జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
1) కింది వాటిలో ఏ జీవి ఉష్ణ వలస చేయదు?
1) కప్ప 2) మొసలి
3) మానవుడు 4) నాగుపాము
2. డాఫ్నియాలో గుండ్రటి తల ఏ కాలంలో కనిపిస్తుంది?
1) వేసవి కాలం
2) ఆకురాలే కాలం
3) చలికాలం 4) వసంతకాలం
3. శరీర పరిమాణం ఉష్ణోగ్రతకు గల సంబంధాన్ని కింది ఏ సూత్రం వివరిస్తుంది?
1) ఎలెన్స్ సూత్రం
2) వాంట్హాఫ్ సూత్రం
3) బెర్గ్మన్స్ సూత్రం
4) గ్లోజర్స్ సూత్రం
4. ఎలెన్స్ సూత్రం ఉష్ణ్రోగ్రత ప్రభావం కింది వాటిలో దేన్ని వివరిస్తుంది?
1) చెవి పరిమాణం
2) వర్గీకరణ
3) జీవక్రియ రేటు
4) వెన్నుపూసల సంఖ్య
5. నీటి ఆవాసం ఎన్ని విభాలుగా విభజించారు?
1) మంచినీటి ఆవాసం
2) సముద్ర ఆవాసం
3) నదీ ముఖద్వారా ఆవాసం
4) 1, 2, 3
6. వాతావరణం, భూమి మధ్య నీటి భ్రమణాన్ని ఏమంటారు?
1) హైడ్రోలాజికల్ చక్రం
2) బాష్పోత్సేకం
3) వర్షాలు 4) అవక్షేపం
7. అమీబాలో ద్రవాభిసరణ క్రమతకు కింది ఏ అవయవం సహాయపడుతుంది?
1) కేంద్రకం 2) ఆహార రిక్తికలు
3) సంకోచ రిక్తికలు
4) మిథ్యా పాదాలు
8. జీవులు వేసవికాలంలో ప్రతికూల పరిస్థితుల నుంచి తట్టుకొనే ప్రక్రియను ఏమంటారు?
1) శీతాకాల సుప్తావస్థ
2) గ్రీష్మకాల సుప్తావస్థ
3) గ్రీష్మకాల స్తరీభవనం
4) శీతాకాల స్తరీభవనం
9. ఏ భౌతిక ప్రక్రియలో శరీరం నుంచి నీరు తొలగించడం జరుగుతుంది?
1) ఎండాస్మాసిస్ 2) ఎక్సాస్మాసిస్
3) పీల్చుకోవడం 4) వ్యాపనం
10. ఎశ్చురీ అంటే?
1) కుంట నీరు నదిలో కలవడం
2) వరదనీరు నదిలో కలవడం
3) సముద్ర అలలు కుంటలో కలవడం
4) నది సముద్రంలో కలవడం
11. ఆవరణ వ్యవస్థలో ఏది నిర్ణిత కారకం కాదు?
1) కాంతి 2) ఉష్ణోగ్రత
3) వాతావరణ పీడనం
4) పరాన్నజీవి
12. హైపోక్సియా అంటే?
1) O2 అధికంగా లభించడం
2) O2 లభించకపోవడం
3) O2 దొరికినా జీవి దాన్ని తీసుకోకపోవడం
4) శ్వాసనాళానికి వ్యాధి సోకడం వల్ల శ్వాసవ్యవస్థ విఫలమవడం
13. జీవ సందీప్తిని సాధారణంగా ఇలా కూడా అంటారు?
1) పరారుణ కాంతి 2) ఉష్ణకాంతి
3) చల్లని కాంతి
4) అతి నీలలోహిత కాంతి
14. జీవసందీప్తిని చూపే అనెలిడా జంతువు ఏది?
1) అరీలియా 2) కీటా ప్టెరస్
3) హాటిరోనీరిస్ 4) పైరోసోమా
15. జంతువులో కాంతి ఉత్పత్తి కావడానికి ఉపయోగించే రసాయనం?
1) ఆక్సీల్యూసి ఫెరిన్
2) ఆక్సీల్యూసి ఫెరేజ్
3) ల్యూసి ఫెరేజ్
4) ల్యూసి ఫెరిన్
16. జీవ సందీప్తీలో చివరి ఉత్పన్నకాలు?
1) లూసిఫెరిన్, ఆక్సిజన్
2) ఆక్సీల్యూసిఫెరిన్, నీరు
3) ఆక్సీల్యూసిఫెరిన్, ఏటీపీ
4) ఆక్సీల్యూసిఫెరిన్, నీరు, కాంతి
17. జీవావరణ వ్యవస్థలో శక్తికి మూలాధారం?
1) నీరు 2) సూర్యకాంతి
3) పిండి పదార్థం 4) ఏటీపీ
18. అకెల్లోపతి అంటే ఏమిటి?
1) కణకీలితాల ఆధారంగా జాతుల మధ్య సంబంధాలు
2) ఆహారజాలకంలోని భాగం
3) వ్యాధి నివారణకు మందులు వాడటం
4) రసాయనిక పదార్థాల ఆధారంగా జాతుల మధ్య పరస్పర సంబంధాలు
19. మొత్తం జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
1) ప్రాథమిక వినియోగదారులు
2) ద్వితీయ వినియోగదారులు
3) ప్రాథమిక ఉత్పత్తి దారులు
4) ద్వితీయ ఉత్పత్తి దారులు
20. కప్ప, కుక్క తోడేలు దేనికి ఉదాహరణలు?
1) ప్రాథమిక వినియోగదారులు
2) ద్వితీయ వినియోగదారులు
3) ద్వితీయ ఉత్పత్తి దారులు
4) ప్రాథమిక ఉత్పత్తిదారులు
21. ఆవరణ వ్యవస్థ పనిచేయడానికి కావలసిన శక్తి మూలకం?
1) మొక్కలు 2) శాకాహారులు
3) ఏటీపీ 4) సౌరశక్తి
22. మేసే ఆహార గొలుసులో మూడో పోషణ స్థాయి?
1) ప్రాథమిక వినియోగదారులు
2) ద్వితీయ వినియోగదారులు
3) ప్రాథమిక ఉత్పత్తిదారులు
4) ద్వితీయ మాంసాహారులు
23. కింది వాటిలో భూమిపైన ప్రాథమిక ఉత్పత్తిని ఏది ప్రారంభిస్తుంది?
1) కాంతి 2) శాకాహారులు
3) విచ్ఛేదనకారులు 4) ఏటీపీ
24. గద్ద, సింహం, పులి?
1) ప్రాథమిక వినియోగదారులు
2) ద్వితీయ వినియోగదారులు
3) ప్రాథమిక మాంసాహారులు
4) ప్రథమ పోషక స్థాయిని ఆక్రమిస్తాయి
25. మేసే ఆహార గొలు గరిష్ఠ పోషక స్థాయి జీవులు?
1) పతాక మాంసాహారులు
2) శాకాహారులు
3) ప్రాథమిక మాంసాహారులు
4) విచ్ఛేదనకారులు
26. కింది వాటిలో ఏ జీవి సూక్ష్మ వినియోగదారి కాదు?
1) పూతికాహార భక్షకి
2) ప్రోటిస్టులు 3) డెట్రివోర్స్
4) లవణీకరణకారులు
27. ఏ సహజీవనంలో ఒక జీవికి హాని జరిగి, మరొక జీవికి ఏమికాదు?
1) సహభోజకత్వం
2) అన్యోన్యాశ్రయం
3) పరభక్షణం 4) ఎమెన్సలిజమ్
28. సాధారణంగా ఒక ఆహార గొలుసులో ఎన్ని పోషణ స్థాయిలు ఉంటాయి?
1) 1, 2 2) 2, 3
3) 4, 5 4) 6, 8
29. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రతిపాదించినది ఎవరు?
1) హెకెల్ 2) ఎ.జి. టాన్ స్లే
3) రీటర్ 4) లంకాస్టర్
30. జీవావరణ శాస్ర్తాన్ని నిర్వచించి ఉపయోగించినది?
1) రీటర్ 2) హెకెల్
3) లంకాస్టర్ 4) టాన్స్లే
31. ఒయికాస్ అనే గ్రీకు పదానికి అర్థం?
1) స్థితి 2) ఆవాసం
3) జనాభా 4) సమాజం
32. జీవగ్రహం అని దేన్ని అంటారు?
1) చంద్రుడు 2) భూమి
3) సూర్యుడు 4) పైవన్నీ
33. గాలి, నీరు మొదలైన భౌతిక అంశాలన్నింటిని ఏమంటారు?
1) సాంస్కృతిక పర్యావరణం
2) సామాజిక పర్యావరణం
3) జీవ పర్యావరణం
4) నిర్జీవ పర్యావరణం
34. భూమిపై గల నేల భాగాన్ని ఏమంటారు?
1) జలావరణం 2) వాతావరణం
3) శిలావరణం 4) పైవన్నీ
35. గాలిలోని వాయువుల భాగాన్ని ఏమంటారు?
1) శిలావరణం 2) జలావరణం
3) వాతావరణం 4) పైవేవీకాదు
36. భూమిపై శక్తికి మూలాధారం ఎవరు?
1) నీరు 2) సూర్యుడు
3) గాలి 4) నేల
37. మొక్కలు ఏ వాయువును ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేస్తాయి?
1) నైట్రోజన్ 2) ఆక్సిజన్
3) కార్బన్ డై ఆక్సైడ్
4) పైవన్నీ
38. భూగోళ ఉపరితలంలో ఎంత శాతం నీరు ఆవరించి ఉంది?
1) 40 శాతం 2) 80 శాతం
3) 90 శాతం 4) 70 శాతం
39. సామాజిక, సాంస్కృతిక పర్యావరణం అని దేన్ని అంటారు?
1) జీవ పర్యావరణం
2) నిర్జీవ పర్యావరణం
3) మానవ నిర్మిత పర్యావరణం
4) పైవేవీకాదు
40. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశం?
1) ఎడారులు 2) అడవులు
3) ధ్రువాలు 4) కొలనులు
41. భూ ఉపరితలంలో నేల ఎంత భాగాన్ని ఆవరించి ఉంది?
1) 90 శాతం 2) 80 శాతం
3) 30 శాతం 4) ఏదీకాదు
42. భూ ఉపరితంపై గల మెత్తటి మట్టిని ఏమంటారు?
1) కృతిక 2) మృత్తిక
3) 1, 2 4) ఏదీకాదు
43. మంచినీరు ఎక్కువ భాగం ఏ ప్రదేశంలో ఉంది?
1) సముద్రాలు 2) నదులు
3) సరస్సులు
4) ధృవప్రాంతంలోని మంచు
44. కింది వాటిలో ఉత్పత్తి దారులను గుర్తించండి?
1) మనుషులు 2) మొక్కలు
3) జంతువులు 4) పైవేవీకావు
45. కింది వాటిలో పరపోషకాలను గుర్తించండి?
1) జంతువులు 2) మొక్కలు
3) 1, 2 4) పైవేవీకాదు
46. మొక్కలు ఆహారం తయారు చేసుకొనుటకు ఉపయోగించే కారకం?
1) ఉష్ణం 2) కాంతి
3) నీరు 4) ఏదీకాదు
47. కేవలం మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకునే జంతువులను ఏమంటారు?
1) వినియోగదారులు
2) ప్రథమ వినియోగదారులు
3) ఉత్పత్తి దారులు
4) శాకాహారులు
48. కింది వాటిలో ప్రథమ వినియోగదారులను గుర్తించండి?
1) మొక్కలు 2) శాకాహారులు
3) జంతువులు 4) పైవేవీకావు
49. కింది వాటిలో ద్వితీయ వినియోగ దారులను గుర్తించండి?
1) మేక 2) కుందేలు
3) చిలుక 4) తోడేళ్ళు
50. నేలలో ఉండే కొన్ని సూక్ష్మ జీవులు, జంతువులను కుళ్లింపచేసి వాటి నుంచి భిన్న మూలకాలు విడుదల చేస్తాయి. వాటిని ఏమంటారు?
1) మాంసాహారులు
2) విచ్ఛిన్నకారులు
3) వినియోగదారులు
4) పైవేవీకావు
51. మొక్కలు, జంతువుల మధ్య ఆహారం ద్వారా ఏర్పడే బంధాన్ని ఏమంటారు?
1) ఆహారపు గొలుసులు
2) పరస్పర ఆధారం
3) 1, 2 4) పైవేవీకాదు
52. మొక్కల పెరుగుదలకు కావలసిన ఉష్ణోగ్రత?
1) 50O-60O 2) 20O-30O
3) 30O-40O 4) 0O-10O
53. ఎడారి మొక్కలకు ఉదాహరణ?
1) మల్లె 2) జాజి
3) తులసి 4) బ్రహ్మజెముడు
54. ఎడారి జంతువులను గుర్తించండి?
1) ఒంటె 2) జడలబర్రె
3) అడవిమృగం 4) ఏదీకాదు
55. విశ్వద్రావణి అంటే?
1) గాలి 2) నేల
3) నీరు 4) పైవన్నీ
56. మొక్కల పెరుగుదలకు ఉపయోగపడేది?
1) ఆక్సిజన్ 2) నీరు
3) హ్యూమస్ 4) పైవేవీకాదు
57. సహజ వనరుల రకాలు ఎన్ని?
1) ఒకటి 2) రెండు
3) మూడు 4) నాలుగు
58. కింది వాటిలో పునరుద్ధరించదగిన వనరు ఏది?
1) నీరు 2) ముడిఖనిజాలు
3) పెట్రోలియం 4) బొగ్గు

Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






