12 గంటల కాలంలో రెండు ముళ్ల మధ్య లంబం?
-కాలాన్ని కొలుచుటకు లేదా తెలుసుకొనుటకు ఉపయోగించే పరికరాన్ని గడియారం అంటారు.
-గడియారం అనేది ఆవర్తన సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది.
-గడియారంలోని మొత్తం భాగాల సంఖ్య 211.
-లోలకాన్ని కనుగొన్నది గెలీలియో.
-గడియారంలోని లోలకం పొడవు 100 సెం.మీ.
-గడియారంలోని లోలకం అటు, ఇటు తిరుగుటనే డోలనావర్తన కాలం అంటారు.
-ఈ డోలనావర్తన కాలం విలువ 2 సెకన్లు అయితే దాన్ని సెకన్ల లోలకం లేదా సామాన్య లోలకం అంటారు.
-లోలకంలో ఒక కంపనానికి పట్టేకాలం ఒక సెకన్.
-గడియారంతో కాలాన్ని గంటలు, నిమిషాలు, సెకన్లలో తెలుసుకోవచ్చు.
-గడియారంలోని ముఖ్యమైన భాగాలు
1. డయల్
2. గంటల ముల్లు
3. నిమిషాల ముల్లు
4. సెకన్ల ముల్లు
డయల్
-డయల్ అనేది ఒక గడియారం బాహ్యభాగం. దీని లోపల ఒక వృత్తాకరపు లోహపు పలకపై 1 నుంచి 12 వరకు గల అంకెలు సమానదూరాల్లో ఉంటాయి. ఒక్కొక్క అంకె ఒక్కొక్క గంటను సూచిస్తుంది. మొత్తం మీద గడియారం 12 గంటలను సూచిస్తుంది. ఒక పూర్తిరోజు (24 గంటలు) గడువాలంటే గంటల ముల్లు రెండు పూర్తి భ్రమణాలు పూర్తిచేయాలి.
-గడియారంలోని ముళ్ల చలనాన్ని కోణాల్లో తీసుకున్నట్లయితే ప్రతిముల్లు ఒక పూర్తి భ్రమణానికి 360 డిగ్రీల కోణం చేస్తుంది.
-గడియారంలోని 12 గంటల మధ్యదూరాన్ని కోణాల్లో తెలియజేసినపుడు రెండు పక్కపక్క అంకెల మధ్యదూరం 360/12 = 30 డిగ్రీలకు సమానం.
గంటల ముల్లు (చిన్న ముల్లు)
-ఒక గడియారంలో గంటల ముల్లు అన్ని ముల్లుల కంటె చిన్నది.
-చిన్న ముల్లు ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టేకాలం – 12 గంటలు.
-అంటే 12 గంటల్లో చిన్న ముల్లు చేసే కోణం – 3600
-ఒక గంటలో చిన్న ముల్లు చేసే కోణం – 360/12 = 300
-60 నిమిషాల్లో చిన్న ముల్లు చేసే కోణం – 300
-ఒక నిమిషంలో చిన్న ముల్లు చేసే కోణం – 30/60 = 1/2 డిగ్రీలు.
-60 సెకన్లలో చిన్న ముల్లు చేసే కోణం – 1/2 డిగ్రీలు
-1 సెకన్లో చిన్న ముల్లు చేసే కోణం – 1/120 డిగ్రీలు
పెద్దముల్లు (నిమిషాల ముల్లు)
-ఒక గడియారంలో నిమిషాల ముల్లు గంటల ముల్లు కంటె పెద్దది, సెకన్ల ముల్లు కంటె చిన్నది.
-నిమిషాల ముల్లు ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టుకాలం = ఒక గంట లేదా 60 నిమిషాలు.
-అంటే నిమిషాల ముల్లు 60 నిమిషాల్లో చేసే కోణం – 3600
-ఒక నిమిషంలో పెద్దముల్లు చేసే కోణం – 360/60 = 60
-నిమిషాల ముల్లు ఒక నిమిషంలో చేసే కోణం – 60
-అంటే నిమిషాల ముల్లు 60 సెకన్లలో చేసే కోణం – 60
-నిమిషాల ముల్లు ఒక సెకన్లో చేసే కోణం – 6/60 = 1/10 డిగ్రీలు.
సెకన్ల ముల్లు
-ఒక గడియాంలో అన్ని ముళ్లలోకి పొడవైనది సెకన్ల ముల్లు.
-అంతేగాక గంటల ముల్లు, నిమిషాల ముల్లు కంటే సెకన్ల ముల్లు వేగంగా కదులుతుంది.
-సెకన్ల ముల్లు ఒక పూర్తి భ్రమణం చేయడానికి ఒక నిమిషం పడుతుంది.
-అంటే 60 సెకన్లు పూర్తి చేయడానికి 360 డిగ్రీల కోణం చేస్తుంది.
-ఒక సెకనుకు 6 డిగ్రీల కోణం చేస్తుంది.
-సెకన్ల ముల్లు వేగం = 360 డిగ్రీలు/ నిమిషం = 6 డిగ్రీలు/సెకన్
గమనిక-1
-గడియారంలో పెద్ద, చిన్న ముల్లుల నిష్పత్తి..
= 6 : 1/2
= 12 : 1
= 360 : 30
-గడియారంలో పెద్ద, చిన్న ముల్లుల సాపేక్ష వేగం/ఉమ్మడి వేగం = 6 -1/2 = 11/2 డిగ్రీలు = 51/2 డిగ్రీలు.
గమనిక-2
-గడియారంలో ఒంటి గంట సమయంలో రెండు ముళ్ల మధ్య కోణం – 30 డిగ్రీలు.
-గడియారంలో రెండు గంటల సమయమప్పుడు రెండు ముళ్ల మధ్య కోణం – 2 (30) = 60 డిగ్రీలు.
-గడియారంలో నాలుగు గంటల సమయమప్పుడు రెండు ముళ్ల మధ్యకోణం = 4(30) = 120 డిగ్రీలు
-గడియారంలో ఐదు గంటల సమయమప్పుడు రెండు ముళ్ల మధ్య కోణం = 5(30) = 150 డిగ్రీలు
-గడియారంలో ఎనిమిది గంటల సమయమప్పుడు రెండు ముళ్ల మధ్య కోణం = 8(30) = 240 డిగ్రీలు
-గంటల ముల్లు, నిమిషాల ముల్లుల మధ్య కోణం = 30h-(11/2)m లేదా (11/2)m-30h
-ఇక్కడ అంటే పరమమూల్యం విలువ అని అర్థం. ఈ రెండు గీతల మధ్య ఉన్న విలువను ఎల్లప్పుడు ధనాత్మకంగా తీసుకోవాలి.
మోడల్-1
సమయం ఇచ్చినప్పుడు రెండు ముల్లుల మధ్యకోణం కనుగొనుట
ఉదా-1: గడియారంలో సమయం 2 గంటల 30 నిమిషాలప్పుడు రెండు ముళ్ల మధ్య కోణం ఎంత?
ఎ. 1650 బి. 1050
సి. 1110 డి. 1100
-సమాధానం-బి
వివరణ
-కోణం = 30h-(11/2)m
-ఇక్కడ h = 2, m = 30 ప్రతిక్షేపించగా = 30(2)-(11/2)(30) = 1050
షార్ట్కట్
-గంటల సంఖ్యను 30తో గుణించి, నిమిషాల సంఖ్య సగం చేసి వాటిని కలపాలి. నిమిషాల సంఖ్యను ఆరుతో గుణించి రెండింటిని తీసివేయాలి.
-కోణం = (2(30)+(30/2))-30(6)
= 75-180
= 105 (రుణ గుర్తును విస్మరించాలి)
ఉదా-2: ఒక గడియారంలో సమయం 7 గంటల 30 నిమిషాలు అయినప్పుడు రెండు ముళ్ల మధ్య కోణం ఎంత?
ఎ. 450 బి. 471/20
సి. 581/20 డి. 600
-సమాధానం-ఎ
వివరణ
(210 + 15)-180 = 450
మోడల్-2
గడియారంలోని రెండు వరుస గంటల మధ్య ముళ్లు ఏకీభవించునప్పుడు సమయాన్ని కనుగొనుట
-ఒక గడియారంలోని గంటల ముల్లు, నిమిషాల ముల్లు ఒకదానిపై మరొకటి చేరి రెండు ఒకే దిశను చూపించిన ఆ స్థితిని ఈక్వినాక్టికల్ స్థితి అంటారు. దీనినే ముల్లు ఏకీభవించు స్థితి అంటారు.
-ఒక గడియారంలోని గంటల ముల్లు, నిమిషాల ముల్లు ప్రతి గంటకు ఒకేసారి ఒకే దిశలో ఏకీభవిస్తాయి. కానీ 11 -12 గంటల మధ్య, 12 – ఒంటి గంటల మధ్య ఈ స్థితి రాదు. కచ్చితంగా 12 గంటలకు రెండు ముళ్లు ఏకీభవిస్తాయి.
-అంటే 12 గంటల కాలంలో 11 సార్లు, 24 గంటల కాలంలో 22 సార్లు ముళ్లు ఏకీభవిస్తాయి. ఈ స్థితిలో ముళ్ల మధ్య కోణం 0 డిగ్రీలుగా ఉంటుంది.
ఉదా-1: 3, 4 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలోని రెండు ముళ్లు కలిసి ఉంటాయి?
ఎ. 3 గంటల 16 4/11 నిమిషాలు
బి. 5 గంటల 16 4/11 నిమిషాలు
సి. 3 గంటల 16 11/4 నిమిషాలు
డి. ఏకీభవించవు
-సమాధానం-ఎ
వివరణ
కోణం = 30h-(11/2)m
0 = 30(3)-(11/2)m
(11/2)m = 90
m =90(2/11) = 180/11 = 16 4/11నిమిషాలు
-3 గంటల 16 4/11 నిమిషాలు సమయప్పుడు రెండు ముళ్లు ఏకీభవిస్తాయి.
షార్ట్కట్
-3(30) = 90(2/11) = 180/11 = 16 4/11నిమిషాలు
(మొదట గంటలను 30తో గుణించి దానికి 2/11చే గుణించి మిశ్రమ భిన్నం చేయాలి)
ఉదా-2: 9, 10 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలోని రెండు ముళ్లు కలిసి ఉంటాయి?
ఎ. 9 గంటల 48 2/11 నిమిషాలు
బి. 9 గంటల 49 2/11 నిమిషాలు
సి. 9 గంటల 49 1/11 నిమిషాలు
డి. 9 గంటల 48 1/11 నిమిషాలు
-సమాధానం-సి
వివరణ
-9(30) = 270(2/11)=540/11
= 49 1/11నిమిషాలు
మోడల్-3
గడియారంలోని గంటల ముల్లు, నిమిషాల ముల్లు మధ్యకోణం లంబకోణం అగుట
-ఒక గడియారంలోని గంటల ముల్లు, నిమిషాల ముల్లుల మధ్య కోణం 90 డిగ్రీలు ఉంటే ఈ రెండు ముళ్లు లంబంగా ఉన్నాయని అర్థం.
ఉదా-1: గడియారంలో 4, 5 గంటల మధ్య ఏ సమయంలో రెండు ముళ్ల మధ్య కోణం 90 డిగ్రీలుగా ఉంటుంది?
ఎ. 4 గంటల 38 2/11 నిమిషాలు
బి. 5 గంటల 38 2/11 నిమిషాలు
సి. 4 గంటల 30 2/11 నిమిషాలు
డి. 5 గంటల 30 2/11 నిమిషాలు
-సమాధానం-ఎ
వివరణ
-షార్ట్కట్
4(30)+90 = 120+90 = 210(2/11) = 420/11 = 38 2/11 నిమిషాలు
4(30)-90 = 120-90 = 30(2/11) = 60/11 = 5 5/11 నిమిషాలు
-అంటే 4 గంటల 38 2/11 నిమిషాలు, 4 గంటల 5 5/11 నిమిషాల సమయమప్పుడు రెండు ముళ్ల మధ్య కోణం 90 డిగ్రీలుగా ఉంటుంది.
గమనిక
-గడియారంలో ప్రతి గంటకు రెండుసార్లు రెండు ముళ్ల మధ్య కోణం లంబంగా ఉంటుంది. కానీ 12 గంటల కాలంలో 22 సార్లు, 24 గంటల కాలంలో 44 సార్లు రెండు ముళ్లు లంబకోణాలను ఏర్పరిచే విధంగా కలుస్తాయి.
మోడల్-4
ఉదా-1: 4, 5 గంటల మధ్య గడియారంలోని రెండు ముళ్లు ఎప్పుడు సరళకోణంలోకి వస్తాయి?
ఎ. 4 గంటల 54 2/11 నిమిషాలు
బి. 4 గంటల 54 6/11 నిమిషాలు
సి. 5 గంటల 54 2/11 నిమిషాలు
డి. 5 గంటల 54 6/11 నిమిషాలు
-సమాధానం-బి
గమనిక
-6 గంటలకు ముందు ఉంటే 180 కలుపాలి.
-6 గంటలకు తర్వాత ఉంటే 180 తీసివేయాలి.
వివరణ
4(30) = 120 + 180 = 300(2/11) = 600/11 = 54 6/11 నిమిషాలు
-అంటే 4 గంటల 54 6/11 నిమిషాల సమయమప్పుడు రెండు ముళ్లు వ్యతిరేక దిశలో ఉంటాయి.
ఉదా-2: 7, 8 గంటల మధ్య రెండు ముళ్లు ఎప్పుడు సరళకోణంలోకి వస్తాయి?
ఎ. 7 గంటల 5 2/11 నిమిషాలు
బి. 7 గంటల 5 5/11 నిమిషాలు
సి. 7 గంటల 5 6/11 నిమిషాలు
డి. 7 గంటల 5 3/11 నిమిషాలు
-సమాధానం-బి
వివరణ
-7(30) = 210 – 180 = 30(2/11) = 60/11 = 5 5/11 నిమిషాలు
-అంటే 7 గంటల 5 5/11 నిమిషాల సమయమప్పుడు రెండు ముళ్లు వ్యతిరేక దిశలో ఉంటాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు