Social Security – Health | సామాజిక భద్రత – ఆరోగ్యం
ఆర్థిక సంస్కరణల పర్యవసానాలు
దేశంలో ఆర్థిక సంస్కరణల ప్రారంభంతో అన్నిరంగాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్థికాభివృద్ధి ఊపందుకోవటం ఒక ఎత్తు అయితే, పారిశ్రామికీకరణ కారణంగా అప్పటివరకూ ఉన్న సంప్రదాయిక జీవనం క్రమంగా అంతర్థానం అవటం మరో వైపు కొనసాగుతున్నది. ఆర్థిక సంస్కరణల వల్ల ప్రజల ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో వచ్చిన మార్పుల గురించి నిపుణ పాఠకుల కోసం..
-కేంద్రం 1995, ఆగస్టు 15న జాతీయ సాంఘిక సహాయత పథకాన్ని ప్రారంభించింది. ఇందులో IGNOAPS (ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్), INWPS (ఇందిరాగాంధీ నేషనల్ విడో పెన్షన్ స్కీమ్), IGNDPS (ఇందిరాగాంధీ నేషనల్ డిసేబులిటీ పెన్షన్ స్కీమ్), NFBS (నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్) ఉన్నాయి.
IGNOAPS:
ఇది కేంద్ర గ్రామీణాభివృధ్ధి శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇందులో 60-79 ఏండ్ల వయస్సు గలవారికి నెలకు రూ. 200లు, 80 ఏండ్ల పై వయస్సు కలవారికి రూ. 500 పింఛనుగా అందిస్తారు.
IGNWPS:
ఇది 40 నుంచి 59 ఏండ్ల వారికి వర్తిస్తుంది. దీనిని 2009, ఫిబ్రవరి నుంచి ఎన్ఎస్ఏపీలో భాగంగా అమలుచేస్తున్నారు. ఇందులో భర్త చనిపోయిన స్త్రీకి నెలకు రూ. 300లు ఇస్తున్నారు.
IGNDPS:
అంగవైకల్యం కలవారు ఈ పథకానికి అర్హులు. 18 నుంచి 59 ఏండ్ల వయస్సు గలవారు అర్హులు.
-Persons with disability (PWD) 1995 చట్టం ప్రకారం అంగవైకల్యం 40 శాతం దాటిన వారికి వర్తిస్తుంది. ప్రతినెల రూ. 300లు పింఛనుగా అందిస్తారు.
-ఈ పథకాన్ని 2009, ఫిబ్రవరి నుంచి ఎన్ఎస్ఏపీలో భాగంగా అమలు చేస్తున్నారు.
NFBS:
18-64 వయస్సు కలిగి సంపాదించగలిగే వారు మరణిస్తే ఈ పథకం వర్తింపచేస్తారు. రూ. 20,000లు ఇస్తారు. గతంలో ఇది రూ. 10,000గా ఉండేది.
అన్నపూర్ణ పథకం:
2000 ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలవుతున్నది. వృద్ధులకు ఉచితంగా నెలకు 10 కేజీల ఆహార పదార్థాలు ఇస్తారు.
-ఎన్ఎస్ఏపీలో పేర్కొన్న ఏ పథకం వర్తించనప్పుడు అన్నపూర్ణ పథకం వర్తిస్తుంది.
-ఈ ఎన్ఎస్ఏపీలో ఉన్న పథకాలు Demand Driven కాదు. అంటే వీటిని తప్పనిసరిగా అమలుచేయాల్సిన అవసరం లేదు.
అసంఘటిత కార్మికుల పెన్షన్ (అటల్ పెన్షన్ యోజన)
-ఈ పథకాన్ని 2015, మే 9న ప్రారంభించారు. 18 నుంచి 40 ఏండ్ల వయస్సు గలవారు అర్హులు.
-లబ్ధిదారులు రూ. 1000 నుంచి రూ. 5000ల వరకు పెన్షన్ పొందవచ్చు.
-కేంద్ర ప్రభుత్వం ఐదేండ్ల వరకు సాలీనా రూ. 1000 మించకుండా జమచేస్తుంది.
-దేశంలో 11 శాతం ప్రజలు మాత్రమే ఏదో ఒక పెన్షన్ పథకాన్ని పొందుతున్నారు. వీరి సంఖ్యను పెంచడానికి అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)ను ప్రారంభించారు.
-రూ. 1000 పెన్షన్ కోసం రూ. 42లు, రూ. 5000 పింఛన్ కోసం రూ. 210లు చెల్లించాలి.
అసంఘటిత కార్మికులు-ఏఏబీవై
-భూమిలేని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. దీన్ని 2007, అక్టోబర్ 2న ప్రారంభించారు.
-18 నుంచి 59 ఏండ్ల వయస్సు గలవారికి వర్తిస్తుంది.
-రూ. 200ల ప్రీమియంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని ఎల్ఐసీ నిర్వహిస్తున్నది.
-సహజ మరణానికి రూ. 30,000లు, ఆకస్మిక మరణానికి రూ. 75,000లు, అంగవైకల్యానికి రూ. 37,500లు ఇస్తారు.
-ఈ పథకంలో జనశ్రీ బీమా యోజన (జేబీవై) కలిసిపోయింది. ఇది 2000, ఆగస్టు 10న ప్రారంభమైంది.
మహిళా భద్రత
రాజరాజేశ్వరి కళ్యాణ యోజన
-ఈ పథకాన్ని మహిళల భద్రత కోసం 1999లో ప్రారంభించారు. ఇది 10 నుంచి 75 ఏండ్ల వయస్సు గల మహిళలకు వర్తిస్తుంది.
-ప్రాథమిక భద్రత కోసం ప్రీమియంగా రూ. 15, అదనపు భద్రత కోసం రూ. 23 చెల్లించాలి.
-దీనిని జీఐసీ వారు నిర్వహిస్తారు.
-పాక్షిక అంగవైకల్యానికి రూ. 12,500, అంగవైకల్యానికి రూ. 25,000, భర్త మరణించిన స్త్రీకి రూ. 25,000లు ఇస్తారు.
భాగ్యశ్రీ బాలిక కల్యాణ యోజన
-బాలికల రక్షణ కోసం 1998-99లో ప్రారంభించారు. బాలిక తల్లి కానీ, తండ్రి కానీ లేదా ఇద్దరు మరణిస్తే ఆమెకు 18 ఏండ్లు వచ్చేవరకు నెలకు రూ. 1200 నుంచి రూ. 2400 ఆర్థిక సహాయం చేస్తారు.
-దీనికోసం రూ. 15 ప్రీమియం చెల్లించాలి.
పోషక భద్రత- ఐసీడీఎస్
-1975, అక్టోబర్ 2న సున్నా నుంచి 6 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలు, బాలింతలు, పాలిచ్చే తల్లుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. అంగన్వాడీల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
-పిల్లలకు 300 కి.క్యాలరీల ఆహారం, 8-10 గ్రాముల ప్రొటీన్, పెద్దలకు 500 కి.క్యాలరీల ఆహారం, 25 గ్రాముల ప్రొటీన్ అందుబాటులో ఉంటుంది.
-1963లో అప్లయిడ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, 1970లో స్పెషల్ న్యూట్రిషన్ ప్రొగ్రామ్‌లు ఉండేవి.
-ఈ సమగ్ర శిశు అభివృద్ధి సేవలను కేంద్ర ప్రభుత్వం అండన్వాడీ కేంద్రాల సహాయంతో అమలు చేస్తుంది.
బాలికల పోషక భద్రత
-11-18 ఏండ్ల వయస్సుగల బాలికల పోషక భద్రత కోసం 2011, ఏప్రిల్ 1న సబల (Rajiv Gandhi Scheme for Empowerment of Adolscent Girls)ను ప్రారంభించారు.
-ఈ పథకాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా నెలకు 6 కిలోల ధాన్యం ఉచితంగా అందిస్తారు.
-మధ్యాహ్న భోజనం అందుబాటులోలేని బాలికలకు ఈ పథకం వర్తిస్తుంది. ఇందులో ఆహారం, ఆరోగ్యం, నైపుణ్య శిక్షణ, వృత్తి విద్య మొదలైనవి కూడా నేర్పిస్తారు.
సామాజిక ప్రవర్తన
-దేశంలో చోటు చేసుకునే సామాజిక మార్పు ఆ దేశ ఆర్థిక పరిణామంతో సంబంధం కలిగి ఉంటుంది.
-ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పు తప్పకుండా సాంఘిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి (వస్తుసేవల పెరుగుదల)కి సాంఘిక వ్యవస్థ సహకరిస్తే ఆ దేశం సత్వర వృద్ధిని సాధిస్తుంది.
-అందువల్ల ఆర్థిక వృద్ధితోపాటు సాంఘిక వృద్ధి ఉంటే అది ఒక సమగ్ర అభివృద్ధిగా చెప్పవచ్చు. అందుకే దేశాలను తలసరి ఆదాయంతో కాకుండా మానవ అభివృద్ధి సూచీతో కొలుస్తున్నారు.
-సామాజికంగా చోటుచేసుకునే మార్పులు అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలి. కానీ అభివృద్ధికి ఆటంకంగా ఉండకూడదు.
-దేశంలో ప్రవేశపెట్టే ఆర్థిక సంస్కరణలు తప్పకుండా సాంఘిక మార్పును కూడా తీసుకురావాలి.
