం రెండు వ్యాసాలు రాయాలి.
గతంలో ఇచ్చిన ప్రశ్నలు
సెక్షన్-A - The real is rational and the rational is real; Philosophy of want less ness is Utopian, while materialism is a chimera;
- A ship in harbor is safe, but that is not what a ship is for; History is a series of victorious won by the scientific man over the romantic man;
- ఇలాంటి వాక్యాలను పేర్కొని ప్రశ్నలను అడుగుతున్నారు. ఇవేగాక నిగూఢ అర్థం వచ్చే విధంగా ఉండే ప్రముఖుల కొటేషన్స్ వ్యాస రూపంలో వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థి వ్యాసం రాసేటప్పుడు స్పష్టంగా తన అభిప్రాయాన్ని పొందికగా రాయాలి.
- సెక్షన్-Bలో రాజ్యాంగపరమైన పాలిటీకి సంబంధించిన ప్రశ్న ఉంటుంది. అంతేగాక ఆర్థిక రంగంలో సంభవించిన మార్పులకు సంబంధించి తప్పనిసరిగా ఒక వ్యాసం ఉంటుంది.
- ఏదైనా అంశానికి సంబంధించి వ్యాసం రాసేటప్పుడు ఆ అంశానికి సంబంధించిన చరిత్ర, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో వివిధ రంగాలపై ప్రభావం, లాభనష్టాల బేరీజు, వాటిని అధిగమించడానికి అనుసరించాల్సిన మార్గాలను అభ్యర్థి అభిప్రాయంతో చక్కని ముగింపు ఇవ్వాలి. ఇవేగాక న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల వివాదం, రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవస్థ, తర్వాత భారతదేశానికి, ఇతర దేశాలతో సంబంధాలు ముఖ్యంగా అమెరికా, రష్యా వంటి దేశాలతో సంబంధాలు, అలాగే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వ అంశం, పర్యావరణానికి సంబంధించి కాప్ సదస్సు వంటి అంశాలను జనరల్ స్టడీస్ పేపర్-2, 3లతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి.
- వ్యాసరూప ప్రశ్నపత్రంతో సమాధానాన్ని ఒక క్రమపద్ధతిలో ప్రణాళికాబద్ధంగా విభజన చేసుకొని చక్కని పదాలు, మంచి కొటేషన్లు, సామరస్య పూరితమైన ముగింపు ఇస్తే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. ఈ పేపర్‌కు సంబంధించి తెలుగు మీడియం తెలుగు అభ్యర్థులు జాతీయ దినపత్రికల్లో వచ్చే ఎడిటోరియల్స్, మ్యాగజైన్లు, తెలుగు భాషకు సంబంధించిన దినపత్రికల్లోని ఎడిటోరియల్స్ చదవాలి.
పేపర్-2 (జనరల్ స్టడీస్-1) (250 మార్కులు)
- దీనికి సంబంధించి భారతదేశ చారిత్రక వారసత్వం, సంస్కృతి, చరిత్రకు సంబంధించి, ఆధునిక భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర, సమాజానికి సంబంధించిన ప్రశ్నలతో పాటు భారతదేశ, ప్రపంచ భౌగోళిక శాస్ర్తానికి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. భారతదేశ చారిత్రక వారసత్వం, సంస్కృతికి సంబంధించి సుమారు 2 ప్రశ్నలు (25 మార్కులు) ఉంటాయి. దీనికి సంబంధించి వైదిక నాగరికత, బౌద్ధ, జైన మతానికి సంబంధించిన కళలు, వాస్తుశిల్పి వైభవానికి సంబంధించిన అంశాలు భక్తి ఉద్యమ సాహిత్యం, సంఘ సంస్కరణ ఉద్యమాలు ఉదాహరణకు బ్రహ్మ సమాజం వంటి వాటిపై ప్రశ్నలిస్తారు.
- వీటితో పాటు ప్రాచీన, మధ్యయుగ భారతదేశానికి సంబంధించిన ప్రముఖ రాజవంశాలు లేదా రాజుల కాలం నాటి కళలు, సాహిత్యంపై ప్రశ్నలు అడుగుతారు. దీనికి సంబంధించి ఎన్సీఈఆర్టీ పుస్తకాలు సమగ్రంగా చదివి సమాధానాలు రాయడం బాగా ప్రాక్టీస్ చేయాలి. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ పుస్తకాలు చదివి సమాధానాలు రాయడం బాగా ప్రాక్టీస్ చేయాలి.
- ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు ముఖ్యంగా 1857 తిరుగుబాటు ఏ విధంగా బ్రిటిష్ విధానాల్లో మార్పునకు కారణమైంది. స్వాతంత్య్ర సమయంలో ముఖ్యంగా గాంధేయకాలంలో స్త్రీ పాత్ర ఏమిటి? స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్ దృక్పథాల్లో తేడా ఏమిటి? వంటి ప్రశ్నలు, స్వాతంత్య్రోద్యమంలో మితవాదుల పాత్ర ఏమిటి? వంటి ప్రశ్నలు గతంలో అడిగారు.
- స్వాతంత్య్రానంతర కాలానికి సంబంధించి భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ర్టాలు భారతదేశ ఏకత్వం బలపడటానికి కారణమయ్యాయా వంటి ప్రశ్నలు, న్యాయవ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై గత సంవత్సరాల్లో జరిగిన మెయిన్స్ పరీక్షల్లో అడిగారు. దీనికి సంబంధించి పాత ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవాలి.
- తెలుగు మీడియం అభ్యర్థులు ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి డిగ్రీ, పీజీ వుస్తకాలు చదివితే సరిపోతుంది. ప్రపంచ చరిత్రకు సంబంధించి పశ్చిమ ఆఫ్రికాకు సంబంధించిన వలస వాద వ్యతిరేక ఉద్యమాలకు సంబంధించిన అంశాలు, ప్రపంచ యుద్ధాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. తెలుగు మీడియం అభ్యర్థులు ఆధునిక ప్రపంచ చరిత్ర, అకాడమీ పుస్తకాలు చదవాలి.
- సమాజానికి సంబంధించి భారతదేశ సాంస్కృతిక వైవిధ్యంపై ప్రపంచీకరణ ప్రభావం, పేదరికం, షెడ్యూల్డ్ తెగలు, స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ వంటి అంశాలు చదివితే ఉపయుక్తంగా ఉంటుంది.
- ఈ ప్రశ్నలు సాధారణంగా రోజూ దినపత్రిక చదివే పరిజ్ఞానంతో రాసేవిధంగా ఉంటున్నాయి.
- దీనికి సంబంధించి భారతదేశ సమాజశాస్త్రం పుస్తకంతోపాటు పాలిటీ, ఎకానమీతో అనుసంధానం చేస్తూ చదవాలి. భౌగోళిక శాస్ర్తానికి సంబంధించి హిమాలయాలు, దీనిలో ఎయిర్ మాస్ కాన్సెప్ట్ గురించి ప్రశ్న, హిమాలయాలు-కొండచరియలు విరిగిపడటం వంటి భౌగోళిక పశ్చిమ కనుమల్లో కొండ చరియలు విరిగి పడటం- ప్రభావం, అగ్ని పర్వతాల విస్ఫోటనం- స్థానిక వాతావరణంపై ప్రభావం, అసలు భారత ఉపఖండం అని ఎందుకు పిలుస్తారు, పర్వత శ్రేణులు వంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలతో పాటు భూమి, దక్షిణ చైనా సముద్రం భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యం, భారతదేశంలో నగరాలకు సంబంధించి పరిస్థితులు, సింధూ నీటి ఒప్పందానికి సంబంధించి ద్వైపాక్షిక సంబంధాల్లో మార్పులు, వాటి ప్రభావం తదితర ప్రశ్నలు గత పరీక్షల్లో వచ్చాయి.
- ఈ విభాగానికి సంబంధించి ఎన్సీఈఆ 11, 12వ తరగతి పుస్తకాలు చదవాలి. తెలుగు మీడియం అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పుస్తకాలు చదవాలి. దీనిలో 2-3 ప్రశ్నలు భౌగోళిక శాస్త్రంలో స్పష్టమైన పరిజ్ఞానం ఉన్నవారు మాత్రమే రాసేవిధంగా ఉంటాయి. మిగిలినవి సాధారణ పరిజ్ఞానంతో పాటు ఇతర విభాగాలతో అనుసంధానం చేసుకొని చదవాలి.
- దీనిలో 150-180 మార్కులు సాధించే అవకాశముంది.
పేపర్-3 (జనరల్ స్టడీస్-2) (250 మార్కులు)
- ఈ పేపర్‌కు సంబంధించి పరిపాలన, రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. దీనిలో గతేడాది కాలంలో దేశంలో జరిగిన రాజ్యాంగపరమైన అంశాలు, న్యాయ, పరిపాలన, సంక్షేమానికి సంబంధించిన అంశాలతో సంబంధం కలిగిన వాటికి ప్రాథమిక అంశాలు (బేసిక్స్) లింక్ చేస్తూ ప్రశ్నలు అడుగుతారు. ఇటీవల వార్తల్లో నిలిచిన అంశాలు, వివాదాలను కేంద్రంగా చేసుకొని రాజ్యాంగ సవరణలు, వివాదాస్పదమైన చట్టాలు, రాజ్యాంగ మౌలిక స్వరూపం, రాష్ట్రపతి ఎన్నిక వీటిపై ప్రత్యేకంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
- అంతర్జాతీయ సంబంధాల నుంచి అంతర్జాతీయ వాణిజ్యంలో WTO పాత్ర, భారతదేశం యాక్ట్-ఈస్ట్ పాలసీ, బ్రిక్స్, భారత్-ఆసియాన్ సంబంధాలు, ప్రస్తుత ప్రపంచంలో NATO, యునెస్కోకు సంబంధించిన అంశాల గురించి అడిగే అవకాశం ఉంది. ఈ అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన అంశాలు చదివేటప్పుడు ప్రత్యేకంగా భారతదేశాన్ని పరిగణనలోకి తీసుకొని చదవాలి. దీనికి సంబంధించి అంతర్జాతీయ సంబంధాలు అనే అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు అకాడమీకి చెందిన మూడో ఏడాది డిగ్రీ పుస్తకం చదవాలి. ఇవి చదివేటప్పుడు దినపత్రికను అనుసంధానం చేసుకోవాలి. ఈ పేపర్లో పట్టుసాధిస్తే మంచి మార్కులు సాధించవచ్చు.
పేపర్-4 (జనరల్ స్టడీస్-3) (250 మార్కులు)
- దీనికి సంబంధించి సాంకేతిక విజ్ఞానం, ఆర్థికాభివృద్ధి, జీవవైవిధ్యం, పర్యావరణం, భద్రత, విపత్తు యాజమాన్యానికి అంశాలపై సంబంధించిన ప్రశ్నపత్రం ఉంటుంది. ఆర్థికాభివృద్ధికి.. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రశ్నలు, వ్యవసాయరంగానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. మహిళా సాధికారత సాధించడానికి జెండర్ బడ్జెటింగ్, స్మార్ట్ సిటీస్ అంటే ఏమిటి? పట్టణాభివృద్ధిలో దీని సంబంధం, ఇది గ్రామీణ-పట్టణాల మధ్య అంతరాలను పెంచుతుందా? స్మార్ట్ విలేజెస్ వంటి ప్రశ్నలు గతంలో ఇచ్చారు.
- దేశాభివృద్ధిలో ఎఫ్‌డీఐల ఆవశ్యకత, ఎఫ్‌డీఐలు పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలు, సమర్థనీయమైన నీటి వినియోగంలో మైక్రో ఇరిగేషన్ పాత్ర, అల్లోపతి అంటే ఏమిటి? నీటి సౌకర్యం ఉన్న వ్యవసాయంలో మేజర్ క్రాపింగ్ సిస్టమ్స్ పాత్ర, వ్యవసాయాభివృద్ధిలో భూ సంస్కరణల పాత్ర, భూ సంస్కరణలు విజయవంతం కావడానికి ఏ కారకాలు తోడ్పడుతాయి? వంటి ప్రశ్నలు ఇస్తున్నారు.
- పీఎంఎఫ్‌బీవై (ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన) ముఖ్య లక్షణాలు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి, ముఖ్యంగా వ్యవసాయరంగంపై ప్రత్యేకంగా చదవాలి. తెలుగు మీడియానికి సంబంధించి అకాడమీ వారి భాతరదేశ ఆర్థిక వ్యవస్థ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు ప్రభుత్వ వెబ్సైట్లను ఉపయోగించుకోవాలి.
- సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రెన్యువబుల్ ఎనర్జీ (పునరుత్పాదక వనరులు)కి సంబంధించి, అంతరిక్ష సైన్స్ అండ్ టెక్నాలజీ విజయాలు, PSLV ప్రయోగాలు, INSPACe, టెక్నాలజీని భారతదేశ సామాజిక-ఆర్థికాభివృద్ధిలో ఎలా ఉపయోగించుకోవాలి, నానో టెక్నాలజీకి సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఇస్రో ప్రయోగాలు, ఎనర్జీకి సంబంధించిన అంశాలు, డిఫెన్స్‌కు సంబంధించిన అంశాలు చదవాలి. జాతీయ పత్రికల్లో ఒక ఏడాదికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన ఆర్టికల్స్‌లో పేజీల్లో వచ్చిన అంశాలు క్రమపద్ధతిలో చదివితే ఉపయుక్తంగా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖలవారు విడుదల చేసే వార్షిక నివేదికలు చదవాలి.
- విపత్తు యాజమాన్యానికి సంబంధించి ఎన్డీఎంఏ గైడ్ లైన్స్, పట్టణ వరదలు, రిహాబిలిటేషన్స్ వంటి అంశాలు వంటివి ముఖ్యంగా చదవాలి. దీనికి సంబంధించి ఎన్సీఈఆర్టీ పుస్తకం, ఎన్ఎండీఏ వారు రిలీజ్ చేసిన పుస్తకం చదవాలి.
- సెక్యూరిటీ అంశాలకు సంబంధించి సరిహద్దు సమస్యలు, ఉగ్రవాద దాడులు, ఉగ్రవాదం, భద్రతా వ్యవస్థలో ఇంటర్నెట్, సోషల్ మీడియా పాత్రల గురించి ముఖ్యంగా చదవాలి. దీనికి పేపర్ పఠనంతోపాటు సొంత నోట్స్ తయారు చేసుకొని చదివితే ఈ పేపర్లో మంచి మార్కులు సాధించవచ్చు.
పేపర్-5 (జనరల్ స్టడీస్-4) (250 మార్కులు)
- నైతిక విలువలు, సమగ్రత, ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన అంశాలపై ఈ పేపర్ ఉంటుంది. దీనిలో నైతికత, మానవ విలువలు, వైఖరి, పౌరసేవలో ప్రాథమికమైన విలువలు, ఉద్వేగపూరిత ప్రజ్ఞకు సంబంధించిన అంశాలతోపాటు నైతికపరమైన విషయాలకు సంబంధించి తత్వవేత్తల భాగస్వామ్యం (ప్రపంచం, ఇండియాకు సంబంధించినవారు) వంటి అంశాలుంటాయి.
- ప్రభుత్వ పాలనలో నైతికత, ప్రజాసేవలో సివిల్ సర్వీస్ అధికారులకు సంబంధించిన నియమాలు, చట్టాలకు సంబంధించిన అంశాలుంటాయి. సమాచార హక్కు చట్టం, నైతికతకు సంబంధించిన నియమావళి, ప్రవర్తనా నియమావళి, సిటిజన్ చార్టర్, పని సంస్కృతి, ప్రభుత్వ ధనం సద్వినియోగం, అవినీతికి సంబంధించిన సమస్యలు వంటి అంశాల్లో ప్రశ్నలు, కేస్ స్టడీస్ ఉంటాయి.
- సామాజిక, మానవీయ వికాసంలో నైతిక పాత్ర, ప్రస్తుత సామాజిక – రాజకీయ పరిస్థితులు పబ్లిక్ సర్వీస్‌లో ప్రాథమిక విలువలను ఉదాహరణలతో వివరించండి? గవర్నెన్స్ (పరిపాలన), గుడ్ గవర్నెన్స్ (సుపరిపాలన), ఎథికల్ గవర్నెన్స్ (నైతికపాలన) వివరణ, మహాత్మాగాంధీ పేర్కొన్న సెవన్ సెన్స్, భారతదేశ దృక్పథంలో రాల్స్ థియరీ ఆఫ్ సోషల్ జస్టిస్ వంటి అంశాలు ఇచ్చే అవకాశం ఉంది.
- అవినీతిపై కౌటిల్యుని దృక్పథం, కేస్ స్టడీస్‌కు సంబంధించి ఉద్యోగ జీవితంలో వ్యక్తి ఎదుర్కొనే సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారనే దృక్పథంలో కేస్ స్టడీస్ ఇస్తారు. ఉదాహరణకు ‘నీవు వృద్ధులకు సంబంధించి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వగల అధికారివి. ఒక నిరక్షరాస్యురాలైన వృద్ధురాలు తన బాధలు చెప్పుకొంది. నీ అభిప్రాయంలో ఆమె పెన్షన్ పొందడానికి అర్హురాలు. కానీ ఆమె దగ్గర డాక్యుమెంట్ ఆధారాలేమీ లేవు. నీవు ఒక అధికారిగా ఎలా స్పందిస్తావు?’ ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఈ కేస్ స్టడీస్‌కు పరిష్కార సమాధానం రాసేటప్పుడు ఆ అధికారిగా ఉన్నట్టు ఊహించుకుని ఆ సమయంలో ఎలా స్పందిస్తావో రాయాలి. అప్పుడే స్పష్టమైన సమాధానం రాయగలరు.
- జనరల్ స్టడీస్ పేపర్లు రాసేటప్పుడు ఒక పేపర్‌కు ఇంకో పేపర్‌ను కోరిలేట్ చేసుకుంటూ రాయాలి. అలా చేసినప్పుడే అత్యధిక మార్కులు వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. మాక్ ఎగ్జామ్స్ బాగా రాయాలి. అప్పుడే ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా ప్రశ్నలు అడిగినా సంకోచం లేకుండా సమాధానాలు రాయగలరు. ఈ విధమైన ప్రిపరేషన్ ఇంటర్వ్యూకి కూడా బాగా ఉపయోగపడుతుంది.
మల్లవరపు బాలలత
సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ,
హైదరాబాద్
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






