Current affairs | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
ఫిబ్రవరి 15 తేదీ తరువాయి.
101. 1956-57లో తెలంగాణ ప్రాంతంలో నీటి పారుదల కింద ఉన్న స్థూల భూమి (లక్షల ఎకరాల్లో) 1967-68 నాటికి..
1) గణనీయంగా పెరిగింది
2) గణనీయంగా తగ్గింది
3) నామమాత్రంగా పెరిగింది
4) నామమాత్రంగా తగ్గింది
102. 1956-57లో తెలంగాణ ప్రాంతంలో సాగు విస్తీర్ణం (లక్షల ఎకరాల్లో) 1967-68 నాటికి..
1) స్వల్పంగా పెరిగింది
2) స్వల్పంగా తగ్గింది
3) అతి స్వల్పంగా పెరిగింది
4) అతి స్వల్పంగా తగ్గింది
103. ఏ కమిటీ నివేదికలో తెలంగాణ అభివృద్ధి స్థాయి భారతదేశ అభివృద్ధి స్థాయి కంటే తక్కువగా ఉందని నిర్ధారించింది? (1969 ప్రాంతంలో)
1) లలిత్ కుమార్ 2) భార్గవ్
3) తెలంగాణ ప్రాంతీయ కమిటీ
4) ఏదీకాదు
104. 1956-57 నుంచి 1965-66 నాటికి కింది ఏ అంశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వాటాకు సంబంధించి ఏ విధమైన మార్పులేదు?
1) విద్యుత్ మోటార్లు
2) పశువుల దవాఖానాలు
3) విద్యుత్ సబ్స్టేషన్లు
4) ఏదీకాదు
105. 1967-68 నాటికి తెలంగాణలో గ్రామీణ విద్యుదీకరణ వాటా ఏ విధంగా ఉంది?
1) మూడో వంతుకు సమానం
2) మూడో వంతు కంటే తక్కువ
3) మూడో వంతు కంటే ఎక్కువ
4) ఏదీకాదు
106. 1956-69 మధ్య కాలంలో కుమార్ లలిత్ నివేదిక ప్రకారం తెలంగాణ-ఆంధ్రాలో వాస్తవంగా జరిగిన వ్యయ నిష్పత్తి?
1) 1:2.3 2) 1:2.4
3) 1:2.2 4) 1:2.5
107. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. రెండో ప్రణాళిక కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయంలో తెలంగాణ వాటా > తెలంగాణలో ఖర్చుపెట్టిన ప్రణాళిక వ్యయం
బి. మూడో ప్రణాళిక కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయంలో తెలంగాణ వాటా < తెలంగాణలో ఖర్చుపెట్టిన ప్రణాళిక వ్యయం
1) ఎ, బి సరైనది
2) ఎ సరైనది, బి సరికాదు
3) ఎ, బి సరికావు
4) ఎ సరికాదు, బి సరైనది
108. రెండో ప్రణాళిక కాలానికి ఉమ్మడి రాష్ట్రంలో నీటి పారుదల సామర్థ్యం ఆంధ్రా-తెలంగాణలో ఏ నిష్పత్తిలో ఉంది?
1) 3.4:1 2) 3.5:1
3) 3.6:1 4) ఏదీకాదు
109. 2, 3 పంచవర్ష ప్రణాళికల్లో పరిశ్రమలు, గనులపై జరిగిన వ్యయంలో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల వారీగా..
1) దాదాపు సమానం
2) భారీ వ్యత్యాసం ఉంది
3) అల్ప వ్యత్యాసం ఉంది 4) ఏదీకాదు
110. 1957-66 మధ్య ఫ్యాక్టరీల చట్టం కింద నమోదైన ఫ్యాక్టరీల సంఖ్య పెరుగుదల ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో (శాతం పరంగా)..
1) చాలా తక్కువ 2) సమానం
3) చాలా ఎక్కువ 4) ఏదీకాదు
111. 1956-57 నుంచి 1967-68 మధ్య కాలంలో తెలంగాణలో ఆర్థికాభివృద్ధి జరగకుండా చేసిన ముఖ్య కారణాల్లో సరైనవి?
