గ్రహణ సిద్ధాంతం గురించి సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొన్నది?
పాలిటీ
30. న్యాయవ్యవస్థ (Judicial system) కూడా రాజ్యంగా పరిగణించబడుతుందని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
1) జస్టిస్ రంగనాథ్ మిశ్రా Vs
యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
2) ఎ.ఆర్.అంతూలే Vs ఆర్.ఎస్.నాయక్
3) దేవీలాల్ Vs యూనియన్
ఆఫ్ ఇండియా
4) శంకరీ ప్రసాద్ Vs యూనియన్
ఆఫ్ ఇండియా
31. సుఖ్‌దేవ్ సింగ్ Vs భగత్ రాం(1975) కేసులో సుప్రీంకోర్టు దేనిని రాజ్యం/ రాజ్య సంస్థగా పేర్కొన్నది?
ఎ) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్
బి) ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్
సి) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
డి) వాలంటరీ ఆర్గనైజేషన్స్
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
32. పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఆదేశాలను న్యాయస్థానం జారీ చేయరాదని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది?
1) టి.ఎం.ఎ. పాయ్ Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు
2) శంకరీ ప్రసాద్ Vs యూనియన్
ఆఫ్ ఇండియా కేసు
3) ఎ.ఆర్. అంతూలే Vs ఆర్.ఎస్.
నాయక్ కేసు
4) నందినీ శతపతి Vs స్టేట్ ఆఫ్ ఒరిస్సా కేసు
33.ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వానికి, ప్రభుత్వరంగ సంస్థ/సంస్థలకు వ్యతిరేకంగా లభిస్తాయే తప్ప, ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా లభించవని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
1) రాజ్ నారాయణ్ సింగ్ Vs
ఇందిరాగాంధీ కేసు
2) షందాసాని Vs సెంట్రల్ బ్యాంక్
ఆఫ్ ఇండియా కేసు
3) మేనకాగాంధీ Vs యూనియన్
ఆఫ్ ఇండియా కేసు
4) మినర్వామిల్స్ Vs యూనియన్
ఆఫ్ ఇండియా కేసు
34. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 13 ప్రకారం ప్రాథమిక హక్కుల కు వ్యతిరేకమైన శాసనాలు చెల్లుబాటు కావు
బి) ఆర్టికల్ 13(1) ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే అంతవరకు అమల్లో ఉన్న చట్టాల్లో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే నిబంధనలు ఉంటే
ఆమేరకు ఆ చట్టాలు చెల్లుబాటు కావు
సి) ఆర్టికల్ 13(2) ప్రకారం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ప్రభుత్వం ఎలాంటి చట్టాలను రూపొందించరాదు
డి) ఆర్టికల్ 13(3) ప్రకారం శాసనం/ చట్టం అనే పదాన్ని నిర్వచించారు.
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, సి, డి 3) ఎ, బి, డి
35. ప్రభుత్వ రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్లు, ప్రభుత్వం గుర్తించిన చట్టబద్ధత ఉన్న ప్రజల ఆచార వ్యవహారాలను శాసనాలుగా గుర్తించవచ్చునని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది?
1) ఆర్టికల్ 13(1) 2) ఆర్టికల్ 13(2)
3) ఆర్టికల్ 13(3) 4) ఆర్టికల్ 13(4)
36. ఆర్టికల్ 13(1) ప్రకారం శాసనం / చట్టం అంటే?
ఎ) ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్
బి) ఆర్టికల్ 213 ప్రకారం రాష్ట్ర గవర్నర్ జారీ చేసే ఆర్డినెన్స్
సి) పార్లమెంటు రూపొందించిన శాసనం
డి) రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనం
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
37. ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగానికి ఆర్టికల్ 13(4)ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చింది?
1) 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
2) 25వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
3) 26వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
4) 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976
38. సుప్రీంకోర్టు తొలిసారిగా న్యాయసమీక్ష (judicial Review) అధికారాన్ని ఏ కేసు సందర్భంగా వినియోగించింది?
1) చంపకం దొరై రాజన్ Vs స్టేట్ ఆఫ్
తమిళనాడు
2) బాబులాల్ పరాటే Vs స్టేట్ ఆఫ్ బాంబే
3) శంకరీ ప్రసాద్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
4) మినర్వామిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
39. ఆర్టికల్ 368 ప్రకారం జరిగే రాజ్యాంగ సవరణ చట్టాలు ఆర్టికల్ 13 పరిధిలోకి రావు అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది?
1) ఆర్టికల్ 13(1) 2) ఆర్టికల్ 13(2)
3) ఆర్టికల్ 13(3) 4) ఆర్టికల్ 13(4)
40. గోలక్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఏ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు సవాల్ చేసింది?
1) 17వ రాజ్యాంగ సవరణ చట్టం
2) 21వ రాజ్యాంగ సవరణ చట్టం
3) 24వ రాజ్యాంగ సవరణ చట్టం
4) 25వ రాజ్యాంగ సవరణ చట్టం
41. ఆర్టికల్ 368 ప్రకారం జరిపే రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా ఆర్టికల్ 13 పరిధిలోకి వస్తాయని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా రాజ్యాంగ సవరణలు చేసే హక్కు పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా కీలకమైన తీర్పునిచ్చింది?
1) ఎస్.ఆర్.బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
2) గోలక్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు
3) సజ్జన్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు
4) బేలా బెనర్జీ Vs స్టేట్ ఆఫ్ పశ్చిమ బెంగాల్ కేసు
42. ప్రభుత్వం రూపొందించిన శాసనాల్లో ఏదైనా భాగం గాని నియమం గాని ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, వ్యతిరేకంగా ఉన్న భాగం/నియమాన్ని మాత్రమే వేరుచేసి అది చెల్లుబాటు కాదని న్యాయస్థానం తీర్పు ఇవ్వడాన్ని ఏమంటారు?
1) Doctrine of Introvert
2) Doctrine of Individuality
3) Doctrine of Separability
4) Doctrine of Decode
43. మిథు Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లోని ఏ సెక్షన్ ప్రాథమిక హక్కుల్లోని సమానత్వపు హక్కుకు వ్యతిరేకమని సుప్రీంకోర్టు తీర్పు నివ్వడంతో తొలగించడమైనది?
ఎ) సెక్షన్ 302 బి) సెక్షన్ 303
సి) సెక్షన్ 304 డి) సెక్షన్ 305
44. చట్టసభలు రూపొందించిన శాసనాలు రాజ్యాంగ వ్యతిరేకమని న్యాయస్థానాలు తీర్పునిచ్చిన తర్వాత కూడా, అదే శాసనాన్ని మార్పులు, చేర్పులు చేసి శాసనంగా తీసుకువస్తే ప్రత్యక్షంగా ఒప్పు కానిది పరోక్షంగా కూడా ఒప్పు కాదని పేర్కొనడాన్ని కింది విధంగా చెప్పవచ్చును?
ఎ) Colourable legislation
బి) Colourable liality
సి) legislation with Decade
డి) Legislation Docket
45. సుప్రీంకోర్టు తొలిసారిగా Colourable legislation గురించి ఏ కేసు సందర్భంగా పేర్కొన్నది?
ఎ) సజ్జనార్ రీతు దేశాయ్ Vs
స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు
బి) నారాయణ దేవ్ Vs స్టేట్ ఆఫ్
ఒడిశా కేసు
సి) ప్రపుల్లకుమార్ మహంత్ Vs
యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
డి) నందినీ శతపతి Vs స్టేట్ ఆఫ్
ఒడిశా కేసు
46. Doctrine of Eclipse (గ్రహణ సిద్ధాంతం) గురించి సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొన్నది?
ఎ) రుదేవ్ ఖుల్హన్ Vs యూనియన్
ఆఫ్ ఇండియా కేసు
బి) బాలాజీ రాఘవన్ Vs స్టేట్ ఆఫ్
ఆంధ్రప్రదేశ్ కేసు
సి) భికాజీ నారాయణ్ Vs స్టేట్ ఆఫ్
మధ్యప్రదేశ్
డి) రాజ్ నారాయణ్ సింగ్ Vs
ఇందిరాగాంధీ కేసు
47. Doctrine of waiver (హక్కులను వదుపుకునే సిద్ధాంతం) గురించి సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొన్నది?
1) బేహారం Vs స్టేట్ ఆఫ్ బాంబే కేసు
2) మునిస్వామి అయ్యర్ Vs
స్టేట్ ఆఫ్ కేరళ కేసు
3) రణభీర్ సింగ్ Vs స్టేట్
ఆఫ్ పంజాబ్ కేసు
4) దిశా మిశ్రా Vs యూనియన్
ఆఫ్ ఇండియా కేసు
48. రాజ్యాంగం అమల్లోకి రాకముందు చేసిన శాసనాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం కొనసాగించడాన్ని ఏమంటారు?
1) గ్రహణ సిద్ధాంతం
(Doctrine of Eclipse)
2) అధికార పృథక్కరణ సిద్ధాంతం
(Doctrine of Separation)
3) పరిత్యజించే సిద్ధాంతం
(Doctrine of Waiver)
4) తప్పించుకునే సిద్ధాంతం
(Doctrine of Escape)
49. ప్రాథమిక హక్కులకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ప్రారంభ భారత రాజ్యాంగంలో 7 రకాల ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు
బి) ప్రస్తుతం రాజ్యాంగంలో
ప్రాథమిక హక్కులు 6 రకాలుగా ఉన్నవి
సి) ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఇందిరాగాంధీ ప్రభుత్వం
తొలగించింది
డి) ప్రాథమిక హక్కుల రక్షణకు న్యాయస్థానాలు జారీ చేసే ఆదేశాలను రిట్స్ అంటారు
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
50. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు వాటి వివరణకు సంబంధించిన ఆర్టికల్స్‌లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) స్వేచ్ఛా, స్వాతంత్రపు హక్కు
1) ఆర్టికల్ 23 నుంచి 24
బి) పీడనాన్ని నిరోధించే హక్కు 2) ఆర్టికల్ 32
సి) రాజ్యాంగ పరిహారపు హక్కు 3) ఆర్టికల్ 19 నుంచి 22
డి) సమానత్వపు హక్కు 4) ఆర్టికల్ 14 నుంచి 18
1) ఎ-3, బి-1, సి-2, డి-4
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-3, బి-1, సి-3, డి-4
51. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు, వాటి వివరణకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆస్తి హక్కు 1) ఆర్టికల్ 29
నుంచి 30
బి) విద్యా 2) ఆర్టికల్ 25
సాంస్కృతిక హక్కు నుంచి 28
సి) మత
స్వాతంత్య్రపు హక్కు 3) ఆర్టికల్ 31
1) ఎ-3, బి-1, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-3, బి-1, సి-2
4) ఎ-1, బి-3, సి-2
52. రాజ్యాంగ పరిహారపు హక్కును ప్రాథమిక హక్కులకు హృదయం వంటిది అని ఎవరు వాఖ్యానించారు?
1) పాల్ ఆపిల్ బీ
2) డా. బి.ఆర్. అంబేద్కర్
3) అనంత శయనం అయ్యంగార్
4) డా. బాబు రాజేంద్ర ప్రసాద్
53. ‘సమానత్వపు హక్కు’కు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 14(ఎ) – చట్టం దృష్టిలో సమానత్వం గురించి వివరించును
బి) ఆర్టికల్ 14(బి) – చట్టం మూలంగా సమాన రక్షణ గురించి వివరించును
సి) ఆర్టికల్ 14(సి) చట్టం, సమన్వయం గురించి వివరించును
డి) ఆర్టికల్ 361 – రాష్ట్రపతి,
రాష్ర్టాల గవర్నర్లకు గల ప్రత్యేక రక్షణ,
మినహాయింపుల గురించి వివరించును.
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి
54. సమానత్వపు హక్కుకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) చట్టం మూలంగా సమాన రక్షణ అనే భావనను అమెరికా నుంచి గ్రహించారు
బి) చట్టం దృష్టిలో సమానత్వం అనే భావనను బ్రిటన్ నుంచి గ్రహించారు
సి) అమెరికాలో అమల్లో ఉన్న The Rule of Law ఆధారంగా భారత్‌లో సమానత్వపు హక్కును పొందుపరిచారు
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, సి, డి
55. సమాన పరిస్థితుల్లో మాత్రమే సమానత్వాన్ని వర్తింప చేయవచ్చునని, సమానులలో మాత్రమే సమానత్వం అమలు పరచడం జరుగుతుందని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
1) శంకరీ ప్రసాద్ Vs యూనియన్
ఆఫ్ ఇండియా కేసు
2) చిరంజిత్ లాల్ Vs యూనియన్
ఆఫ్ ఇండియా కేసు
3) దేవీలాల్ Vs యూనియన్
ఆఫ్ ఇండియా కేసు
4) అశోక్ కుమార్ ఠాకూర్ Vs స్టేట్ ఆప్
ఉత్తరప్రదేశ్ కేసు
56. ఆర్టికల్ 14(ఎ) ప్రకారం మనదేశ రాజ్యాంగంలో కింది ఏ అంశాన్ని వివరించారు?
1) చట్టం ముందు / చట్టం దృష్టిలో
ప్రజలందరూ సమానులే
2) చట్టం కారణంగా కొన్ని రకాల
వివక్షత తొలగింపు
3) చట్టం ఆధారంగా సమాన రక్షణలు
4) పైవన్నీ సరైనవే
57. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం ఏ రకమైన వివక్ష నిషేధింపబడినవి?
1) కుల, మత, ప్రాంత, ఆస్థి
సంబంధమైన వివక్ష
2) కుల,మత, జాతి, లింగ
జన్మసంబంధమైన వివక్ష
3) కుల, జాతి, ప్రాంత, ఆదాయ,
మత సంబంధమైన వివక్ష
4) జాతి, ప్రాంత, నివాస, లింగ
సంబంధమైన వివక్ష
సమాధానాలు
30-2 31-2 32-3 33-2
34-2 35-1 36-3 37-1
38-3 39-4 40-1 41-2
42-3 43-2 44-1 45-2
46-3 47-1 48-1 49-3
50-1 51-3 52-2 53-4
54-1 55-2 56-1 57-2

Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






