శ్వాసకోసపు చేపలు ఏ క్రమానికి చెందినవి?
- జీవ పరిణామానికి ముఖ్యమైనది?
1) పోరాటం 2) వైవిధ్యాలు
3) వలసపోవడం 4) ప్రత్యుత్పత్తి - సంయుక్త అంకురచ్ఛదం ఏ కుటుంబం ముఖ్య లక్షణం
1) లోరాంథేసి 2) అనోనేసి
3) యుఫర్బియేసి 4) కుకుర్బిటేసి - పుప్పొడి- అండకోశాల పరస్పర చర్యలో కింది రకపు పుప్పొడి రేణువులు కీలాగ్రం మీద మొలకెత్తనిస్తాయి?
1) విరుద్ధపు పుప్పొడి రేణువులు
2) స్వయం విరుద్ధ పుప్పొడి రేణువులు
3) అవిరుద్ధ పుప్పొడి రేణువులు
4) అవిరుద్ధ, విరుద్ధ పుప్పొడి రేణువులు - జీవసముదాయంలో ప్రథమ వినియోగదారులు?
1) శాకాహారులు 2) ఉభయహారులు
3) మాంసాహారులు 4) డైట్రెటివోర్లు - జీవపదార్థ స్థాయి వ్యవస్థీకరణ వేటిలో కనిపిస్తుంది?
1) స్పంజికలు 2) ప్రొటోజోవన్లు
3) సీలెంటిరేట్లు 4) అనెలిడ్లు - విలువైన ముత్యాలు దేనినుంచి సేకరిస్తారు?
1) పింక్టాడ 2) పైలా
3) మైటిల 4) లెమెల్లిడెన్స్ - శుక్రకణపు ఏక్రోజోమ్ ఏర్పరిచేది?
1) క్రోమోజోమ్ 2) గాల్జీదేహం
3) లైసోజోమ్ 4) సెంట్రియోల్ - గర్భాశయంలో పిండ ప్రతిస్థాపన జరిగే దశ?
1) బ్లాస్టులా 2) బ్లాస్టోసిస్ట్
3) మారులా 4) గ్రాస్టులా - పిప్పర్మెంట్ నూనెను దేని నుంచి తీస్తారు?
1) మెంథా లాంగిఫోలియా
2) మెంథా పులిజియం
3) మెంథా అర్వెన్సిస్
4) మెంథా పైవరేటా - హృదయంలో లయారంభకం పాత్ర?
1) హృదయస్పందన ఎక్కువ చేయడం
2) హృదయస్పందన తక్కువ చేయడం
3) హృదయస్పందన ప్రారంభించడం
4) హృదయానికి రక్త సరఫరా నియంత్రించడం - గర్భిణుల్లో అండోత్సర్గాన్ని నిరోధించేది?
1) FSH 2) ప్రొజెస్టిరాన్
3) LH 4) ఈస్ట్రోజెన్ - జీవలయలను నియంత్రించేది?
1) హార్మోన్లు 2) ఎంజైమ్లు
3) హైపోథలామస్ 4) మజ్జాముఖం - భారత్ ఏ జంతు భౌగోళిక ప్రాంతంలో ఉంది?
1) ఇథియోపియన్ 2) ఓరియంటల్
3) ఆస్ట్రేలియన్ 4) నియోట్రోపికల్ - మానవునిలో వర్ణ అంధత్వం కలిగించే జన్యువు ఏది?
1) Y- క్రోమోజోమ్ 2) X- క్రోమోజోమ్
3) X- క్రోమోజోమ్, Y- క్రోమోజోమ్
4) ప్లాస్మిడ్లు - మైనం ఒక..?
1) సరళకొవ్వు 2) సంయుక్తకొవ్వు
3) ఉత్పన్నకొవ్వు 4) కార్బొహైడ్రేట్ - ఫాటీ ఆమ్లాల సంశ్లేషణలో ప్రధాన పథం?
1) మైటోకాండ్రియాలో జరుగుతుంది
2) మైటోకాండ్రియా వెలుపల జరుగుతుంది
3) క్రిస్టేలో జరుగుతుంది
4) గ్రానాలో జరుగుతుంది - వాయుసహిత పరిస్థితులను తట్టుకొని బతికే అవాయు జీవులు?
1) వైకల్పిక అవాయు జీవులు
2) అవికల్ప అవాయు జీవులు
3) అవికల్ప వాయుజీవులు
4) పైవన్నీ - ైగ్లెకాలసిస్లో పాల్గొనే ఎంజైమ్లు?
1) హెక్సోకైనేజ్ డీ హైడ్రోజినేజ్
2) డీకార్బాక్సిలేజ్, ఎకోనిటేజ్
3) ఎకోనిటేజ్, ప్యూమరేజ్
4) పైవన్నీ - లైంగికోత్పత్తిలో ఎక్కువ ప్రమేయం ఉండేది?
1) ఒకే ఒక జీవి
2) సమవిభజన మాత్రమే జరగడం వల్ల
3) సంయోగబీజాలు ఏర్పడటం వల్ల
4) జనకుని పోలిన పిల్లతరం ఏర్పడటం వల్ల - పురుష హార్మోన్ దేనినుంచి సంశ్లేషణం అవుతుంది?
1) శుక్రోత్రాదక నాళికలు 2) లేడిగ్ కణాలు
3) సర్టోలిక కణాలు
4) ఘనాకార కణాలు - ఇథనాల్ ఉత్పత్తిలో ఏ బ్యాక్టీరియం తోడ్పడుతుంది?
1) జైమోమోనాస్ మొబిలిస్
2) జాంతోమోనాస్ ఒరైజే
3) సఖారోమైసిస్ సెరివీసియే
4) లాక్టోబాసిల్లస్ బల్గారికస్ - పితృకవలలు (Fraternal twins) ఏ పద్ధతి ద్వారా ఏర్పడుతుంది?
1) ఒకేసారి రెండు అండాల ఫలదీకరణం వల్ల
2) ఫలదీకరణం చెందిన ఒక అండం రెండుగా విభజించడం వల్ల
3) ఒక అండాన్ని రెండు శుక్రకణాలు
ఫలదీకరణ చేయడం వల్ల
4) రెండు అండాలు ఫలదీకరణ లేకుండా జరిగే వృద్ధి వల్ల - మానవునిలో బట్టతలకు కారణం?
1) లింగపరిమిత జన్యువులు
2) Y- సహలగ్న జన్యువులు
3) లింగ సహలగ్న జన్యువులు
4) లింగ ప్రభావిత జన్యువులు - ఒక బీజకణం సాధారణంగా కలిగి ఉండేవి?
1) జన్యువు అన్ని యుగ్మవికల్పకాలు
2) జన్యువు అనేకమైన యుగ్మ వికల్పకాలు
3) జన్యువు ఒక యుగ్మవికల్పకం
4) జన్యువు రెండు యుగ్మవికల్పకాలు - ఊపిరితిత్తుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం?
1) టినిడియం 2) అల్వియోలస్
3) ట్రేకియోల్ 4) పాపులా - వైరస్ల గురించి చర్చించే శాస్ర్తాన్ని ఏమంటారు?
1) బ్యాక్టీరియాలజీ 2) వైరాలజీ
3) మైకాలజీ 4) పైకాలజీ - బాహ్యంగా స్త్రీ, పురుష జీవులను గుర్తించగలగడాన్ని ఏమంటారు?
1) లైంగిక పరిపక్వత 2) లింగవ్యతిరేకత
3) సెక్స్ పిబాల్డిస్
4) లైంగిక ద్విరూపకత - ఎర్రరక్తకణాల జీవిత కాలం?
1) 10-12రోజులు 2) 12-13రోజులు
3) 120 రోజులు 4) 3-10రోజులు - గాయమైన ప్రదేశంలో రక్తం గడ్డకట్టడంలో ఉపయోగపడేది?
1) ఎరిత్రోసైట్లు 2) ల్యూకోసైట్లు
3) థ్రాంబోసైట్లు 4) ఏదీకాదు - చర్మంలో స్పర్శాజ్ఞానం కలుగచేసే గ్రాహకాలను ఏమంటారు?
1) రుఫినిగ్రాహకాలు
2) దిగంబర నాడీపోగులు
3) పిసీనియన్ గ్రాహకాలు
4) మిన్నర్స్ గ్రాహకాలు - శ్వాసకోసపు చేపలు ఏ క్రమానికి చెందినవి?
1) డిప్నాయ్ 2) క్రాసోస్టెరిజై
3) ఇలాస్మోబ్రాంఖై 4) హోలోసెఫాలి - పరాన్నజీవ, ప్లాజిల్లేట్ అలవలె కదిలించే త్వచం కలిగి ఉన్న పరాన్నజీవ ప్లాజిల్లేట్, ప్రత్యక్ష జీవిత చక్రం కలది ఏది?
1) ట్రిపనోసోయాగాంబియన్ని
2) ట్రైకోమోనాస్ వెజనాలిస్
3) జిమార్డియా లాంబ్లియా
4) చిలోమాస్ట్రిక్ మెస్నిలీ - జనెటిక్ కోడ్ నిర్ణయించేది?
