TS EDCET | తెలంగాణ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల
- రేపట్నుంచి విద్యార్థుల దరఖాస్తుల స్వీకరణ
- మే 18వ తేదీన ప్రవేశ పరీక్ష
రెండేండ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్నది. జనరల్, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎడ్‌సెట్‌ను మే 18న ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో నిర్వహిస్తారు. ఎడ్‌సెట్‌ను గతంలో ఉస్మానియా వర్సిటీ నిర్వహించింది. ఈ ఏడాది నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాస్‌రావు, ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టీ కృష్ణారావు, ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రామకృష్ణ, ప్రొఫెసర్ ఏ రవికుమార్, ప్రొఫెసర్ పారుపల్లి శంకర్తదితరులు పాల్గొన్నారు.
షెడ్యూల్.. తేదీలు
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం 6-3-2023
- దరఖాస్తుకు తుది గడువు 20-4-2023
- రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తు 25-4-2023
- దరఖాస్తుల ఎడిటింగ్ 30-4-2023
- హాల్‌టికెట్ల డౌన్లోడింగ్ 5-5-2023
- పరీక్ష తేదీ 18-5-2023
- ప్రాథమిక కీ విడుదల 21-5-2023
- ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ 24 -5-2023 సాయంత్రం5 గంటల వరకు
వెబ్సైట్: https://edcet.tsche.ac.in
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక