ఈ వారం జాతీయం-అంతర్జాతీయం-క్రీడలు
టీబీ నిర్మూలనలో రాష్ర్టానికి మూడు జాతీయ అవార్డులు
అంతర్జాతీయ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్చి 24న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణకు మూడు జాతీయ అవార్డులు లభించాయి. క్షయవ్యాధి నిర్మూలనలో విశేష కృషి చేసినందుకు గుర్తింపుగా నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఈ అవార్డులు దక్కాయి. నిజామాబాద్‌కు వెండి.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలకు కాంస్య పతకాలు లభించాయి. ఈ ఏడాదికి క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం థీమ్.. క్షయవ్యాధిని అంతం చేయండి, పెట్టుబడులు పెట్టండి, ప్రాణాలను కాపాడండి.
వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో
హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో మార్చి 24న ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఏవియేషన్ షో ఈ నెల 27న ముగిసింది. ఈ ఏవియేషన్ షోలో ఎయిర్‌బస్ 350 ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నరిసింగపట్టై నాదస్వరానికి జీఐ ట్యాగ్
క్లాసికల్ విండ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నరసింగపట్టై నాదస్వరానికి జీఐ ట్యాగ్ లభించింది. ఈ సంప్రదాయ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ను తమిళనాడు రాష్ట్రం కుంభకోణం సమీపంలోని నరసింగపట్టై గ్రామంలో తయారుచేశారు. క్లాస్ 15 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ క్యాటగిరీ కింద ఈ నాదస్వరానికి జీఐ ట్యాగ్ దక్కింది.
నొవావ్యాక్స్కు భారత్‌లో అత్యవసర అనుమతి
ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ నొవావ్యాక్స్ అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ ఎన్వీఎక్స్-కోవ్2373ని దేశంలో వినియోగించేందుకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. 12-18 ఏండ్ల మధ్య వయస్కులకు ఈ వ్యాక్సిన్‌ను అందించవచ్చని పేర్కొన్నది. నొవావ్యాక్స్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొవొవ్యాక్స్ పేరుతో తయారు చేసి పంపిణీ చేయనున్నది.
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
భారత సైన్యం అమ్ములపొదిలోని శక్తిమంతమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఉపరితలం నుంచి ఉపరితలంలో నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంగల ఈ విస్తృత శ్రేణి క్షిపణిని అండమాన్ నికోబార్ దీవుల్లో పరీక్షించినట్లు డీఆర్డీవో వెల్లడించింది. నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ క్షిపణి కచ్చితంగా ఛేదించిందని డీఆర్డీవో అధికారులు తెలిపారు.
రూ.100 కోట్ల హెలికాప్టర్
భారత బిలియనీర్లలో ఒకరైన ఆర్సీ గ్రూప్ కంపెనీస్ చైర్మన్ బీ రవి పిైళ్లె రూ.100 కోట్లు ఖర్చు చేసి ఎయిర్‌బస్ హెచ్-145 హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు. ఈ నెల 20న ఎయిర్‌బస్ రవి పిైళ్లెకి హెలికాప్టర్‌ను అందించింది. దాంతో ఇంతటి విలాసవంతమైన హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిన తొలి భారతీయ వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. ఈ హెలికాప్టర్లో ఇద్దరు పైలెట్లతోపాటు ఏడుగురు ప్రయాణికులు కూర్చునేందుకు వీలుంటుంది.
అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ
2021 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు ప్రకారం ప్రపంచంలోని అత్యంత కలుషితమైన రాజధాని నగరాల జాబితాలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, చాద్ రాజధాని ఎన్ జమేనా, తజికిస్థాన్ రాజధాని దుషాంబే, ఒమన్ రాజధాని మస్కట్ ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాలో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉంది. మొత్తం 100 అత్యంత కలుషిత నగరాలతో ఈ జాబితాను రూపొందించగా అందులో 63 నగరాలు భారతదేశానికి చెందినవే ఉన్నాయి. అలాగే ప్రపంచంలోని అత్యంత కలుషితమైన దేశాల జాబితాలో బంగ్లాదేశ్, పాకిస్థాన్ టాప్‌లో ఉన్నాయి. భారత్ ఐదో స్థానంలో ఉన్నది.
భారత్-ఉజ్బెకిస్థాన్ మిలిటరీ ఎక్సర్సైజ్
భారత్-ఉజ్బెకిస్థాన్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడో ఎడిషన్ మిలిటరీ ఎక్సర్సైజ్ మార్చి 22న ప్రారంభమైంది. ఉజ్బెకిస్థాన్‌లోని యాంగీయారిక్లో డస్ట్లిక్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఎక్సర్సైజ్ మార్చి 31 వరకు కొనసాగనుంది. ఇరుదేశాలు జాతీయ పతాకాలను ఎగురవేసి, జాతీయ గీతాలను ఆలపించి ఈ ఎక్సర్సైజ్ను ప్రారంభించాయి. గత ఏడాది రెండో ఎడిషన్ మిలిటరీ ఎక్సర్సైజ్ను భారత్‌లో నిర్వహించారు.
భారత్-జపాన్ ప్రధానుల సమావేశం
మార్చి 19, 20 తేదీల్లో ఢిల్లీలో భారత్-జపాన్ ప్రధానుల 14వ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య మొత్తం ఆరు అంశాలపై ఒప్పందం కుదిరింది. రానున్న ఐదేండ్లలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 3.2 లక్షల కోట్లకు చేరుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
హ్యాపీనెస్ సూచీలో భారత్@136
వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా ఐక్యరాజ్యసమితి 146 దేశాలతో మార్చి 20న హ్యాపీనెస్ సూచీని ప్రకటించింది. ఈ జాబితాలో ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత డెన్మార్క్ 2, ఐస్లాండ్ 3, స్విట్జర్లాండ్ 4వ స్థానాల్లో ఉన్నాయి. భారత్ 136వ స్థానంలో నిలిచింది. చివరి మూడు స్థానాల్లో లెబనాన్ (144), జింబాబ్వే (145), అఫ్గానిస్థాన్ (146) ఉన్నాయి. ఈ ఏడాది హ్యాపీనెస్ డే థీమ్.. ప్రశాంతంగా ఉండండి, నిజాయితీతో ఉండండి, జాలీగా ఉండండి.
డెన్నిస్ పార్నెల్ సలివాన్
అమెరికాకు చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త డెన్నిస్ పార్నెల్ సలివాన్కు 2022 ఏడాదికి గాను ఏబెల్ బహుమతి లభించింది. బీజ గణితం, రేఖా గణితం, డైనమిక్ అంశాల్లో చేసిన విశ్లేషణలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. ఓస్లోలోని నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ మార్చి 23న సలివాన్కు ఈ అవార్డును ప్రకటించింది. నార్వే ప్రభుత్వం 2003 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నది. ఈ బహుమతి కింద 3.7 మిలియన్ డాలర్ల నగదు అందజేస్తారు. ఇది గణిత రంగంలో అత్యున్నతమైన బహుమతి.
షహబుద్దీన్ అహ్మద్
బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు షహబుద్దీన్ అహ్మద్ మార్చి 24న మరణించారు. 1996 నుంచి 2001 వరకు ఆయన బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1991 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో స్వేచ్ఛాయుత, విశ్వసనీయ ఎన్నికల నిర్వహణలో షహబుద్దీన్ పూర్తి బాధ్యత వహించారు.
రమేశ్చంద్ర లహోటి
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్చంద్ర లహోటి మార్చి 22న మరణించారు. ఆయన సుప్రీంకోర్టుకు 35వ చీఫ్ జస్టిస్‌గా 2004, జూన్ 1 నుంచి 2005, నవంబర్ 1 వరకు పనిచేశారు. లహోటి 1940 నవంబర్ 1న మధ్యప్రదేశ్‌లో జన్మించారు. 1960లో గుణ జిల్లా బార్ అసోషియేషన్‌లో చేరి, 1962లో అడ్వకేట్‌గా నమోదయ్యారు. 1988, మే 3న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఏడాది ఆగస్టు 4న శాశ్వత న్యాయవాదిగా నమోదయ్యారు. 1994, ఫిబ్రవరి 7న ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 1998, డిసెంబర్ 9న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
మరియో మార్సెల్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చిలీ గవర్నర్ మరియో మార్సెల్‌కు సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్-2022లో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఆయన 2016 అక్టోబర్ నుంచి చిలీ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. మరియో మార్సెల్ లాటిన్ అమెరికా దేశాల్లోనే అత్యంత పేరున్న బ్యాంకింగ్ అధికారి.
హిసాషి టెకౌచి
మారుతి సుజుకి సంస్థ నూతన మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా హిసాషి టెకౌచి మార్చి 24న నియమితులయ్యారు. ఈయన 1966లో సుజుకి మోటార్ కార్పొరేషన్లో చేరారు. 1997 నుంచి ఆస్ట్రేలియాలో కంపెనీకి మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2021లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పదోన్నతి పొందారు. కంపెనీ నూతన సీఈవోగా ఆయన ఏప్రిల్ 1న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న కెనిచి అయుకవ పదవీకాలం ఈ నెల 31న ముగియనుండటంతో ఆయన స్థానంలో హిసాషిని నియమించారు.
జెన్స్ స్టోల్టెన్‌బర్గ్
నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ పదవీకాలాన్ని 2023, సెప్టెంబర్ 23వరకు పొడిగించారు. ఈ మేరకు మార్చి 24న నాటో ఒక ప్రకటన చేసింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఏర్పాటైన నాటోలో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 30గా ఉన్నది. నార్వే మాజీ ప్రధాని అయిన స్టోల్టెన్‌బర్గ్ 2014 నుంచి నాటో సెక్రటరీ జనరల్‌గా కొనసాగుతున్నారు. కాగా, స్టోల్టెన్‌బర్గ్ పదవీకాలాన్ని పొడిగించడం ఇది వరుసగా రెండోసారి.
టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన అష్లీ బార్టీ
ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి, ఆస్ట్రేలియాకు చెందిన అష్లీ బార్టీ 25 ఏండ్లకే ఆటకు గుడ్‌బై చెప్పింది. ఈ మేరకు మార్చి 23న ఆమె తన నిర్ణయం ప్రకటించింది. అష్లీ బార్టీ 2019లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్, 2021లో వింబుల్డన్ టైటిల్, 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ గెలిచింది.
ఫైనల్లో ఓడిన లక్ష్యసేన్

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ-2022లో భారత క్రీడాకారుడు లక్ష్యసేన్ తృటిలో టైటిల్ చేజార్చుకున్నాడు. అలవోకగా ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆయన ఫైనల్లో డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అలెక్సన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఉత్తరాఖండ్ రాష్ర్టానికి చెందిన లక్ష్యసేన్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. గతంలో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో లక్ష్యసేన్ కాంస్యం సాధించాడు.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






