Government Jobs 2023 | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. IIITN Recruitment | నాగ్‌పుర్ ట్రిపుల్ ఐటీలో నాన్ టీచింగ్ పోస్టులు
IIITN Recruitment 2023 | జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజినీర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి నాగ్‌పుర్ (Nagpur) లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 07
పోస్టులు : జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజినీర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితరాలు
విభాగాలు : అకడమిక్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మల్టీ-స్కిల్డ్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.590(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.295).
దరఖాస్తు : అన్లైన్లో మే
చివరి తేదీ: మే 08
హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: మే 15
వెబ్సైట్ : https://iiitn.ac.in
2.SVIMS Recruitment 2023 | తిరుపతి ఎస్వీఐఎంఎస్లో 142 ఫ్యాకల్టీ పోస్టులు
TIRUPATI SVIMS Recruitment 2023 | అనాటమీ, క్లినికల్ వైరాలజీ, జనరల్ సర్జరీ, హెమటాలజీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ విభాగాలలో.. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు తదితర ఫ్యాకల్టీ పోస్టుల (Faculty positions) భర్తీకి తిరుపతి(Tirupati) లోని శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎస్వీఐఎంఎస్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. మే 08 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 142
పోస్టులు: ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు.
విభాగాలు: జనరల్ సర్జరీ, అనాటమీ, క్లినికల్ వైరాలజీ, హెమటాలజీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, సైకియాట్రీ, యూరాలజీ, రేడియాలజీ, పెడియాట్రిక్స్, రోమటాలజీ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
జీతం : నెలకు రూ.67700 నుంచి రూ.211300 వరకు
వయసు: 50 నుంచి 55 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
అడ్రస్ : రిజిస్ట్రార్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) అలిపిరి రోడ్, తిరుపతి, తిరుపతి జిల్లా – 517 502.
చివరి తేది: మే 08
వెబ్సైట్ : www.svimstpt.ap.nic.in.
3.CDOT Recruitment | సీడాట్‌లో 18 పోస్టులు
CDOT Recruitment 2023 | అసోసియేట్, మెంబర్ సపోర్ట్ (ఫైనాన్స్) తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బ్యాచిలర్స్ డిగ్రీ (కామర్స్), సీఎంఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 18
పోస్టులు : అసోసియేట్, మెంబర్ సపోర్ట్(ఫైనాన్స్).
అర్హతలు : పోస్టులను బట్టి బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బ్యాచిలర్స్ డిగ్రీ(కామర్స్), సీఎంఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 30 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.25500 నుంచి రూ.112400
పని ప్రదేశం: ఢిల్లీ, బెంగళూరు.
ఎంపిక : రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: మే 08
వెబ్సైట్ : https://cdotrecruitment.cdot.in/
4. NIRDPR Recruitment | నిర్డ్ పీఆర్లో 141 పోస్టులు
NIRDPR Recruitment | 141 యంగ్ ఫెలో పోస్టుల భర్తీకి హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయితీ రాజ్ (నిర్డ్ పీఆర్) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 141 పోస్టులు
అర్హతలు : పీజీతో పాటు పీజీ డిప్లొమా(సోషల్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయస్సు : 35 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.35,000
ఎంపిక : రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు : రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు
చివరి తేదీ: మే 08
వెబ్సైట్ : http://career.nirdpr.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?