అమ్మోనియం పాస్ఫేట్ ఉపయోగం ఏమిటి?
- వాయువులన్నింటి కంటే తేలికైనది?
1) O2 2) N2 3) CO2 4) H2 - చారిత్రక కట్టడాలు రూపు కోల్పోవడానికి ప్రధాన కారకం?
1) CO2 2) SO2
3) P2O5 4) Cl2 - ఎక్కువ సాపేక్ష సాంద్రత గల సల్ఫర్ రూపాంతరం?
1) రాంబిక్ 2) మోనోక్లినిక్
3) ప్లాస్టిక్ 4) ప్రిజ్మాటిక్ సల్ఫర్ - ఫ్రాష్ పద్ధతిలో అల్పసాంద్రత గల నురగ ఏ పదార్థాల కలయిక వల్ల ఏర్పడుతుంది?
1) సల్ఫర్ ద్రవం+ నీరు
2) వేడిగాలి+నీరు
3) సల్ఫర్ ద్రవం+ వేడిగాలి
4) సల్ఫర్ ద్రవం+ వేడిగాలి+ నీరు - H2Sను సల్ఫర్‌గా మార్చే చర్య?
1) క్షయకరణ చర్య 2) ఆక్సీకరణ చర్య
3) తటస్థీకరణ చర్య 4) విరంజన చర్య - లోహ సల్ఫైడ్లు ఆక్సిజన్‌తో మండి దేన్ని ఏర్పరుస్తాయి?
1) సల్ఫర్‌డైఆక్సైడ్ 2) సల్ఫర్మోనాక్సైడ్
3) సల్ఫర్ట్రైఆక్సైడ్ 4) సల్ఫ్యూరిక్ఆమ్లం - నైట్రోజన్ ధర్మాలు కానివి?
1) పుల్లనైన వాయువు 2) నీటిలో కరగదు
3) దహనశీలి వాయువు 4) ఏదీకాదు - గాలి నుంచి నైట్రోజన్ తయారీలో ముఖ్యమైన ప్రక్రియ?
1) విద్యుత్ విశ్లేషణ 2) జలవిశ్లేషణ
3) జౌల్ థామ్సన్ ప్రభావం 4) ఏదీకాదు - క్లోరిన్ వాయువు?
1) దహనశీలి, దహన దోహదకారి కాదు
2) దహనశీలి కాదు, దహన దోహదకారి
3) దహనశీలి, దహన దోహదకారి
4) దహనశీలి కాదు, దహన దోహదకారి కాదు - అమ్మోనియం పాస్ఫేట్ ఉపయోగం ఏమిటి?
1) పేలుడు పదార్థం
2) బ్యాటరీల్లో వాడకం
3) ఎరువుల్లో వాడకం 4) సోల్డరింగ్ - ఉప ఉత్పన్నం Cl2 ను ఎలా భద్రపరుస్తారు?
1) వాయురూపం, సిలిండర్లలో
2) ద్రవీకరించి సిలిండర్లలో
3) ఘనరూపంలో
4) సిలిండర్లలో - హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు?
1) గాలి కంటే బరువైనది
2) గాలి కంటే తేలికైనది
3) గాలితో సమాన బరువు కలిగి ఉంటుంది
4) నీటి కంటే తేలికైనది - నీటి అయానిక లబ్దం విలువ (Kw) దేనిపై ఆధారపడుతుంది?
1) పీడనం 2) ఉష్ణోగ్రత
3) నీటిలో కలిపిన బలమైన ఆమ్లం
4) నీటిలో కలిపిన బలమైన క్షారం - లోహపు ఆక్సైడ్లు నీటిలో కరిగి ఏర్పరిచే పదార్థాలు ఏ వర్గానికి చెందుతాయి?
1) ఆమ్లాలు 2) లవణాలు
3) క్షారాలు 4) తటస్థ ద్రావణాలు - రక్తం గుణం?
1) ఆమ్లగుణం 2) క్షారగుణం
3) తటస్థం 4) ఏదీకాదు - మొక్కలు, జంతువుల కణజాలాల్లో ముఖ్యమైన మూలకం?
1) హైడ్రోజన్ 2) ఆక్సిజన్
3) పాస్ఫరస్ 4) నైట్రోజన్ - చనిపోయిన వృక్ష, జంతు కళేబరాలు, వాటి వ్యర్థ పదార్థాలు ఏ బ్యాక్టీరియా ద్వారా అమ్మోనియా, అమ్మోనియా లవణాలుగా మారుతాయి?
1) అమ్మోనిఫైయింగ్ 2) నైట్రోఫైయింగ్
3) నైట్రోసోఫైయింగ్ 4) డీనైట్రోఫైయింగ్ - తెల్ల భాస్వరం అణు ఫార్ములా?
1) P2 2) P4 3) P5 4) P6 - ఎముకల్లో ఎంత శాతం కాల్షియం పాస్ఫేట్ ఉంటుంది?
1) 50 శాతం 2) 30 శాతం
3) 90 శాతం 4) 80 శాతం - తెల్లని పాస్ఫరస్ వాసన?
1) ఘాటైన వాసన
2) కుళ్లిన కోడిగుడ్ల వాసన
3) వెల్లుల్లి వాసన 4) ఏదీకాదు - గన్‌పౌడర్ వేటి మిశ్రమం?
1) సల్ఫర్, బొగ్గుపొడి, పొటాషియం నైట్రేట్
2) కాల్షియం, బొగ్గుపొడి,
పొటాషియం నైట్రేట్
3) సల్ఫర్, పొటాషియం నైట్రేట్
4) బొగ్గుపొడి, పొటాషియం నైట్రేట్ - సల్ఫర్‌ను ఎక్కడ ఉపయోగిస్తారు?
1) కీటక నాశనుల తయారీలో
2) సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారీలో
3) మలాం తయారీలో
4) పైవన్నీ - సల్ఫర్‌డైఆక్సైడ్ దేనిలో ఎక్కువగా కరుగుతుంది?
1) నీరు 2) కార్బన్ డై సల్ఫైడ్
3) ఆల్కహాల్ 4) ఏదీకాదు - ఒక పదార్థం రంగును పోగొట్టడాన్ని ఏమంటారు?
1) శుద్ధీకరణ 2) విరళీకరణం
3) విరంజనం 4) పైవన్నీ - సల్ఫ్యూరిక్ ఆమ్లం లోహాలతో చర్య జరిపి ఏ వాయువును విడుదల చేస్తుంది?
1) ఆక్సిజన్ 2) సల్ఫర్ డై ఆక్సైడ్
3) హైడ్రోజన్ 4) సల్ఫర్ ట్రై ఆక్సైడ్ - కింది జతల్లో రూపాంతరాలు కానిది ఏది?
1) ఆక్సిజన్, ఓజోన్
2) హైడ్రోజన్, డ్యుటీరియమ్
3) ఎరుపు పాస్ఫరస్, పసుపు పాస్ఫరస్
4) డైమండ్, గ్రాఫైట్ - పాస్ఫరస్ పరిశ్రమలో పనిచేసే శ్రామికులకు వచ్చే జలుబు?
1) ఫాసీజా 2) రేబీస్
3) ఆస్తమా 4) న్యుమోనియా - సముద్రపు నీటిలో ఉప్పు శాతం ఎంత?
1) 28% 2) 2.8%
3) 82% 4) 8.2% - పరిశుద్ధమైన ఉప్పును పొందడానికి ఉప్పు ద్రావణంలోకి ఏ వాయువును పంపుతారు?
1) H2 2) O2
3) Cl2 4) HCL - భూపటలంలో సమృద్ధిగా దొరికే హాలోజన్ కిందివాటిలో ఏది?
1) ఫ్లోరిన్ 2) క్లోరిన్
3) బ్రోమిన్ 4) అయోడిన్ - బ్లీచింగ్ పౌడర్ రసాయన నామం?
1) కాల్షియం క్లోరో హైపో క్లోరేట్
2) కాల్షియం హైపో క్లోరేట్
3) కాల్షియం క్లోరేట్
4) కాల్షియం ఫర్ క్లోరేట్ - బ్లీచింగ్ పౌడర్‌ను CO2తో చర్య జరిపినప్పుడు?
1) CaCl2 ఏర్పడుతుంది
2) క్లోరిన్ విడుదలవుతుంది
3) చర్య జరగదు
4) వాయువును శోషిస్తుంది - ఆమ్లాలు దేన్ని విడుదల చేస్తాయి?
1) హైడ్రోజన్ 2) ఆక్సిజన్
3) నైట్రోజన్ 4) క్లోరిన్ - ఆక్సిజన్‌ను మొదటిసారి తయారుచేసింది?
1) లెవోయిజర్ 2) ప్రిస్టిలీ
3) షీలే 4) కేవెండిష్ - వెల్డింగ్ షాపుల్లో ఉపయోగించే వాయువు ఏది?
1) ఆక్సిజన్ 2) ఆక్సిహైడ్రోజన్
3) హైడ్రోజన్ 4) నైట్రోజన్ - అస్తమా రోగులకు శ్వాస ఆడటానికి ఏ వాయువును ఉపయోగిస్తారు?
1) ఆక్సిజన్ 2) హైడ్రోజన్
3) నైట్రోజన్ 4) నియాన్ - పదార్థాలను గాలిలో మండించడాన్ని ఏమంటారు?
1) శోషణం 2) ఉత్పతనం
3) భర్జనం 4) ఏదీకాదు - సాధారణ నీటిలో కాల్షియం, మెగ్నీషియం లవణాల వల్ల ఏర్పడేది?
1) మృదుత్వం
2) కఠినత్వం
3) తియ్యదనం
4) చెడువాసన - నీటి కఠినత్వాన్ని గుర్తించడానికి ఉపయోగించే కారక ద్రావణం?
1) లైమ్, సోడా మిశ్రమం
2) వాషింగ్ సోడా ద్రావణం
3) సబ్బు ద్రావణం
4) AgNo3 ద్రావణం - రసాయనికంగా కాల్గాన్ అంటే?
1) సోడియం అల్యూమినో సిలికేట్
2) సోడియం సిలికేట్
3) సోడియం హెక్సామెటా పాస్ఫేట్
4) ఆల్కైల్ సల్ఫోనిక్ ఆమ్లం - ఆవర్తన పట్టికలో తేలికైన మూలకం?
1) హైడ్రోజన్ 2) ఫ్లోరిన్
3) లిథియం 4) హీలియం - కఠిన జలాన్ని కాటయాన్, ఆనయాన్ వినిమయ రెసిన్ల ద్వారా పంపిన తర్వాత సేకరించే నీరు?
1) మృదుజలం 2) స్వేదనజలం
3) అయాన్హ్రిత జలం
4) ద్విస్వేదన జలం - నీటి తాత్కాలిక కాఠిన్యతను తొలగించే విధానం?
1) వడబోత 2) ద్రవాభిసరణ
3) మరిగించటం 4) వ్యాపనం - బ్రైన్ ద్రావణాన్ని విద్యుద్విశ్లేషణం చేస్తే లభించే ముఖ్య ఉత్పన్నం?
1) సోడియం క్లోరైడ్ 2) కాస్టిక్ సోడా
3) బట్టల సోడా 4) బేకింగ్ సోడా - విలీన ఆమ్ల ద్రావణానికి ఫినాఫ్తలీన్ అనే సూచికను కలిపితే ఏర్పడే రంగు ఏది?
1) నారింజ 2) గులాబీ
3) రంగు లేదు 4) పసుపు
Answers
1-4, 2-2, 3-1, 4-4, 5-2, 6-1, 7-4, 8-3, 9-4, 10-4, 11-2, 12-1, 13-2, 14-3, 15-2, 16-4, 17-1, 18-2, 19-1, 20-3, 21-1, 22-4, 23-1, 24-3 25-3, 26-2, 27-1, 28-2, 29-4, 30-1, 31-1, 32-2, 33-1, 34-3, 35-2, 36-1, 37-3, 38-2, 39-3, 40-3, 41-1, 42-3, 43-3, 44-2, 45-3
- Tags
- Education News
Previous article
‘నేటివిస్ట్ పర్స్పెక్టివ్’ను ప్రతిపాదించినవారు?
Next article
DEETఉద్యోగాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు