TS PECET 2023 | పీఈసెట్ షెడ్యూల్ విడుదల
- 13న నోటిఫికేషన్ జారీ
- 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్ 2023-24) షెడ్యూల్ ఖరారైంది. గురువారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఫ్రొఫెసర్ ఆర్ లింబాద్రి పీఈసెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. బీపీఈడీ, యూజీ- డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షకు ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల చేస్తామని లింబాద్రి ప్రకటించారు. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500, బీసీ, జనరల్ విద్యార్థులు రూ.900 చెల్లించాలని పేర్కొన్నారు. దరఖాస్తు, ఇతర వివరాలకు https:// pecet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాస్‌రావు, శాతవాహన వర్సిటీ వైఎస్ చాన్స్‌లర్ మల్లేశ్, మహాత్మాగాంధీ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ గోపాల్‌రెడ్డి, పాలమూరు వర్సిటీ వైస్ చాన్స్‌లర్ లక్ష్మీకాంత్ రాథోడ్, పీఈసెట్ కన్వీనర్ రాజేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
షెడ్యూల్ ఇలా.. తేదీలు
నోటిఫికేషన్ 13-3-23
దరఖాస్తుల స్వీకరణ 15-3-23
దరఖాస్తుల గడువు 6-5-23
500 ఆలస్య రుసుంతో 15-5-23
2 వేల ఆలస్య రుసుంతో 20-5-23
5 వేల ఆలస్య రుసుంతో 25-5-23
హాల్‌టికెట్ల డౌన్లోడింగ్ 26-5-23
ఫిజికల్ టెస్ట్‌లు 1-6-23 నుంచి 10-6-23
ఫలితాల ప్రకటన జూన్ మూడో వారంలో
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






