టెట్‌లో బెస్ట్ స్కోర్ సాధించడమెలా?
‘బోధన అనేది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే పవిత్ర కార్యం’. ఇట్టి పవిత్ర కార్యాన్ని నిర్వర్తించడానికి అధిగమించాల్సిన మొదటి మెట్టు టెట్. రాష్ట్ర ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టెట్‌లో బెస్ట్ స్కోర్ సాధించడమెలాగో తెలుసుకుందాం.
- విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి, ఎన్సీటీఈ నిబంధనల మేరకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్)లో అర్హత సాధించడం తప్పనిసరి.
- డీఎస్సీ సాధనలో టెట్ పాత్ర: గతంలో టెట్ రాసిన అభ్యర్థులు స్కోరు పెంచుకోవడం కోసం మళ్లీ రాయాలి. టెట్‌ను కేవలం అర్హత పరీక్షగా మాత్రమే కాకుండా పోటీ పరీక్షగా భావించాలి. టెట్‌లో పొందే ప్రతి మార్కు డీఎస్సీలో ర్యాంకును మెరుగుపరుస్తుందన్న విషయాన్ని మరిచిపోవద్దు. ఉపాధ్యాయ కల నెరవేరాలంటే టెట్‌లో మంచి స్కోర్ సాధించాలి.
సిలబస్ అనాలసిస్
- చైల్డ్ డెవలప్మెంట్ (సైకాలజీ)లో పెరుగుదల వికాసం, వికాస నియమాలు, అభ్యసన సిద్ధాంతాలు, వైయక్తిక భేదాలు, మూర్తిమత్వం, పెడగాగీకి సంబంధించిన విద్యాహక్కు చట్టం, జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం మొదలైనవి అవగాహనాత్మకంగా అధ్యయనం చేయాలి.
- లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2లకు సంబంధించి తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఉత్తమంగా స్కోర్ చేయడానికి నిర్దేశించిన పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు లేదా సవరణలపై దృష్టి పెట్టాలి.
- కంటెంట్‌లో ప్రధానంగా గణితానికి సంబంధించి సంఖ్యామానం, భిన్నాలు, లాభనష్టాలు, నిష్పత్తి-అనుపాతం, కాలం-పని, రేఖాగణితం, దత్తాంశ విశ్లేషణ మొదలైనవి బాగా అధ్యయనం చేయాలి.
- సైన్స్ కంటెంట్‌లో మొక్కలు-జంతువులు, ఆహారం, గాలి, నీరు, శక్తి, మానవ శరీరం ముఖ్యమైనవి. సోషల్ కంటెంట్‌లో మనదేశం, మనరాష్ట్రం, రాజ్యాంగం, సాంఘిక శాస్త్ర ఇతివృత్తాలు, మొదలైన వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
- ప్రతీ కంటెంట్ సబ్జెక్ట్‌తోపాటు దాని బోధనా విధానాలకు సంబంధించిన పెడగాగీ (మెథడాలజీ) అంశాల్లో లక్ష్యాలు-స్పష్టీకరణలు, బోధనా ఉపగమాలు, విద్యా ప్రమాణాలు, అభ్యసన, సుగుణాలు, టీఎల్ఎం, మూల్యాంకనం, ప్రణాళికలు, ఆయా సబ్జెక్టుల చరిత్ర, స్వభావాలు, పరిధి క్షుణ్ణంగా చదవాలి.
నెల రోజుల సమయం
- నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. దాదాపు నెల రోజుల సమయం ఉంది. కాబట్టి ప్రణాళికా బద్ధంగా సిద్ధం కావడం చాలా అవసరం.
- గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టులకు అధిక సమయం కేటాయిస్తూ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
- అకాడమీ పుస్తకాలు చదువుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకొని, రివిజన్ చేస్తూ ఉండాలి.
- చిన్న తరగతుల్లోని అంశాలు పెద్ద తరగతుల్లో పునరావృతమైనప్పుడు సంబంధం ఏర్పరుస్తూ సాధన ఉండాలి.
- క్లిష్టమైన, నిగూఢమైన అంశాలను చదువుతున్నప్పుడు పట రూపంలో గానీ పట్టికల రూపంలో గానీ పొందుపరిచి చదువుకోవాలి.
- మరింత అవగాహన కోసం, బృంద అధ్యయనం అవసరం. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సూచనలు పాటించాలి.
Previous article
Vishnu Kundinu | విష్ణుకుండినుల పరిపాలన
Next article
ఇంగ్లిష్‌లో ఫుల్ స్కోర్ కోసం ఇలా చేయండి..!
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






