చిక్కుళ్ల శాసనం వేయించిన రాజు ఎవరు?
1. సుజాత పత్రిక సంపాదకుడు?
1) సురవరం ప్రతాపరెడ్డి
2) భాగ్యరెడ్డి వర్మ
3) పసుమాముల నృసింహవర్మ
4) వెల్దుర్తి మాణక్యరావు
2. ఆంధ్రుల చరిత్ర పుస్తకాన్ని విజ్ఞాన చంద్రిక మండలి తెలుగులో ప్రచురించిన ఏడాది?
1) 1904
2) 1905
3) 1906
4) 1910
3. ఆది హిందూ సోషల్ లీగ్‌ను భాగ్యరెడ్డి వర్మ ఏర్పాటు చేసిన ఏడాది?
1) 1906
2) 1911
3) 1912
4) 1910
4. కింది వాటిలో సరైనవి?
1. రెండో బేతరాజుకు శైవమత గురువు రామేశ్వర పండితుడు
2) ఇతడు పైజపల్లి అనే గ్రామానికి శివపురం అనే పేరు పెట్టి దాన్ని రామేశ్వర పండితునికి దానం చేశాడు
3) 1
4) 1, 2
5. పల్నాడు యుద్ధం ఏ కాకతీయ రాజు కాలంలో జరిగింది?
1) గణపతి దేవుడు
2) కాకతీ రుద్రదేవుడు
3) రెండో ప్రతాపరుద్రుడు
4) ప్రోలరాజు
6. కులియత్ కులీ అనే పుస్తకంలో ఏ సుల్తాన్ కవిత్వాలు ఉన్నాయి?
1) మహ్మద్ కులీకుతుబ్ షా
2) ఇబ్రహీం కుతుబ్ షా
3) అబ్దుల్లా కుతుబ్ షా
4) సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా
7. ప్రజల యోగ క్షేమాలే ముఖ్యమని వాటిని ముందు చూడాలని తన మరణశాసనంలో రాసుకున్న నవాబు?
1) కులీ కుతుబ్ షా
2) నిజాం ఉల్ ముల్క్
3) నిజాం అలీ
4) మీర్ మహబూబ్ అలీఖాన్
8. నవలక్ష ధనుర్ధారాదీశ్వరుడు అనే బిరుదు గల కాకతీయ రాజు?
1) రెండో ప్రతాపరుద్రుడు
2) రుద్రదేవుడు
3) గణపతి దేవుడు
4) మహాదేవుడు
9. కింది వాటిని జతపర్చండి?
విద్యాసంస్థలు స్థాపించిన ఏడాది
1. దారుల్ ఉలుం ఎ. 1873
2. సిటీ హైస్కూల్ బి. 1881
3. మదర్సా-ఇ-ఆలియా సి. 1870
4. గోరియో గర్ల్స్ హైస్కూల్ డి. 1855
1) 1-ఎ, 2-బి, 3-సి 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-ఎ, 2-సి, 3-బి 4-డి
10. కింది వాటిని జతపర్చండి?
గ్రంథాలు గ్రంథకర్తలు
1. ఆదిపురాణం ఎ. సారంగు తమ్మయ్య
2. కవి జనాశ్రయం బి. సబ్బటి కృష్ణమాత్యుడు
3. రత్నాకరం సి. మల్లియ రేచన
4. వైజయంతి విలాసం డి. పంప కవి
1) 1-డి, 2-సి, 3-బి 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి 4-డి
3) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
4) 1-ఎ, 2-డి, 3-బి 4-సి
11. స్వామి రామానంద తీర్థ అసలు పేరు?
1) వినాయక రావు
2) వామన రావు
3) వెంకట్రావు ఖడ్గేకర్
4) రామచంద్ర నాయక్
12. జాయిన్ ఇండియా ఉద్యమం జరిగిన ఏడాది?
1) 1946, ఆగస్టు 7
2) 1947, ఆగస్టు 7
3) 1948, ఆగస్టు 7
4) 1949, ఆగస్టు 7
13. హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటం – నా అనుభవాలు, జ్ఞాపకాలు అనే పేరుతో తన స్వీయ చరిత్రను రచించింది?
1) స్వామి రామానంద తీర్థ
2) మాడపాటి హనుమంతరావు
3) పుచ్చలపల్లి సుందరయ్య
4) సురవరం ప్రతాపరెడ్డి
14. కింది వాటిలో సరైనవి?
1) ఆంధ్రుల చరిత్ర- చిలుకూరి నారాయణ రావు
2. ఆంధ్రుల సాంఘిక చరిత్ర- సురవరం ప్రతాపరెడ్డి
3. ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి- ఖండవల్ల లక్ష్మీరంజనం
4) పైవన్నీ
15. కింది వాటిని జతపర్చండి?
సంస్థలు స్థాపకులు
1. ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్ ఎ. భాగ్యరెడ్డి వర్మ
2. ఆది ద్రావిడ సంఘం బి. బీఎస్ వెంకట్రావు
3. సునీత బాలసంఘం సి. అరిగె రామస్వామి
4. హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ డి. వామన రావు
1) 1-ఎ, 2-బి, 3-సి 4-డి
2) 1-ఎ, 2-బి, 3-డి 4-సి
3) 1-డి, 2-సి, 3-బి 4-ఎ
4) 1-డి, 2-సి, 3-ఎ 4-బి
16. కింది వాటిలో సరైనవి?
1) హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు కౌన్సిలర్‌గా ఎన్నికైన తొలి దళితుడు అరిగె రామస్వామి
2) కుల వివక్షను ఖండించి ది బర్న్ అనే పుస్తకాన్ని రచించి దళితుల స్థితిగతులను తెలిపిన వ్యక్తి పీ శ్యాంసుందర్
3) ఆదిహిందూ లైబ్రరీని ఏర్పాటు చేసినవారు బీఎస్ వెంకట్రావు
4) పైవన్నీ
17. కింది వాటిని జతపర్చండి?
