General Science | హ్రస్వ దృష్టి ఉన్నవారిలో ప్రతిబింబం ఏర్పడే ప్రదేశం?
1. కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఏది?
1) విటమిన్-ఎ 2) విటమిన్-బి
3) విటమిన్-సి 4) విటమిన్-డి
2. ఇంద్రియ జ్ఞానమనేది ఒక సంక్లిష్టమైన విధానం. దీనిలో పాల్గొనేది?
1) జ్ఞానేంద్రియాలు
2) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు
3) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు, మెదడు
4) మెదడు, నాడీ ప్రేరణ
3. ఒక వ్యక్తి నాలుక ఎక్కువ ఉప్పగా ఉన్న ప్రదార్థం రుచి చూసింది. అప్పుడు ఆ వ్యక్తి?
1) ఉప్పటి పదార్థాలను తినడం నేర్చుకుంటాడు
2) ఉప్పటి పదార్థాలను తినడానికి ఇష్టపడతాడు
3) ఉప్పటి పదార్థాలను తినడానికి ఇష్టపడడు
4) అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాల రుచిని తెలుసుకోలేడు
4. ఇంద్రియ జ్ఞానాలు అయిదింటి గురించి మొదటగా తెలిపింది ఎవరు?
1) ప్లేటో 2) అరిస్టాటిల్
3) 1, 2 4) ఆల్బర్ట్స్ మాగ్నస్
5. వెలుపలి చెవి గనుక శబ్ద తరంగాలను కేంద్రీకరించకపోతే శ్రవణ కుల్య?
1) అనేక రకాల శబ్దాలను గట్టిగా వినగలదు
2) ఏమీ వినలేదు
3) కొద్దిగా వినగలదు
4) శబ్దం పుట్టుకను, రకాన్ని తెలుసుకోలేదు
6. ఆధార్ వంటి గుర్తింపు కార్డుల్లో కంటి ఏ భాగాన్ని ఫొటో ద్వారా బంధిస్తారు?
1) కంటిపాప
2) కంటి మొత్తం భాగం
3) కనుగుడ్డు 4) పైవన్నీ
7. కంటిలోని శంకువుల సంఖ్య సుమారుగా?
1) 6 మిలియన్లు 2) 7 మిలియన్లు
3) 8 మిలియన్లు 4) 9 మిలియన్లు
8. ఒక వ్యక్తి కను గుడ్డు కండరాలు పనిచేయకుండా పాడైతే తప్పనిసరిగా కలిగే ప్రభావం?
1) ఆ వ్యక్తి కళ్లు మూసుకోలేడు
2) కన్ను కదపలేడు, రంగులను బాగా చూడగలడు
3) కంటిలో నొప్పి వస్తుంది
4) ఆ కండరాలకు చేరే నాడులు పనిచేయవు
9. కంటి గుడ్డులో మనకు బయటకు కనబడే భాగం?
1) 1/2వ వంతు 2) 1/3వ వంతు
3) 1/4వ వంతు 4) 1/6వ వంతు
10. నేత్ర పటలంలోని సిరలో రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడటాన్ని ఏమంటారు?
1) సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లుసన్
2) కండ్ల కలక
3) ఆప్టిక్ న్యూరైటిస్ 4) స్లీరైటిస్
11. ఎ: నేత్రపటలంలోని మాక్యులా ఉబ్బటం వల్ల మాక్యులార్ ఎడిమా వస్తుంది
బి: మాక్యులా లేదా పచ్చ చుక్క ఉబ్బటం వల్ల దృష్టి దోషం కలగవచ్చు
పై ప్రవచనాల్లో సరైనది?
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీ కాదు
12. కంటిలోని దృక్నాడీ పెద్దదిగా మారడాన్ని ఏమంటారు?
1) ఆప్టిక్ మైక్రోమా 2) ఆప్టిక్ న్యూరైటిస్
3) స్లీరైటిస్ 4) కెరోటైటి
13. నెలలు నిండకుండానే పుట్టే పిల్లల్లో నేత్రపటలం మీద అసాధారణంగా రక్తనాళాలు పెరగడాన్ని ఏమంటారు?
1) రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ
2) గ్లకోమా
3) ట్రకోమా
4) జిరాఫ్తాల్మియా
14. కంటిలోని దండాల సంఖ్య సుమారుగా?
1) 7 మిలియన్లు 2) 125 మిలియన్లు
3) 9 మిలియన్లు 4) 150 మిలియన్లు
15. పచ్చ చుక్కను ఏమంటారు?
1) మాక్యులా 2) ఫోవియా
3) 1, 2 4) టపేటమ్
16. చర్మంలోని అంతరశ్చర్మంలో ఉండేవి?
1) స్వేద గ్రంథులు
2) సెబేషియన్ గ్రంథులు, రక్తనాళాలు
3) రోమ పుటికలు, కొవ్వులు
4) పైవన్నీ
17. విటమిన్ల లోపం వల్ల చర్మానికి వచ్చే వ్యాధి?
1) కుష్టు 2) పెల్లాగ్రా
3) బొల్లి 4) తామర
18. నాలుకలోని రుచి గుళికల సంఖ్య ఎంత?
1) 100 2) 1,000
3) 10,000 4) 1,00,000
19. నేత్రపటలంలోని ఏ భాగంలో కాంతి గ్రాహకాలు ఉండవు?
1) అంధ చుక్క 2) పసుపు చుక్క
3) ఆకుపచ్చ చుక్క 4) నల్ల చుక్క
20. మధ్య చెవి అంతర చెవిలోకి దేని ద్వారా తెరుచుకుంటుంది?
1) గుండ్రని కిటికీ
2) అండాకార కిటికీ
3) వర్తులాకార కిటికీ
4) దీర్ఘ వృత్తాకార కిటికీ
21. నేత్రపటలంలోని దండాల్లో ఉండే వర్ణద్రవ్యం?
1) రొడాప్సిన్ 2) అయోడాప్సిన్
3) ఫొటాప్సిన్ 4) కీటాప్సిన్
22. మధ్య చెవి ఎముకల గొలుసులో ఉండేవి?
1) కూటకం 2) దాగిలి
3) కర్ణాంతరాస్థి 4) పైవన్నీ
23. మెటాలిక్ టేస్ట్ ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది?
1) సహజ ఆహార పదార్థాలు
2) కృత్రిమంగా తయారైన ఆహార పదార్థాలు
3) పచ్చి ఆహార పదార్థాలు
4) వండిన ఆహార పదార్థాలు
24. యుక్త వయస్సు వచ్చిన వారిలో శరీరాన్ని కప్పి ఉంచే చర్మ ఉపరితల వైశాల్యం?
1) 1 1/2 చదరపు మీటర్లు
2) 2 1/2 చదరపు మీటర్లు
3) 3 1/2 చదరపు మీటర్లు
4) 4 1/2 చదరపు మీటర్లు
25. MSG అంటే?
1) మోనోసోడియం గ్లుటామేట్
2) మెగ్నీషియం సోడియం గ్లుటామేట్
3) మోనోసల్ఫర్ గ్లుటామేట్
4) మెగ్నీషియం సల్ఫర్ గ్లుటామేట్
26. హ్రస్వ దృష్టి ఉన్నవారిలో ప్రతిబింబం ఏర్పడే ప్రదేశం?
1) నేత్ర పటలానికి ముందు
2) నేత్ర పటలంపై
3) నేత్ర పటలానికి వెనుక
4) పైవేవీ కాదు
27. అప్పుడే తయారైన కాఫీలో వెంటనే ఆవిరయ్యే ఎన్ని సంయోగ పదార్థాలుంటాయి?
1) 500 2) 600
3) 700 4) 800
28. చర్మాన్ని కాంతి నుంచి రక్షించేది?
1) టానిన్ 2) మెలనిన్
3) టయలిన్ 4) మైలీన్
29. చర్మంలో నిర్జీవకాలు ఉండే పొర?
1) కార్నియా పొర
2) గ్రాన్యులర్ పొర
3) మాల్ఫీజియన్ పొర
4) క్యుటేనియస్ పొర
30. శరీర సమతాస్థితి నిర్వహించే అవయవం?
1) కన్ను 2) ముక్కు
3) చెవి 4) నాలుక
31. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎన్ని రకాల వాసనలను ఉత్పత్తి చేయగలిగే రసాయనాలను వర్గీకరించారు?
1) 1000 2) 1500
3) 2000 4) 2500
32. చర్మంలో స్థిరంగా విభజనలు చెందుతూ ఉండే పొర?
1) కార్నియా పొర
2) గ్రాన్యులార్ పొర
3) మాల్ఫీజియన్ పొర
4) క్యుటేనియస్ పొర
33. కంటిలో ఏర్పడే ప్రతిబింబ లక్షణం?
1) మామూలుగా నిలువుగా
2) మామూలుగా తలకిందులుగా
3) ఎడమ, కుడి, నిలువుగా
4) ఎడమ, కుడి, తలకిందులుగా
34. భూ భ్రమణం, పరిభ్రమణం గురించి వివరించి జ్ఞానేంద్రియంగా కన్ను పాత్రను వివరించే ప్రయత్నం చేసిన శాస్త్రవేత్త?
1) ఆల్బర్ట్స్ మాగ్నస్ 2) అరిస్టాటిల్
3) ప్లేటో 4) జొహాన్స్ కెప్లర్
35. జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నింటికి కేంద్రం?
1) మెదడు 2) వెన్నుపాము
3) 1, 2 4) కాలేయం
36. దండాలు, శంకువులు అనే కణాలు ఎక్కడ ఉంటాయి?
1) దృఢ స్తరం 2) రక్త పటలం
3) నేత్ర పటలం 4) పై అన్నింటిలో
37. పేటిక ముందుభాగాన్ని ఏమంటారు?
1) యుట్రిక్యులార్ 2) సాక్యులస్
3) కాక్లియా 4) అర్ధవర్తుల కుల్యలు
38. మెలనిన్ అనే వర్ణద్రవ్యం దేనిలో ఉంటుంది?
1) చెవి 2) నాలుక
3) ముక్కు 4) చర్మం
39. కంటిలోని ఏ భాగాన్ని సరిచేయవచ్చు?
1) కను గుడ్డు
2) ద్వికుంభాకార కటకం
3) ముక్కు 4) చర్మం
40. కంటిలో ఉండే గ్రంథులు?
1) లాక్రిమల్ గ్రంథులు
2) సెరుమినస్ గ్రంథులు
3) సెబేషియస్ గ్రంథులు
4) శ్లేష్మ గ్రంథులు
41. పిన్నా అని దేన్ని పిలుస్తారు?
1) అంతర చెవి 2) మధ్య చెవి
3) బాహ్య చెవి 4) కర్ణభేరి
42. పరిసరాల నుంచి ప్రేరణను గ్రహించే మన శరీర భాగాలు?
1) కన్ను, చెవి
2) ముక్కు, నాలుక
3) చర్మం 4) పైవన్నీ
43. కన్ను కాంతిని సేకరించి కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి దేనిపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది?
1) దృఢ స్తరం 2) కనుపాప
3) తారక 4) నేత్ర పటలం
44. జెల్లీ వంటి పదార్థంలో నిండి ఉండే కంటి గుడ్డు భాగం?
1) కచావత్ కక్ష్య 2) నేత్రోదయ కక్ష్య
3) రక్త పటలం 4) దృఢ స్తరం
45. కంటిలో ఉండే ఏ పొరలో ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలు ఉంటాయి?
1) కంటి పొర 2) దృఢ స్తరం
3) రక్త పటలం 4) నేత్ర పటలం
46. జ్ఞానేంద్రియాల నుంచి నాడీ ప్రచోదనాలను తీసుకొని వచ్చేవి?
1) చాలకనాడులు 2) వెన్నునాడులు
3) జ్ఞాననాడులు 4) పైవన్నీ
47. రుచి గుళికలు లేని పాపిల్లే?
1) ఫిలిపార్మ్ పాపిల్లే
2) ఫంగిపార్మ్ పాపిల్లే
3) సర్కంవెల్లేట్ పాపిల్లే
4) 1, 3
48. ఉమామి+MSG=?
1) ఫెచింగ్ 2) హచింగ్
3) హన్నింగ్ 4) జన్నింగ్
49. కర్ణావర్తంలో ఉండే సమాంతర నాళం?
1) స్కాలా వెస్టిబ్యులా
2) స్కాలా మీడియా
3) స్కాలా టింపాని 4) పైవన్నీ
50. ఏ లిపిలో అక్షరాలు ఎత్తు పల్లాలను కలిగి ఉంటాయి?
1) బ్రెయిలీ లిపి 2) సర్పలేఖనం
3) సంస్కృత లిపి 4) పాళీ లిపి
సమాధానాలు
1. 1 2. 3 3. 4 4. 3
5. 2 6. 1 7. 2 8. 2
9. 4 10. 1 11. 3 12. 2
13. 1 14. 2 15. 3 16. 4
17. 2 18. 3 19. 1 20. 3
21. 1 22. 4 23. 2 24. 1
25. 1 26. 1 27. 2 28. 2
29. 1 30. 3 31. 2 32. 3
33. 4 34. 4 35. 3 36. 3
37. 2 38. 4 39. 2 40. 1
41. 3 42. 4 43. 4 44. 2
45. 3 46. 3 47. 1 48. 2
49. 4 50. 1
విటమిన్-ఎ
- దీని రసాయన నామం- రెటినాల్
- విటమిన్-ఎను యాంటీ జిరాఫ్తాల్మిక్ విటమిన్, యాంటీ నిక్టాలోపిక్ విటమిన్గా పిలుస్తారు.
- విటమిన్-ఎ మొక్కల్లో బీటా కెరోటిన్ (ప్రోవిటమిన్-ఎ) రూపంలో ఉంటుంది. కాలేయం, పేగుల్లో బీటా కెరోటిన్ విటమిన్-ఎ గా మారుతుంది.
విధులు - ఉపకళా కణజాలాలు ఉత్తేజితంగా ఉండటానికి, పెరుగుదలకు, కంటిచూపు మామూలుగా ఉంచడంలోనూ ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. రక్తనాళాల్లో మ్యూకస్ పొరను రక్షిస్తుంది.
- కంటి నేత్రపటంలో (రెటీనా) రొడాప్సిన్ (విజువల్ పర్పుల్) పునఃసంశ్లేషణకు విటమిన్-ఎ అత్యావశ్యకం.
- రెటినోయిక్ ఆమ్లం (విటమిన్-ఎ ఆమ్లం) కొన్ని రకాల క్యాన్సర్లను నాశనం చేస్తుంది.
- జంతువుల్లో శరీర పెరుగుదలకు, ఎముకలు, దంతాలు ఏర్పడటానికి విటమిన్-ఎ అవసరం.
లోపం వల్ల కలిగే వ్యాధులు - విటమిన్-ఎ లోపం వల్ల రేచీకటి (నిక్టోలోపియా), జిరాఫ్తాల్మియా (కండ్ల కలక, కంజెక్టివా పొడిబారడం), కెరటోమలేషియా (శుక్ల పటలం పొడిబారడం), చత్వారం కలుగుతాయి. ఇవే కాకుండా చర్మం పొడిబారడం, నేత్ర పటలం సమస్యలు కలుగుతాయి.
లభించే వనరులు - ఆకుకూరలు, క్యారెట్, టమాటా, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసం, చేపలు, గుడ్లు, పాలు, కాడ్ చేపలు, షార్క్ చేపల నుంచి లభించే నూనెల్లో విటమిన్-ఎ పుష్కలంగా లభిస్తుంది. రోజువారీ ఆహారంలో విటమిన్-ఎ ఉండాల్సిన పరిమాణం 750 మిల్లీ గ్రాములు.
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