1) జీవక్రియల మార్గాలు
2) రైబోజోమ్ల నిర్మాణం
3) ప్రొటీన్ టెర్షరి నిర్మాణం
4) పాలిపప్టైడ్లో ఉండే అమైనో ఆమ్లాల వరుసక్రమం - గాస్ట్రోపొడ జంతువుల్లో కనిపించే సౌష్టవ రహితానికి కారణం?
1) టెన్షన్, ఒత్తిడి 2) టార్షన్, మెలిక
3) రిలాక్సేషన్, ఒత్తిడి లేకుండుట
4) ఎలాంగేషన్ , సాగదీయబడుట - మానవుని దేహంలో నిశ్చలస్థితిని క్రమపరిచే గ్రాహకాలు ఏ భాగంలో ఉంటాయి?
1) ముక్కు 2) చెవి
3) కన్ను 4) చర్మం
వివిధ జీవుల్లో విసర్జన
ఏకకణ జీవుల్లో ప్రత్యేకమైన విసర్జకావయాలు ఉండవు. ఇవి వ్యర్థపదార్థాలను ‘వ్యాపన పద్ధతి’లో బయటకు పంపుతాయి.
అమీబా, పారామీషియం, యూగ్లీనా వంటి జీవుల్లో ‘సంకోచ రిక్తిక’ ద్వారా
ద్రవాభిసరణ క్రమత జరుగుతుంది.
విసర్జకావయవాలు ఏర్పడ్డ మొదటి జీవులు- ప్లాటిహెల్మెంథిస్కు చెందిన
ప్లనేరియా (బద్దెపురుగు)
బద్దెపురుగులోని విసర్జకావయవం- జ్వాలాకణం
వర్గం విసర్జకావయవం
ప్రొటోజోవా కణం ఉపరితలం నుంచి వ్యాపనం ద్వారా
పొరిఫెరా, సీలెంటరేటా నీటిప్రసరణ అన్ని కణాల ద్వారా జరుగుతుంది
ప్లాటిహెల్మెంథిస్ జ్వాలాకణాలు
నిమటొడా రెనెట్ కణాలు
అనెలిడా నెఫ్రీడియా (వృక్కాలు)
ఆర్థ్రోపొడా హరితగ్రంథులు, మాల్ఫీజియన్ నాళికలు
మొలస్కా మెటానెఫ్రీడియా
ఇఖైనోడర్మేటా జలప్రసరణ కుల్యా వ్యవస్థ
సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు మూత్రపిండాలు
ఒక జీవి తనను పోలిన తనలాంటి పిల్లజీవులను ఉత్పత్తిచేసే ప్రక్రియను
ప్రత్యుత్పత్తి అంటారు
ఒక జీవి తమజాతి నశించిపోకుండా కాపాడుకునే ప్రక్రియే ప్రత్యుత్పత్తి
ప్రత్యుత్పత్తి రెండు రకాలు అవి- 1. అలైంగిక ప్రత్యుత్పత్తి 2. లైంగిక ప్రత్యుత్పత్తి
అలైంగిక లైంగిక
ఒక జీవి పాల్గొంటుంది రెండు జీవులు పాల్గొంటాయి
బీజకణాల ఏర్పాటు, సంయోగబీజాల బీజకణాలు, సంయోగబీజాలు
కలయిక జరగదు కలయికతో ఏర్పడుతాయి
సంయుక్తబీజం ఏర్పడదు సంయోగబీజకణాలు ఏర్పడుతాయి
జన్యుపదార్థ బదిలీ జరుగుతుంది జన్యుపదార్థ బదిలీ జరుగుతుంది,
వినిమయం కూడా జరుగుతుంది
పరిణామ క్రమానికి తోడ్పడదు పరిణామ క్రమానికి తోడ్పడుతుంది
నిమ్నశ్రేణికి చెందిన జీవుల్లో జరుగుతుంది ఉన్నతశ్రేణి/స్థాయి జీవుల్లో జరుగుతుంది
ఉదా: హైడ్రా, అమీబా ఉదా: మానవుడు
Answers
1-2, 2-1, 3-3, 4-1, 5-2, 6-1, 7-2, 8-2, 9-4, 10-3
11-2, 12-3, 13-2, 14-2, 15-2, 16-4, 17-1, 18-1, 19-3, 20-2, 21-1, 22-3, 23-4, 24-3, 25-2, 26-2 , 27-4, 28-3, 29-3, 30-1, 31-1, 32-2, 33-4, 34-1, 35-1
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు