కేంద్రంలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది?
పాలిటీ
1. గవర్నర్ పదవికి మూలాధారం?
A. అమెరికా రాజ్యాంగం
B. కెనడా రాజ్యాంగం
C. 1935 భారత ప్రభుత్వ చట్టం
D. B&C
2. స్వతంత్ర అభ్యర్థులుగా ముఖ్యమంత్రులు అయినవారు?
1. విశ్వనాథ్ దేశాయ్
2. త్రిబువన్ నారాయణ
3. ఎస్ ఎఫ్ కంగ్లన్
4. మధు కోడా
A. 1, 2, 3, 4 B. 1, 3, 4
C. 2, 1, 3, 4 D. 2, 3
3. భారతదేశంలో మహిళా ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసింది ఎవరు?
A. మాయావతి B. సుష్మ స్వరాజ్
C. జయలలిత D. షీలా దీక్షిత్
4. భారతదేశంలో తొలి కాంగ్రెసేతర మహిళా ముఖ్యమంత్రి ఎవరు?
A. జానకి రామచంద్రన్
B. షీలా దీక్షిత్
C. శశికళ గురుదత్ కకోధర్
D. జయలలిత
5. ఈశాన్య రాష్ర్టాలలో తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు?
A. సయ్యద్ అన్వర్ తైమూర్
B. నందిని శతపతి
C. రబ్రీ దేవి
D. శశికళ గురుదత్ కకోధర్
6. ఒకేరోజు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రం ఏది?
A. మధ్యప్రదేశ్ B. ఉత్తరప్రదేశ్
C. హర్యానా D. రాజస్థాన్
7. దక్షిణ భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు?
A. జయలలిత
B. జానకి రామచంద్రన్
C. శశికలా గురుదత్ కకోధర్
D. శారద ముఖర్జీ
8. అధికార భాషలు ఏ షెడ్యూల్లో కలవు?
A. నాలుగో షెడ్యూల్
B. 9వ షెడ్యూల్
C. మూడో షెడ్యూల్
D. ఎనిమిదో షెడ్యూల్
9. ప్రాథమిక విధులకు సంబంధించి సరికానిది?
A. భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి
B. కొన్ని నైతికపరమైనవి
C. ఎప్పుడు రద్దు కావు
D. న్యాయసమ్మతమైనవి
10. ఉమ్మడి సంస్కృతిని గౌరవించాలి అనేది ఎందులో కనిపిస్తుంది?
A. ఆదేశిక సూత్రాలు
B. రాజ్యాంగ ప్రవేశిక
C. ప్రాథమిక హక్కులు
D. ప్రాథమిక విధులు
11. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం సభ్యుని అనర్హతను నిర్ణయించేది ?
A. సుప్రీంకోర్టు B. హైకోర్టు
C. రాష్ట్రపతి D. సభాధ్యక్షులు
12. కేంద్ర రాష్ర్టాల మధ్య వివాదాల పరిష్కారం సుప్రీంకోర్టు ఏ అధికార పరిధిలోకి వస్తుంది?
A. సలహా రూపక B. కోర్ట్ ఆఫ్ రికార్డ్
C. ప్రారంభ విచారణ D. పైవన్నీ
13. అంతర్జాతీయ శాంతి పరిరక్షణ అనేది ఎందులో అంతర్భాగం?
A. ప్రాథమిక హక్కులు
B. ప్రాథమిక విధులు
C. రాజ్యాంగ ప్రవేశిక
D. ఆదేశిక సూత్రాలు
14. 103వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది?
A. ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్ మరో 10 సంవత్సరాల పొడిగింపు
B. జీఎస్టీ
C. బంగ్లాదేశ్తో భూ సరిహద్దు
D. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్
15. ఉన్నత కులాల్లో పేదలకు(ఈబీసీ) రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం?
A. పశ్చిమబెంగాల్ B. కర్ణాటక
C. రాజస్థాన్ D. తమిళనాడు
16. స్విట్జర్లాండ్లోని ‘ల్యాండ్ గమాండ్’ను పోలిన వ్యవస్థ?
A. బ్లాక్ వ్యవస్థ B. గ్రామసభ
C. మండల వ్యవస్థ D. జిల్లా వ్యవస్థ
17. ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ అధికరణ?
A. 16(4-A) B. 16(4)
C. 16(5) D. 16(4-B)
18. పార్లమెంట్ అంటే?
A. లోక్సభ, రాజ్యసభ
B. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి
C. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి
D. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ప్రధానమంత్రి
19. అంతర్ రాష్ట్రమండలిని ఏర్పాటు చేయమని కోరిన తొలి రాష్ట్రం.
A. పశ్చిమబెంగాల్ B. రాజస్థాన్
C. కేరళ D. తమిళనాడు
20. భారతదేశంలో మొదటి మహిళా మేయర్.
A. లక్ష్మీ సెహగల్
B. అరుణా అసఫ్ అలీ
C. పద్మజా నాయుడు
D. సరోజినీ నాయుడు
21. జీరో అవర్ ఎప్పటి నుంచి అమల్లో ఉంది?
A. 1962 B. 1963
C. 1968 D. 1952
22. దేశంలో తొలి ఈ న్యాయస్థానం ఏర్పాటు చేసిన రాష్ట్రం?
A. ఆంధ్రప్రదేశ్ B. తెలంగాణ
C. గుజరాత్ D. తమిళనాడు
23. విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, వెనుకబడిన ముస్లింలకు ఓబీసీ విభాగంలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన రాష్ట్రం?
A. పశ్చిమబెంగాల్
B. తమిళనాడు
C. తెలంగాణ
D. మధ్యప్రదేశ్
24. అత్యధికంగా మహిళలు 16వ లోక్సభకు ఎంతమంది ఎన్నికయ్యారు?
A. 56 B. 61 C. 59 D. 60
25. భారతదేశానికి రాజ్యాంగం కావాలని కోరిన తొలి వ్యక్తి?
A. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
B. మహాత్మాగాంధీ
C. నెహ్రూ D. మానవేంద్ర నాథ్ రాయ్
26. భారత రాజ్యాంగాన్ని 2014 డిసెంబర్ 9న ఏ భాషలోకి అనువదించారు?
A. ఇంగ్లిష్ B. అరబిక్
C. ఉర్దూ D. మరాఠీ
27. చిత్తు రాజ్యాంగ నిర్మాత?
A. డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్
B. సయ్యద్ సాదుల్లా
C. బి ఎన్ రావు
D. కేఎం మున్షి
28. భారత రాజ్యాంగ పరిషత్ ను న్యాయవాదుల స్వర్గంగా వ్యాఖ్యానించింది?
A. సెయింట్ సైమన్ B. విన్సెంట్ చర్చిల్
C. ఐవర్ జెన్నింగ్ D. ఎంవీ ఫైలి
29. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా దేశ విభజన జరగాలని సూచించింది?
A. మహాత్మా గాంధీజీ
B. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
C. రాజగోపాల చారి
D. నెహ్రూ
30. పోర్టు ఫోలియో వ్యవస్థను 1859లో ఏర్పాటు చేసింది?
A. లార్డ్ కానీoగ్ B. లార్డ్ మెకాలే
C. కారన్ వాలిస్ D. విలియం డ్యూక్
31. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన రెండో భారతీయుడు?
A. సత్యేంద్ర ప్రసాద్
B. దాదాభాయ్ నౌరోజీ
C. బిపిన్ చంద్రపాల్
D. బాలగంగాధర్ తిలక్
32. భారతదేశంలో ద్వంద్వ పాలనకు మూలకారకుడు?
A. లార్డ్ మెకాలే
B. క్లెమెంట్ అట్లీ
C. విలియం డ్యూక్
D. కారన్ వాలిస్
33. కాగ్ నివేదికను శవపరీక్ష వంటిదని విమర్శించింది?
A. వీ నరహరిరావు
B. సీజీ సోమయ్య
C. ఏకే చందా
D. పాల్ ఆపిల్ బి
34. ప్రభుత్వ ఖాతాల సంఘానికి మిత్రుడు?
A. అటార్నీ జనరల్ B. కాగ్
C. ఆర్థిక శాఖ కార్యదర్శి
D. అడ్వకేట్ జనరల్
35. రాజ్యాంగంలో నూతన భాషలలో చేర్చడానికి చేసిన రాజ్యాంగ సవరణలు?
A. 21&71& 91వ రాజ్యాంగ సవరణలు
B. 21&71& 92 వ రాజ్యాంగ సవరణలు
C. 21&72& 92 వ రాజ్యాంగ సవరణలు
D. 21&70& 91వ రాజ్యాంగ సవరణలు
36. మంత్రి మండలిని మూడు రకాలుగా వర్గీకరించింది?
A. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
B. గోపాలస్వామి అయ్యంగార్
C. బాబు రాజేంద్రప్రసాద్
D. కేఎం మున్షి
37. ప్రణాళిక సంఘాన్ని ‘ఆర్థిక క్యాబినెట్” అని వ్యాఖ్యానించింది?
A. కే సంతానం B. ఇందిరాగాంధీ
C. ఏకే చందా D. నెహ్రూ
38. కేంద్రంలో మంత్రి మండలి పరిమితిని 91 వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎంతగా నిర్ణయించారు?
A. పార్లమెంటు సభ్యుల్లో 15%
B. లోక్సభ సభ్యుల్లో 15%
C. పార్లమెంటు సభ్యుల్లో 10 శాతం
D. లోక్సభ సభ్యుల్లో 10%
39. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఎంతమంది సభ్యుల మద్దతు కావాలి?
A. లోక్సభ సభ్యుల్లో 1/4వంతు
B. రాజ్యసభ సభ్యుల్లో 50 మంది
C. లోక్సభలో 50 మంది
D. లోక్సభ లేదా రాజ్యసభలో 50 మంది
40. నెహ్రూ ప్రభుత్వంపై తొలిసారి అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టారు?
A. 1953 B. 1952
C. 1963 D. 1962
41. మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు నడిపిన ప్రధానమంత్రి?
A. పీవీ నరసింహారావు
B. వి.పి.సింగ్
C. మన్మోహన్ సింగ్
D. అటల్ బిహారీ వాజ్పేయి
42. కేంద్రంలో ఎక్కువసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టినది?
A. చరణ్ సింగ్ B. చిదంబరం
C. మొరార్జీ దేశాయ్ D. ప్రణబ్ ముఖర్జీ
43. భారత ప్రధానమంత్రికి సంబంధించి సరి కానిది.
A. రాష్ట్రపతి జీతం నిర్ణయిస్తాడు
B. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు
C. రాష్ట్రపతి నియమిస్తాడు
D. రాష్ట్రపతికి రాజీనామా పత్రం ఇవ్వాలి
44. ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోయిన ఏకైక వ్యక్తి?
A. వి.వి. గిరి
B. బైరాన్ సింగ్ షెకావత్
C. శంకర్ దయాళ్ శర్మ
D. ఆర్.వెంకట్రామన్
45. అత్యవసర పరిస్థితి (1975- 77) లో ఉత్పన్నమైన పరిస్థితులను అధ్యయనం చేయటానికి జనతా ప్రభుత్వం నియమించిన కమిటీ?
A. సర్కారియా కమిషన్
B. షా కమిటీ
C. రాజమన్నార్ కమిటీ
D. దాస్ కమిటీ
46. రాష్ట్రపతి ఎన్నికల్లో ఢిల్లీ, పాండిచ్చేరి అసెంబ్లీ సభ్యులకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అవకాశం కల్పించారు.
A. 71 వ రాజ్యాంగ సవరణ
B. 70 వ రాజ్యాంగ సవరణ
C. 69 వ రాజ్యాంగ సవరణ
D. 72వ రాజ్యాంగ సవరణ
47. కింది వారిలో రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనని వారు?
A. లోక్ సభకు ఎన్నికైన సభ్యులు
B. రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు
C. రాష్ట్ర శాసనమండలికి ఎన్నికైన సభ్యులు
D. రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులు
48. కింది వారిలో ఏకగ్రీవంగా ఎన్నిక కాని ఉపరాష్ట్రపతి?
A. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
B. జస్టిస్ హిదయతుల్లా
C. శంకర్ దయాళ్ శర్మ
D. కృష్ణకాంత్
49. కింది వారిలో ఎవరికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంది. కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో లేదు?
A. రాజ్యసభ నామినేటెడ్ సభ్యులు
B. పార్లమెంట్ లోని నామినేటెడ్ సభ్యులు
C. రాష్ట్ర దిగువ సభకు ఎన్నికైన సభ్యులు
D. ఉభయ సభల్లో దేనిలోనూ సభ్యులు కాని మంత్రులు
50. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివాదాలు ఎవరు పరిష్కరిస్తారు?
A. పార్లమెంట్ B. రాజ్యసభ
C. సుప్రీంకోర్టు D. స్పీకర్
51. రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని ఎన్ని రోజుల ముందు రాష్ట్రపతికి నోటీసు ఇవ్వాలి?
A. 15 రోజులు B. పది రోజులు
C. 14 రోజులు D. రెండు నెలలు
52. పార్లమెంట్ ఉభయ సభ సంయుక్త సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. ఒకవేళ స్పీకర్ అందుబాటులో లేకుంటే డిప్యూటీ స్పీకర్, అతను కూడా అందుబాటు లేకుంటే సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
A. ఉపరాష్ట్రపతి
B. రాజ్యసభ డిప్యూటీ చైర్ పర్సన్
C. రాష్ట్రపతి
D. ప్రధానమంత్రి
53. జంతు హింస నిషేధం ఏ జాబితాలో ఉంది?
A. రాష్ట్ర జాబితా
B. ఉమ్మడి జాబితా
C. కేంద్ర జాబితా
D. అవశిష్టధికారం
54. భారత్ అత్యున్నతాధికార సమాఖ్య అని వ్యాఖ్యానించింది?
A. అంబేద్కర్ B. కే సంతానం
C. మారిస్ జోన్స్
D. లార్డ్ మెకాలే


Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






