అజర్బైజాన్ గ్రాండ్ ప్రి టైటిల్ను గెలుచుకున్న నెదర్లాండ్స్ రేసర్ ఎవరు? (క్రీడలు) 22-06-2022
ఖేలో ఇండియా యూత్ గేమ్స్
హర్యానాలోని పంచకులలో జూన్ 4న ప్రారంభమైన 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కేఐవైజీ)-2021 జూన్ 13న ముగిశాయి. పతకాల పట్టికలో హర్యానా 52 స్వర్ణాలు, 39 రజతాలు, 46 కాంస్య పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర (45, 40, 40), కర్ణాటక (22, 17, 28), మణిపూర్ (19, 4, 5), కేరళ (18, 19, 18), ఢిల్లీ (15, 15, 49), తమిళనాడు (14, 14, 24), మధ్యప్రదేశ్ (12,11, 15), పంజాబ్ (11, 15, 16), రాజస్థాన్ (8, 9, 15) నిలిచాయి. తెలంగాణ (2, 4, 7) 21, ఆంధ్రప్రదేశ్ (4, 4, 5) 15వ స్థానాల్లో ఉన్నాయి.కర్ణాటక స్విమ్మర్ అనీష్ గౌడ అత్యధికంగా 6 స్వర్ణాలు సాధించాడు. మహారాష్ట్ర స్విమ్మర్ అపేక్ష ఫెర్నాండెజ్, జిమ్నాస్ట్ సంయుక్త కాలే 5 స్వర్ణాలు గెలుచుకున్నారు.

మాజీ ఒలింపియన్ మృతి
మాజీ ఒలింపియన్, లాంగ్డిస్టెన్స్ రన్నింగ్ క్రీడాకారుడు హరిచంద్ (69 ఏండ్లు) జూన్ 13న మరణించాడు. పంజాబ్లోని హోషియాపూర్కు చెందిన అతడు 1976 మాంట్రిల్, 1980 మాస్కో ఒలింపిక్స్లో పాల్గొన్నాడు. 1978 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించాడు.

అజర్బైజాన్ విజేత వెర్స్టాపెన్
అజర్బైజాన్ గ్రాండ్ ప్రి టైటిల్ను నెదర్లాండ్స్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలుచుకున్నాడు. జూన్ 12న జరిగిన మ్యాచ్లో సెర్గియో పెరెజ్ను ఓడించాడు. ఈ ఏడాదిలో అతడికిది ఐదో టైటిల్.
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