ఎ. వ్యయ నిష్పత్తి 2:1 (ఆంధ్ర, తెలంగాణ) మధ్య అన్ని అంశాలకు వర్తింపజేయడం
బి. తెలంగాణకు సంబంధించిన మిగులును తెలంగాణలో ఖర్చు పెట్టాలనే అంశాన్ని నిర్వీర్య పర్చడం
1) ఎ, బి సరికావు
2) ఎ, బి సరైనవి
3) ఎ సరికాదు, బి సరైనది
4) ఎ సరైనది, బి సరికాదు
112. 2005లో ఆ నాటి ప్రభుత్వం నియమించిన గిర్గ్లానీ ఏక సభ్య కమిషన్ మొత్తంగా తెలంగాణ ప్రాంతంవారు ఎన్ని లక్షల ఉద్యోగాలు కోల్పోయారని తేల్చింది?
1) 3 లక్షలు 2) 3.5 లక్షలు
3) 2 లక్షలు 4) 2.5 లక్షలు
113. కింది ఎవరి ఆధ్వర్యంలో విద్యుత్ ప్రాజెక్టులను తెలంగాణ నుంచి తరలించి ఆంధ్ర, రాయలసీమలో నెలకొల్పారు?
1) కేఎల్ రావు 2) నార్ల తాతారావు
3) నీలం సంజీవరెడ్డి 4) ఏదీకాదు
114. 1960-61 నుంచి 2010-11 వరకు జీఎస్డీపీలో తెలంగాణ వాటా (ఉమ్మడి రాష్ట్రంలో)
1) పెరుగుతూ వచ్చింది
2) తగ్గుతూ వచ్చింది
3) మార్పులేదు
4) ఏదీకాదు
నోట్: 1960-61లో జీఎస్డీపీలో తెలంగాణ వాటా 31 శాతం నుంచి 2010-11 వరకు 44 శాతంగా ఉంది.
115. రంగరాజన్ కమిటీ 2014, జూలైలో ఇచ్చిన పేదరికం అంచనాల ప్రకారం..
1) పేదరికం శాతం తెలంగాణలో ఆంధ్రా ప్రాంతం కంటే ఎక్కువ
2) పేదరికం శాతం తెలంగాణలో ఆంధ్రా ప్రాంతం కంటే తక్కువ
3) పేదరికం శాతం తెలంగాణలో ఆంధ్రా ప్రాంతంతో దాదాపు సమానం
4) ఏదీకాదు
నోట్: పేదరికం తెలంగాణలో 10 శాతం, ఆంధ్రాలో 16.3 శాతంగా ఉంది.
116. ఉమ్మడి రాష్ట్రంలో 1956లో బోరుబావుల కింద ఉన్న సాగు 2 లక్షల ఎకరాల నుంచి 2008 వరకు దాదాపు ఎన్ని లక్షల ఎకరాలకు పెరిగింది?
1) 30 లక్షల ఎకరాలు
2) 40 లక్షల ఎకరాలు
3) 50 లక్షల ఎకరాలు
4) 45 లక్షల ఎకరాలు
117. 1993-94 నుంచి 2013-14 వరకు తెలంగాణ రాష్ట్ర వార్షిక వృద్ధి రేటు దేశ తలసరి ఆదాయ వార్షిక వృద్ధి రేటు కంటే? (2009-10 కాకుండా)
1) ఎక్కువ 2) తక్కువ
3) సమానం 4) ఏదీకాదు
118. 1993-94 నుంచి 2013-14 వరకు మొత్తం తెలంగాణ ప్రాంత జీఎస్డీపీలో కింది ఏ జిల్లాలు గరిష్ఠ వాటా కలిగి ఉన్నాయి?
1) మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్
2) రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్
3) రంగారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్
4) హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్
119. 1993-94 నుంచి 2013-14 మధ్య ఏ రంగంలో తెలంగాణ ప్రాంత జీఎస్డీపీలో ధనాత్మక వృద్ధి రేటు కనిపిస్తుంది?
1) వ్యవసాయం 2) పరిశ్రమలు
3) సేవారంగం 4) ఏదీకాదు
120. హైదరాబాద్ ప్రభుత్వం 70 లక్షల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించాలనే ప్రణాళికతో సిద్ధం చేసిన కృష్ణా బేసిన్‌లోని ఏ ప్రాజెక్టులను ఆంధ్రా పాలకులు అటకెక్కించారు?
ఎ. తుంగభద్ర ఎడమ కాల్వ
బి. ఎగువ కృష్ణా కుడి కాల్వ సి. భీమ
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
121. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. తెలంగాణలో కృష్ణా నది పరీవాహకం 68 శాతం ఉండగా 35 శాతం మాత్రమే నీటి కేటాయింపు జరిగింది
బి. 1969లో ఆర్ఎస్ బచావత్ కమిటీ గోదావరి జలాల పంపిణీని చేపట్టింది
1) ఎ, బి సరైనవి 2) ఎ, బి సరికాదు
3) ఎ సరికాదు, బి సరైనది
4) ఎ సరైనది, బి సరికాదు
122. కింది ఏ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1956-70 మధ్య నిరాదరణకు గురయ్యాయి?
ఎ. బోధన్- చక్కెర కర్మాగారం
బి. వరంగల్ ఆజంజాహీ మిల్లు
సి. సిర్పూర్- పేపర్ పరిశ్రమ
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
123. తెలంగాణ అభివృద్ధి వేదిక ఏర్పాటు చేసిన కార్యనిర్వాహక బృందం శ్రీకృష్ణ కమిటీకి 53 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా యువత దాదాపు ఎన్ని లక్షల ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొంది?
1) 2 లక్షలు 2) 2.5 లక్షలు
3) 1.5 లక్షలు 4) ఏదీకాదు
124. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ వెనుకబడటానికి కారణం?
ఎ. చారిత్రక అంశాలు
బి. సామాజిక అంశాలు
సి. ఉమ్మడి పాలకుల వివక్ష
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఏదీకాదు
125. 1982-83 నుంచి 2011-12 వరకు దేని ద్వారా సాగవుతున్న భూమి క్రమేపీ పెరుగుతూ వచ్చింది?
1) కాల్వలు 2) చెరువులు
3) బోరుబావులు 4) ఇతర బావులు
126. 1983-84 సంవత్సరానికి సంబంధించి కింది ఏ జిల్లాల్లో బీడీ పరిశ్రమ కేంద్రీకృతమైంది?
1) హైదరాబాద్, మెదక్
2) మెదక్, కరీంనగర్
3) కరీంనగర్, నిజామాబాద్
4) మెదక్, నిజామాబాద్
127. 1966-67 నుంచి 2004-05 విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా నెలకొల్పాల్సిన ఎంత విద్యుత్‌ను తెలంగాణ కోల్పోవాల్సి వచ్చింది (ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం వల్ల)?
1) 4617 మెగావాట్లు
2) 4176 మెగావాట్లు
3) 4716 మెగావాట్లు 4) ఏదీకాదు
128. 2012-13లో 70వ జాతీయ శాంపిల్ సర్వే నివేదిక ప్రకారం తెలంగాణ రైతుల రుణగ్రస్తతలో ఉన్న వ్యవసాయ కుటుంబాల శాతం?
1) 89 2) 98 2) 87 4) 78
129. కింది ఎవరి అధ్యయనం ప్రకారం ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 1981, 91 దశాబ్దంలో వలస వచ్చిన వారి సంఖ్య వలస వెళ్లిన వారి సంఖ్య కంటే ఎక్కువ?
ఎ. జేమ్స్ బి. సుబ్రమణియన్
సి. కిషన్ రావు డి. రాహుల్ శాస్త్రి
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, డి
130. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయ సంక్షోభానికి కారణం?
ఎ. బోరుబావుల మీద చేసిన అధిక ఖర్చు
బి. తక్కువ వర్షపాతం నమోదు
సి. సంస్థాగత పరపతి తక్కువ
1) ఎ 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) ఎ, సి
131. వివిధ రకాల అధ్యయనాల ప్రకారం తెలంగాణ ప్రాంతానికి వ్యవసాయంలో ఉన్న వనరులను గరిష్ఠంగా ఉపయోగిస్తే ఉత్పాదకత ఎంత శాతం పెరుగుతుందని అంచనా?
1) 28 2) 38 3) 18 4) ఏదీకాదు
132. కింది ఏ సంవత్సరంలో తెలంగాణలో జీఎస్డీపీ వృద్ధి రేటు గరిష్ఠం?
1) 2010-11 2) 2011-12
3) 2012-13 4) 2013-14
2010-11- 18 శాతం
2011-12- 9 శాతం
2012-13- 4 శాతం
2013-14- 5 శాతం
ఆధారం: భారతదేశ జాతీయ ఆదాయ గణాంకాలు 2004-05.
133. 1993-94 నుంచి 2013-14 మధ్య రాష్ట్ర జీఎస్డీపీలో..
1) వ్యవసాయ రంగం వాటా పెరిగి పారిశ్రామిక రంగం వాటా తగ్గుతుంది
2) వ్యవసాయ రంగం వాటా పెరిగి సేవారంగం వాటా తగ్గుతుంది
3) పారిశ్రామిక రంగం వాటా పెరిగి సేవారంగం వాటా తగ్గుతుంది
4) వ్యవసాయ రంగం వాటా తగ్గి సేవారంగం వాటా పెరుగుతుంది
134. కింది ఏ సంవత్సరంలో వ్యవసాయ జీఎస్డీపీలో రుణాత్మక వృద్ధిరేటు నమోదయ్యింది?
1) 2010-11 2) 2009-10
3) 2008-09 4) 2011-12
2009-10- 12 శాతం
2010-11- 19 శాతం
2008-09- 6 శాతం
2011-12 దాదాపు శూన్యం
ఆధారం: నేషనల్ అకౌంట్స్, స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా (2004-05 శ్రేణులు).
135. 1993-94 నుంచి 2013-14 మధ్యకాలానికి సేవారంగంలో
1) రుణాత్మక వృద్ధిరేటు
2) ధనాత్మక వృద్ధిరేటు
3) చెప్పుకోదగ్గ మార్పు లేదు
4) ఏదీకాదు
136. 2013-14లో జీఎస్డీపీలో హైదరాబాద్ జిల్లా వాటా?
1) 18 శాతం 2) 19 శాతం
3) 20 శాతం 4) 25 శాతం
137. 2013-14లో జీఎస్డీపీలో ఏ జిల్లా అత్యల్ప వాటా కలిగి ఉంది?
1) నిజామాబాద్ 2) ఆదిలాబాద్
3) కరీంనగర్ 4) వరంగల్
నిజామాబాద్- 5.02 శాతం
ఆదిలాబాద్- 5.25 శాతం
కరీంనగర్- 9.65 శాతం
వరంగల్- 7.10 శాతం
ఆధారం: భారతదేశ జాతీయ ఆదాయ గణాంకాలు
138. 2010-11 నుంచి 2013-14 వరకు దేశీయ తలసరి ఆదాయం తెలంగాణ తలసరి ఆదాయం కంటే..
1) తక్కువ 2) ఎక్కువ
3) దాదాపు సమానం 4) ఏదీకాదు
తెలంగాణ భారతదేశం
2010-11 43354 41472
2011-12 45277 43657
2012-13 47100 45046
2013-14 48880 46568
ఆధారం: భారతదేశ జాతీయ ఆదాయ గణాంకాలు 2004-05.
139. తెలంగాణలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లాలు?
ఎ. హైదరాబాద్ బి. రంగారెడ్డి సి. మెదక్
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
ఫిబ్రవరి 1 తేదీ తరువాయి.
73. రాష్ట్రంలో అత్యధికంగా ఖనిజ పరిశ్రమలు ఉన్న జిల్లా?
1) జోగులాంబ గద్వాల 2) ఖమ్మం
3) వికారాబాద్ 4) కుమ్రంభీం
74. కేంద్ర గనుల శాఖ వార్షిక నివేదిక 2020-21 ప్రకారం మొత్తం ఖనిజ ఉత్పత్తిలో రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది?
1) రెండో స్థానం 2) మూడో స్థానం
3) నాలుగో స్థానం 4) ఐదో స్థానం
75. రాష్ట్రంలో సుమారు 75% బొగ్గు నిల్వలు ఏ మూడు జిల్లాల్లో ఉన్నాయి?
1) మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర భూపాలపల్లి
2) మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం
3) పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు
4) మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు
76. రాష్ట్రంలోని మొదటి థర్మల్ పవర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి 2020 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి అవుతుంది?
1) 75 2) 50
3) 100 4) 50
77. SCCL సింగరేణి వారు జియో థర్మల్ విద్యుత్ ప్లాంటును ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు?
1) మంచిర్యాల 2) పెద్దపల్లి
3) కరీంనగర్ 4) భద్రాద్రి కొత్తగూడెం
78. రాష్ట్రంలో మొదటి సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ఏ జిల్లాలో స్థాపించారు?
1) పెద్దపల్లి 2) జోగులాంబ గద్వాల
3) నిజామాబాద్
4) భద్రాద్రి కొత్తగూడెం
79. జతపరచండి
1. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎ) 1937
2. ఆల్విన్ మెటల్ వర్క్స్ బి) 1942
3. డీబీఆర్ టెక్స్టైల్స్ సి) 1921
4. అజంజాహీ మిల్లు డి) 1934
ఇ) 1938
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి
80. VST దేనికి సంబంధించింది?
1) వస్త్ర పరిశ్రమ 2) పొగాకు పరిశ్రమ
3) కాగితం పరిశ్రమ
4) సిమెంట్ పరిశ్రమ
81. ‘వన్ ఫ్యామిలీ, వన్ విజన్, వన్ మిషన్’ ఏ సంస్థ స్లోగన్?
1) BHEL 2) BDL
3) SCCL 4) MIDHANI
82. కాగితపు పరిశ్రమలు, అవి ఉన్న ప్రదేశాలు
జతపరచండి.
ఎ. భద్రాచలం పేపర్ బోర్డు 1. ముత్తంగి
బి. ఏపీ రేయాన్స్ లిమిటెడ్ 2. పటాన్చెరు
సి. నాగార్జున పేపర్ మిల్స్ 3. కమలాపురం
డి. చార్మినార్ పేపర్ మిల్స్ 4. సారపాక
5. నాచంగూడెం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-3, సి-4, డి-5
4) ఎ-5, బి-4, సి-3, డి-2
83. జతపరచండి.
ఎ. అసోసియేటెడ్
సిమెంట్ కంపెని 1) మంచిర్యాల
బి. కేశోరామ్ సిమెంట్స్ 2) డిసంత్నగర్
సి. నాగార్జున సిమెంట్ 3) సింహపురి
డి. దక్కన్ సిమెంట్ 4) హుజూర్నగర్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-2, బి-1, సి-4, డి-3
84. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. బల్క్ డ్రగ్ & వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా-హైదరాబాద్
బి. సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ- పోచంపల్లి
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
85. తెలంగాణకు సంబంధించి మొదటిసారి భౌగోళిక గుర్తింపు పొందిన తొలి వస్తువు?
1) సిల్వర్ ఫిలిగ్రి 2) నిర్మల్ బొమ్మలు
3) నిర్మల్ చిత్రకళలు
4) పోచంపల్లి ఇక్కత్
86. ఈ-గోల్కొండ పోర్టల్ దేనికి సంబంధించింది?
1) హైదరాబాద్ టూరిజానికి సంబంధించింది
2) పురాతన వస్తువుల ఆన్లైన్ అమ్మకాలకు సంబంధించింది
3) హస్తకళా వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కోసం 4) ఏదీకాదు
87. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల పరిధిలో నెలకొల్పనున్న పరిశ్రమను గుర్తించండి?
1) జీనోమ్ వ్యాలీ
2) షాపూర్ జీ పల్లోంజి బయోటెక్ పార్కు
3) ఫార్మాసిటీ
4) మెడికల్ డివైజెస్ పార్కు
88. సరైన వాక్యాలు గుర్తించండి.
ఎ. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును నాగులపల్లి (మెదక్)లో ఏర్పాటు చేయనున్నారు
బి. మహిళా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్న ప్రాంతాలు సుల్తాన్పూర్ (సంగారెడ్డి), జడ్చర్ల (మహబూబ్‌నగర్)
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
89. జతపరచండి.
ఎ. ఐటీ సెజ్ 1. మహేశ్వరం
బి. ఏరోస్పేస్ సెజ్ 2. కరకపట్ల
సి. బయోటెక్ సెజ్ 3. ఆదిభట్ల
డి. హార్డ్‌వేర్ సెజ్ 4. నానక్‌రామ్‌గూడ
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-4, బి-1, సి-3, డి-2
90. హైదరాబాద్ తరహాలోనే ఏ జిల్లాలో ఐటీ టవర్లను నెలకొల్పడానికి చర్యలు తీసుకున్నారు?
ఎ. కరీంనగర్ బి. ఖమ్మం
సి. సిద్దిపేట
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
91. సరైన వాక్యాలు గుర్తించండి?
ఎ. తెలంగాణలో నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా దేశంలోని మొదటి రోడ్డు రవాణా సంస్థ 1932లో ఏర్పడింది
బి. నిజాం రాష్ట్ర రైల్వే, రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 27 బస్సులు, 166 మంది
కార్మికులతో ప్రారంభమైంది
1) ఎ 2) బి 3) ఎ, బి
4) ఎ, బి సరికావు
92. తెలంగాణలోని బస్సుల నంబర్ ప్లేట్లలో గల ‘Z’ అక్షరం దేన్ని సూచిస్తుంది?
1) 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తల్లి జహ్రాబేగం పేరులోని మొదటి అక్షరం
2) 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కోడలు జహ్రాబేగం పేరులోని మొదటి అక్షరం
3) 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రెండో కోడలు జహ్రాబేగం పేరులోని మొదటి అక్షరం
4) ఏదీకాదు
93. సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్-2022 ప్రకారం రాష్ట్రంలో గల జాతీయ రహదారుల సంఖ్య, పొడవు వరుసగా?
1) 23, 3810 కి.మీ.
2) 24, 3910 కి.మీ.
3) 23, 3910 కి.మీ. 4) ఏదీకాదు
94. సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ. రోడ్ల సాంద్రత అత్యధికంగా హైదరాబాద్‌లో కలదు
బి. రోడ్ల సాంద్రత అతి తక్కువగా ములుగులో కలదు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
95. SRDP దేనికి సంబంధించింది?
1) రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
2) రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
3) రైల్వే డెవలప్మెంట్ ప్రోగ్రామ్
4) ఏదీకాదు
96. హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి సరిగా జతపరచనివి గుర్తించండి.
ఎ. రెడ్‌లైన్- ఎంజీబీఎస్, జేబీఎస్
బి. బ్లూలైన్- మియాపూర్, ఎల్బీ నగర్
సి. గ్రీన్‌లైన్- నాగోల్, రాయదుర్గం
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి సరికావు
97. జతపరచండి
ఎ. స్కోల్ పెయింటింగ్ 1. చేర్యాల
బి. బిద్రి వస్తువులు 2. హైదరాబాద్
సి. సిల్వర్ ఫిలిగ్రి 3. కరీంనగర్
డి. ఇక్కత్ 4. పోచంపల్లి
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
98. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. రాష్ట్రంలో అత్యల్ప అక్షరాస్యత గల జిల్లాలు వరుసగా జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్ (శాతం పరంగా)
బి. రాష్ట్రంలో అధిక అక్షరాస్యత గల జిల్లాలు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హనుమకొండ (శాతం పరంగా)
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
99. సరైన వాక్యాలు గుర్తించండి.
ఎ. రాష్ట్రంలో అధిక లింగ నిష్పత్తి గల జిల్లా నిజామాబాద్
బి. రాష్ట్రంలో అల్ప లింగ నిష్పత్తి గల జిల్లా రంగారెడ్డి
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
100. సరైన వాక్యాలు ఏవి?
ఎ. రాష్ట్రంలో గ్రామీణ అక్షరాస్యుల శాతం అధికంగా గల జిల్లా మేడ్చల్
బి. రాష్ట్రంలో గ్రామీణ అక్షరాస్యుల శాతం అల్పంగా గల జిల్లా జోగులాంబ గద్వాల
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?