సామాజిక పరివర్తన
-ఆర్థిక అభివృద్ధికి సామాజిక పరివర్తన కూడా సహకరించాలి.
పారిశ్రామిక విప్లవం
-యూరప్‌లో పారిశ్రామిక విప్లవం రాకముందు వస్తువుల ఉత్పత్తిలో స్తబ్దత ఉండేది.
-పారిశ్రామిక విప్లవం వచ్చినతర్వాత వస్తు సేవల ఉత్పత్తి పెరగడంతో అవి తక్కువ ధరలకు లభించాయి. వాటి ఉపయోగం పెరిగి ప్రజల కొనుగోలు సారూప్యత సామర్థ్యం అధికమైంది. దీంతో జీవిత కాలం పెరిగింది.
-దేశంలో 32 ఏండ్ల జీవితకాలం 67 ఏండ్లకు చేరింది.
సాంఘిక పరివర్తన
-రెండో ప్రపంచ యుద్ధం అనంతరం కాలనీ వ్యవస్థ రద్దు (Decolonisation) అవడం వల్ల దేశాలన్నీ స్వాతంత్య్రం పొందాయి.
-సైమన్ కుజ్నెట్స్ ప్రకారం ఆర్థిక స్వేచ్ఛ అనంతరం ఆర్థిక పరిణామం జరుగుతున్నప్పుడు అసమానతలు తగ్గుతాయని తిరగేసిన U ప్రాకల్పనలో పేర్కొన్నారు.
-రెండో ప్రపంచ యుద్ధానంతరం సత్వర సామాజిక మార్పు చోటు చేసుకుంది.
Post Developmentalism
-ఆర్థికవేత్తల ప్రకారం అభివృద్ధి పూర్వం (Pre-Developmentalism) సమాజంలో మార్పులు స్వల్పంగా, అభివృద్ధి అనంతరం సామాజిక పరివర్తన సత్వరంగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి సాంఘిక మార్పులను ధనాత్మకంగా మారుస్తుంది.
-Negative Social Thinking నుంచి Possitive Social Thinking వైపు సమాజం మారుతుంది.
సామాజిక మార్పు-విద్య
-విద్య అనేది మానవ మూలధనంలో భాగం.
-అమెరికా వంటి బలమైన దేశాలు విద్యపై కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నాయి.
-భారతదేశంలో 8వ పంచవర్ష ప్రణాళికలో మానవ వనరులకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో ప్రవాసుల సంఖ్య పెరిగి, ఉపాధి కోసం వెళ్లి, తిరిగి ఉత్పత్తిదారులుగా దేశానికి వచ్చారు.
సమాచార సాంకేతికత
-దేశంలో 1980లో వచ్చిన ఐసీఆర్ (ఇన్ఫర్మేషన్, కమ్యునికేషన్, రెవల్యూషన్) వల్ల రాష్ట్రంలో ఈ-గవర్నెన్స్ పెరగడం, ప్రజల ఆదాయాలు అధికమవడంతో సాంఘిక మార్పు చేకూరింది.
-ఆర్థిక వ్యవస్థలో సాంకేతిక సమాచారం సేవల రంగంలోకి వస్తుంది. ఇందులో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సత్వర ఆర్థిక వృద్ధి సాంఘిక మార్పును కలిగి ఉంటుంది.
ఆత్మ నిబ్బరత
-ఆడంస్మిత్ ప్రకారం ప్రతి దేశం స్వేచ్ఛా వాణిజ్యాన్ని అనుసరించాలి.
-ఒకవేళ Closed Economy అంటే ఆత్మ నిబ్బరతను కలిగి ఉంటే సాంఘిక పరివర్తన చాలా నెమ్మదిగా ఉంటుంది.
-1991కి ముందు భారతదేశం ఆత్మనిబ్బరతను పాటించింది. దాంతో సాంఘిక మార్పులు ఆశించిన రీతిలో రాలేదు. అనుత్పాదక ఆలోచనలను ఎక్కువగా ఉండేవి.
-స్వేచ్ఛావాణిజ్యంలో గమన కొరత వల్ల సమాజంలోని మార్పులను పోల్చుకొని వాస్తవంగా దూరంగా సామాజిక అంశాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
కీవిషియన్ సిద్ధాంతం
-పెట్టుబడిదారి విధానంలో లాభాలు, ధనికులు అధిక ప్రాధాన్యత కలిగి ఉండగా, సామ్యవాదంలో వ్యక్తి స్వేచ్ఛకు భంగం ఉండేది. దానికి మధ్యేమార్గాన్ని కీన్స్ చూపడం వల్ల సామాజిక మార్పులు ధనాత్మకంగా మారాయి.
-పెట్టుబడిదారి, సామ్యవాద విధానంలో వ్యతిరేక సామాజిక మార్పు కన్పిస్తే, మిశ్రమ ఆర్థిక విధానంలో ధనాత్మక సామాజిక మార్పు కనిపిస్తుంది.
సహకార ఉత్పత్తి
-వస్తుత్పత్తిలో ఎన్నోరకాలు ఉన్నాయి. అయితే ఆర్థిక ఫలాలు చాలా మంది వ్యక్తులకు పంపిణి అయ్యే అవకాశం ఉన్న ఉత్పత్తి ప్రక్రియ సహకార ఉత్పత్తి.
-ఆర్థిక ఫలాలు సమ్మిళితి సాధించినప్పుడు సమాజ ఆలోచనాధోరణి ధనాత్మకంగా ఉంటుంది.
-అసమానతలు సహకార ఉత్పత్తిలో తక్కువ అంటే ధరలు, ద్రవ్యోల్బణం కూడా తక్కువగా ఉంటాయి.
-దేశంలో లక్షల సంఖ్యలో పాల సహకార సంఘాలు, చక్కెర సహకార మిల్లులు ఉన్నాయి.
హరిత విప్లవం
-1947లో భారతదేశం Ship to Mouth. అంటే ఆహార పదార్థాలకు కూడా విదేశాలపై ఆధారపడింది. కానీ హరిత విప్లవం ద్వారా 1976లో ఆహార భద్రతను సాధించింది.
-ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు, యంత్ర సామాగ్రి ఉపయోగించడంవల్ల ఆకలి తగ్గి సమాజ ఆలోచన అభివృద్ధివైపు మళ్లింది.
-ఆకలి మనిషిని వ్యతిరేక ఆలోచనల వైపు నెడుతుంది. అదే హరిత విప్లవం శృతి మించడం వల్ల సాగుభారం పెరిగి ఆత్మహత్యలకు దారితీయడంతోపాటు కాలుష్యం అధికమయ్యింది.
-తక్కువ మోతాదులో Co2 ఉన్నప్పుడు మొక్కలు O2 ఇస్తాయి. అధిక మొత్తంలో Co2 ఇస్తే మొక్కలు మనకు అంతే మొతాదులో Co2నే విడుదల చేస్తాయి.
Take off Stage
-ఒక దేశం అవస్థాపన సౌకర్యాలను, వ్యవస్థాపన సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నా తర్వాత సత్వర వృద్ధిని అంటే Take Offను పొందుతుంది.
-1991లో భారత ఆర్థిక వ్యవస్థ Take offను పొందింది.
-టేక్ఆఫ్లో ఉన్నదేశాల్లో సామాజిక మార్పు సత్వరం రావడమేకాకుండా ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది.
-ఆర్థికంగా అభివృద్ధి చెందిన తర్వాత ప్రజలు సాంఘిక అంశాలకంటే ఆర్థిక అంశాలకే ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల కులాంతర, మతాంతర, దేశాంతర వివాహాలు సులభంగా జరగుతాయి.
-WW Rosteor ప్రకారం Take Off కలిగిన దేశంలో సాంఘిక, ఆర్థిక రాజకీయ పరిణామాలు వేగంగా జరుగుతాయి.
అభివృద్ధి ధనాత్మక సామాజిక పరివర్తన
-పశ్చిమ దేశాల్లో వచ్చిన అభివృద్ధి వల్ల Non western worldలో కూడా ధనాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.
-ఉదాహరణకు Japanese Shintoism, Chinese confucianism, Turkish state secularismలో వచ్చిన ఎన్నో మార్పులు వారి ఆర్థిక సాంఘిక అంశాలపై మార్పులు తీసుకొచ్చాయి.
దిగుమతి, ప్రత్యామ్నాయ ఎగుమతి ప్రోత్సాహం
-ఏ దేశం స్వయం పోషకం కాదు. అందువల్ల దిగుమతులు, వాటికోసం ఎగుమతులు అవసరం.
-అయితే దిగుమతులను తగ్గిస్తూ ఎగుమతులను పెంచుకోవాల్సి ఉంటుంది.
-కానీ కొన్ని దేశాలు దిగుమతి ప్రత్యామ్నాయాన్నే పాటించి సమస్యల్లో చిక్కుకున్నాయి.
-1947-1991 మధ్య భారతదేశం దిగుమతి ప్రత్యామ్నాయాన్ని ఎక్కువగా పాటించింది. దీంతో ఎగుమతులను పట్టించుకోకపోవడంతో చివరికి నాలుగుసార్లు మూల్య హీనీకరణకు గురయ్యింది. ఈ మధ్యకాలంలో సాంఘిక పరివర్తనలో పెద్దగా మార్పు రాలేదు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?