గ్రంథాలయాలు స్థాపకులు
1. గాంధీ గ్రంథాలయం ఎ. చొల్లేటి నర్సింహరాయ శర్మ
2. రైతు గ్రంథాలయం బి. బండారు నాగభూషణం రావు
3. జైహింద్ గ్రంథాలయం సి. రావి నారాయణ రెడ్డి
4. వేమన ఆంధ్ర భాషానిలయం
డి. కొండా వెంకట రంగారెడ్డి
1) 1-ఎ, 2-బి, 3-సి 4-డి
2) 1-డి, 2-సి, 3-బి 4-ఎ
3) 1-బి, 2-సి, 3-ఎ 4-డి
4) 1-బి, 2-సి, 3-డి 4-ఎ
18. ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ పుస్తక రచయిత?
1) లాయక్ అలీ
2) కేఎం మున్షీ
3) జేఎన్ చౌదరి
4) బూర్గుల రామకృష్ణారావు
19. కింది వారిలో దళిత భీష్ముడుగా పేరుపొందినవారు?
1) బీఎస్ వెంకట్రావు
2) ఎంఎల్ ఆదయ్య
3) అరిగె రామస్వామి
4) పీ శ్యాంసుందర్
20.సోలద గండడు అనే బిరుదుగల వేములవాడ చాళుక్యుడు?
1) మొదటి బద్దెగుడు
2) రెండో అరికేసరి
3) రెండో యుద్ధమల్లుడు
4) వినయాదిత్య యుద్ధమల్లుడు
21.చిక్కుళ్ల శాసనం వేయించిన రాజు?
1) ఇంద్రభట్టారిక వర్మ
2) విక్రమేంద్ర భట్టారిక వర్మ
3) రెండో మాధవ వర్మ
4) మొదటి గోవింద వర్మ
22. వేములవాడ చాళుక్యులు ఏ రాజవంశానికి సామంతులుగా ఉండేవారు?
1) రాష్ట్రకూటులు
2) వేంగిచాళుక్యులు
3) విష్ణుకుండినులు
4) ఇక్షాకులు
23. ఉత్తర భారతదేశం వరకు తన రాజ్యాన్ని విస్తరించిన మొదటి దక్షిణ భారతదేశ రాజుగా ఎవరిని పేర్కొంటారు?
1) మొదటి శాతకర్ణి
2) రెండో శాతకర్ణి
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4) యజ్ఞశ్రీ శాతకర్ణి
24. 1934లో గాంధీజీ హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు ఏ వ్యక్తి హరిజన్ అనే పదాన్ని వ్యతిరేకించి, తాము ఆది హిందువులమని
పేర్కొన్నాడు?
1) భాగ్యరెడ్డి వర్మ
2) బీఎస్ వెంకట్రావు
3) పీసరి వెంకన్న
4) రాణాప్రతాప్
25. ఉర్దూ చాజర్ అని కింది ఏ సుల్తాన్‌ను పిలిచేవారు?
1) జంషీద్ కులీకుతుబ్ షా
2) మహ్మద్ కులీకుతుబ్ షా
3) అబుల్ హసన్ తానీషా
4) ఇబ్రహీం కుతుబ్ షా
26. ఆపరేషన్ పోలో తదనంతరం చోటుచేసుకున్న సంఘటనలను గురించి తెలుసుకోవడానికి కేంద్రం నియమించిన కమిటీ?
1) జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ
2) గిర్గ్లానీ కమిటీ
3) పండిట్ సుందర్‌లాల్ కమిటీ
4) వాంఛూ కమిటీ
27. లైలామజ్ను అనే రచన చేసిన కుతుబ్ షాహీ వంశస్థుడు?
1) గవాసి
2) ఫిరోజ్
3) మీర్జా మహ్మద్ అమీన్
4) నిషాతి
28. కింది వాటిలో సరికానిది?
1) ధర్మనాయుడు- శాయంపేట శాసనం
2) ఎహూవల శాంతమూలుడు- నాగార్జునకొండ సంస్కృత శాసనం
3) మ్యాకదోని శాసనం- రెండో పులోమావి
4) చినగంజాం శాసనం- యజ్ఞశ్రీ శాతకర్ణి
29. గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి తెలంగాణ-ఆంధ్రుల కర్తవ్యం అనే పుస్తక రచయిత?
1) కొమర్రాజు లక్ష్మణరావు
2) సురవరం ప్రతాపరెడ్డి
3) భాగ్యరెడ్డి వర్మ
4) మునగాల వెంకట రంగారావు
30. కిందివాటిలో ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథాలు?
1) ప్రజ్ఞాపారమిత శాస్త్రం
2) ఆరోగ్యమంజరి
3) రసరత్నాకరం
4) పైవన్నీ
31. భాణుడి హర్షచరిత్రలో ప్రస్తావించిన శాతవాహన రాజు?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి
2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) కుంతల శాతకర్ణి
4) శ్రీముఖుడు
32. తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ అనే పుస్తక రచయిత?
1) పుచ్చలపల్లి సుందరయ్య
2) భాగ్యరెడ్డి వర్మ
3) రావినారాయణ రెడ్డి
4) బద్దం ఎల్లారెడ్డి
33. ఆంధ్ర సారస్వత పరిషత్ మొదటి అధ్యక్షుడు?
1) లోక్నంది శంకరనారాయణరావు
2) అరిగే రామస్వామి
3) దేవులపల్లి రామానుజరావు
4) కొమర్రాజు లక్ష్మణరావు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు