పవర్లూమ్ కేంద్రంగా సిరిసిల్ల
ఉత్పాదికాలను బట్టి పరిశ్రమలు మూడు రకాలు
1) ప్రాథమిక రంగ పరిశ్రమలు
ఉదా: వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, మత్స్యపరిశ్రమలు
2) ద్వితీయ రంగ పరిశ్రమలు
ఉదా: ఇనుము-ఉక్కు పరిశ్రమలు
3) తృతీయ రంగ పరిశ్రమలు (సేవారంగం)
ఉదా: రవాణా సౌకర్యాలు, బ్యాంకింగ్, తంతితపాలా, బీమా మొదలైనవి.
యాజమాన్యాన్ని బట్టి పరిశ్రమలు మూడు రకాలు
1) ప్రభుత్వ రంగం
2) ప్రైవేట్ రంగం
3) ఉమ్మడి రంగం
దేశంలో పెట్టుబడిరీత్యా పరిశ్రమలు మూడు రకాలు
1) భారీతరహా పరిశ్రమలు
2) మధ్యతరహా పరిశ్రమలు
3) చిన్నతరహా పరిశ్రమలు
– భారీ పరిశ్రమలవల్ల రాష్ట్రంలో ఉపాధి పొందుతున్న జనాభా- 6,67,499
– మధ్యతరహా పరిశ్రమలవల్ల రాష్ట్రంలో ఉపాధి పొందుతున్న జనాభా- 5,65,000
– తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా ముందంజలో ఉంది.
– తెలంగాణ రాష్ట్రం అనేక తయారీ రంగ పరిశ్రమలు అయిన వ్యవసాయాధారిత, ఖనిజాధారిత, అటవీ ఆధారిత పరిశ్రమలనుప్రోత్సహిస్తుంది.
– తెలంగాణ పారిశ్రామిక రంగం రాష్ట్ర జీవీఏలో సుమారు 24 శాతం వాటాను కలిగి ఉండటంతో పాటు, రాష్ట్రంలోని మొత్తం శ్రామిక శక్తిలో 17.8 శాతం మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.
రాష్ట్రంలో అత్యధిక పారిశ్రామిక యూనిట్లు గల జిల్లా..
1) మేడ్చల్ మల్కాజిగిరి (5,311 యూనిట్లు),
2) రంగారెడ్డి (4,387 యూనిట్లు)
రాష్ట్రంలో అత్యల్ప పారిశ్రామిక యూనిట్లుగల జిల్లా
1) జయశంకర్ భూపాలపల్లి (43 యూనిట్లు),
2) జోగుళాంబ గద్వాల (47 యూనిట్లు)
ముడిపదార్థాల లభ్యత ఆధారంగా పరిశ్రమలు మూడు రకాలు అవి..
1) వ్యవసాయాధారిత పరిశ్రమలు
ఉదా: నూలు, వస్త్ర, చక్కెర, పొగాకు, పట్టు పరిశ్రమలు
2) అటవీ ఆధారిత పరిశ్రమలు
ఉదా: కాగితం, ప్లైవుడ్, తోళ్ల పరిశ్రమలు
3) ఖనిజ ఆధారిత పరిశ్రమలు
ఉదా: ఇనుము-ఉక్కు, సిమెంట్, రసాయన, ఎరువులు, ఇంజినీరింగ్ పరిశ్రమలు
– ఇవేకాకుండా ఔషధ, కుటీర, ఐటీ పరిశ్రమలు వ్యవసాయాధారిత పరిశ్రమలు
– వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలను వ్యవసాయాధారిత పరిశ్రమలు అంటారు.
ఉదా: నూలు, వస్త్ర, పట్టు, చక్కెర, పొగాకు పరిశ్రమలు
నూలు పరిశ్రమ:
ముడి సరుకు నుంచి అత్యంత విలువైన ఉత్పత్తుల వరకు ఉన్న ఏకైక పరిశ్రమ వస్త్ర పరిశ్రమ
– దేశంలోనే అతి పురాతనమైన, అతిపెద్ద, ఎక్కువమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ- వస్త్ర పరిశ్రమ
– పారిశ్రామిక ఉత్పత్తిలో వస్త్ర పరిశ్రమ వాటా- 14 శాతం
– 1854లో సీఎన్ థేవార్ అనే పార్శీ పెట్టుబడిదారుని సహాయంతో బొంబాయిలో మొదటి నూలు పరిశ్రమ ప్రారంభమైంది.
– తెలంగాణలో మొదటి నూలు పరిశ్రమను 1934లో వరంగల్‌లో ఆజంజాహీ పేరుతో ప్రారంభించారు. 1990లో దీన్ని మూసివేశారు.
– తెలంగాణలో అధిక నూలు, వస్త్ర పరిశ్రమలుగల జిల్లాలు- హైదరాబాద్, రంగారెడ్డి, ఆసిఫాబాద్
తెలంగాణలోని కొన్ని నూలు, వస్త్ర పరిశ్రమలు
– తెలంగాణ స్పిన్నింగ్ మిల్లు (1972)- నిర్మల్
– ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్లు (1980)- భువనగిరి
– గ్రోవర్స్ స్పిన్నింగ్ మిల్లు (1980)- ఆదిలాబాద్
– సంఘీ స్పిన్నింగ్ మిల్లు- రంగారెడ్డి (ఉమర్ఖాన్ గూడ)
– పెంగ్విన్ స్పిన్నింగ్ మిల్లు- మేడ్చల్ (ఉప్పల్)
– సూర్యలక్ష్మి కాటన్ మిల్లు- మహబూబ్‌నగర్
– కో ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు- కరీంనగర్
– ఇవేకాకుండా తెలంగాణ ప్రభుత్వం 14 భారీ వస్త్ర పరిశ్రమలను స్థాపించడానికి ఆయా కంపెనీలతో ఎంఓయూను కుదుర్చుకుంది.
నూలు ఉత్పత్తి
– ప్రపంచ నూలు ఉత్పత్తిలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా, భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
– దేశంలో గుజరాత్ (125 లక్షల బేళ్లు), మహారాష్ట్ర (85 లక్షల బేళ్లు), తెలంగాణ (50 లక్షల బేళ్లు) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
– రాష్ట్రంలో ఆదిలాబాద్‌లో నూలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నది.
– భారతదేశంలో అత్యధిక కాటన్ వస్త్ర పరిశ్రమలుగల రాష్ట్రం- మహారాష్ట్ర
నోట్: మాంచెస్టర్ ఆఫ్ ఇండియా- అహ్మదాబాద్
– మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా- కాన్పూర్
– మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా- కోయంబత్తూర్
– కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా- ముంబై
– మాంచెస్టర్ ఆఫ్ ఏషియా- ఒసాకా (జపాన్)
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్కులు
1) సిరిసిల్ల- రాజన్న సిరిసిల్ల జిల్లా
2) పాశమైలారం- సంగారెడ్డి జిల్లా
3) మల్కాపూర్- యాదాద్రి భువనగిరి జిల్లా
నోట్: భారతదేశ మొదటి టెక్స్టైల్ యూనివర్సిటీని గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు.
పట్టు పరిశ్రమలు
– దేశంలో మొదటి పట్టు పరిశ్రమను 1832లో పశ్చిమబెంగాల్లోని హౌరా వద్ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది.
పట్టు ఉత్పత్తి
– ప్రపంచంలో చైనా, భారత్‌లు పట్టును అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి.
– దేశంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
– రాష్ట్రంలో జోగుళాంబ గద్వాల జిల్లా మొదటి స్థానంలో, యాదాద్రి భువనగిరి జిల్లా రెండో స్థానంలో ఉన్నాయి.
– తెలంగాణలో ఆసిఫాబాద్ (కుమ్రంభీం ఆసిఫాబాద్), మహదేవ్పూర్ (జయశంకర్ భూపాలపల్లి)లోని గిరిజన ప్రజలు టుస్సార్ సిల్క్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
తెలంగాణలోని పట్టు పరిశ్రమలు
1) గద్వాల పట్టుచీరలు- జోగుళాంబ గద్వాల (అయిజ మండలం ప్రసిద్ధి)
2) పోంచపల్లి పట్టుచీరలు- యాదాద్రి భువనగిరి (భూదాన్‌పోచంపల్లి). దీన్నే సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.
3) సిరిసిల్ల చేనేత పరిశ్రమలు- సిరిసిల్ల జిల్లా కేంద్రం. ఇక్కడ పవర్లూమ్ పరిశ్రమలు ఉన్నాయి.
– సెంట్రల్ సిల్క్ బోర్డుగల ప్రదేశం- బెంగళూరు (కర్ణాటక)
పొగాకు పరిశ్రమ
– ప్రపంచంలో పొగాకును చైనా అత్యధికంగా ఉత్పత్తి చేస్తుండగా, భారత్ రెండో స్థానంలో ఉన్నది.
– దేశంలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
– రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలు పొగాకును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి.
– తెలంగాణలో పొగాకు పరిశ్రమలు అధికంగా ఉన్న జిల్లాలు 1. హైదరాబాద్ 2. రంగారెడ్డి 3. మెదక్
– తెలంగాణలో పురాతన పొగాకు కంపెనీ వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ (వీఎస్టీ)
– వీఎస్టీని 1920లో వజీర్ సుల్తాన్ అజామాబాద్ (హైదరాబాద్)లో స్థాపించారు.
– ఇది 1983లో పూర్తి స్వతంత్ర సంస్థగా రూపొంది వీఎస్టీ పరిశ్రమ లిమిటెడ్‌గా మారింది.
– ఇది చార్మినార్ సిగరెట్ బ్రాండ్ పేరుతో సిగరెట్లను తయారుచేసి సరఫరా చేస్తుంది.
చక్కెర పరిశ్రమ
– ఇది చెరకు ఆధారంగా నడిచే వ్యవసాయాధారిత పరిశ్రమ
చక్కెర ఉత్పత్తి
– ప్రపంచంలో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా, భారత్ తర్వాతి స్థానంలో ఉన్నది.
– దేశంలో చెరకు ఉత్పత్తిలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
– రాష్ట్రంలో అతిపెద్ద చక్కెర పరిశ్రమ- నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్)
– నిజాం షుగర్ ఫ్యాక్టరీని 1937లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో స్థాపించారు.
– ఇది ఆసియాలో కెల్లా అతిపెద్ద చక్కెర కర్మాగారం
– రాష్ట్రంలోని చక్కెర ఉత్పత్తిలో సగభాగం ఈ పరిశ్రమ ద్వారానే ఉత్పత్తి అయ్యేది. దీన్ని ప్రస్తుతం మూసివేశారు.
– దీనికి అనుబంధంగా నెలకొల్పిన చక్కెర కర్మాగారాలు
1. జహీరాబాద్ చక్కెర కర్మాగారం- 1973- సంగారెడ్డి జిల్లా
2. మిర్యాలగూడ చక్కెర కర్మాగారం- 1977- నల్లగొండ
3. ముత్యంపేట చక్కెర కర్మాగారం- 1981- జగిత్యాల
4. సారంగపూర్ చక్కెర కర్మాగారం- 2012- నిజామాబాద్ (ప్రస్తుతం దీన్ని మూసివేశారు)
గమనిక: భారతదేశంలో మొదటి చక్కెర మిల్లు స్థాపించిన ప్రదేశం: చంపారన్ (బీహార్, 1904)
– ఏపీలోని తణుకు చక్కెర కర్మాగారం నుంచి వెలువడే ఉప ఉత్పత్తులను రాకెట్ ఇంధనంగా ఉపయోగిస్తున్నారు.
2. అటవీ ఆధారిత పరిశ్రమలు
– అటవీ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలను అటవీ ఆధారిత పరిశ్రమలు అంటారు.
ఉదా : కాగితం పరిశ్రమ, ైప్లెవుడ్ పరిశ్రమ, తోళ్ల పరిశ్రమ, ఆకు పరిశ్రమ, ఆట వస్తువుల పరిశ్రమ, లక్క పరిశ్రమ.
1. కాగితం పరిశ్రమ
– కాగితం ఉత్పత్తిలో ముఖ్యంగా ఉపయోగించే ముడి పదార్థాలు
– వెదురు, బగాసే (చెరుకు పిప్పి), సుబాయ్ గడ్డి (శివాలిక్ ప్రాంతంలో లభిస్తుంది), యూకలిప్టస్
– భారత్‌లో మొదటి కాగితం పరిశ్రమను 1832లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాకు సమీపంలోని సేరంపూర్ వద్ద ఏర్పాటు చేశారు.
– ఇండియాలో అధునాతన కాగితం పరిశ్రమ- థాలీగంజ్ (పశ్చిమబెంగాల్, 1870)
తెలంగాణ కాగితం పరిశ్రమ
ఎ. సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లు
– ఇది రాష్ట్రంలో తొలి కాగితపు మిల్లు
– ఈ మిల్లును 1938లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ సిర్పూర్ కాగజ్‌నగర్‌లో స్థాపించాడు.
– ఇక్కడ కాగితపు ఉత్పత్తి 1942 నుంచి ప్రారంభమైంది.
– ఈ సంస్థ రంగుల కాగితాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది.
– ఐటీసీ – పీఎస్‌డీపీ కాగితపు పరిశ్రమ- సారపాక (భద్రాద్రి కొత్తగూడెం)
పేపర్స్ అండ్ స్పెషాలిటీ పేపర్ బోర్డు
– ప్రారంభం : 1979, అక్టోబర్ 1న
– దీన్ని ఐటీసీ సంస్థ 1999లో స్వాధీనం చేసుకుంది.
– 2002లో ఈ పరిశ్రమ ఐటీసీ- పీఎస్డీపీగా మారింది.
తెలంగాణలోని ఇతర పేపర్ మిల్లులు
1. భద్రాచలం పేపర్ మిల్లు- భద్రాచలం (1982)
2. తెలంగాణ పేపర్ మిల్లు- నాచగూడెం (ఖమ్మం)
3. రేయాన్ పేపర్ మిల్లు- కమలాపూర్ (జయశంకర్ భూపాలపల్లి)
4. చార్మినార్ పేపర్ మిల్లు- మాతంగి (మెదక్)
5. నాగార్జున పేపర్ మిల్లు- పటాన్చెరువు (సంగారెడ్డి)
గమనిక: కాగితాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం – మహారాష్ట్ర
– కాగితాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం- అమెరికా
ప్లైవుడ్ పరిశ్రమ:
ఈ రకమైన పరిశ్రమలు రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో ఉన్నాయి
1. హైదరాబాద్ ప్లైవుడ్ లిమిటెడ్- నాచారం (మేడ్చల్మల్కాజిగిరి )
2. నోవాపాన్ ఇండియా లిమిటెడ్ – పటానుచెరువు (సంగారెడ్డి)
– ఇండియాలో బిర్చ్ వృక్షాల కలపను ైప్లెవుడ్ తయారీలో ఉపయోగిస్తారు.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






