NMDC Recruitment | హైదరాబాద్ ఎన్ఎండీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు
NMDC Recruitment | కేంద్ర ఉక్కు శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నవరత్న హోదా కలిగిన ప్రభుత్వరంగ సంస్థ అయిన హైదరాబాద్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC)లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (Executive Traine) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, మెకానికల్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2022 అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జూలై 17 వరకు ఆన్లైన్ అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 42 పోస్టులను భర్తీచేస్తున్నది. షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనుంది.
మొత్తం పోస్టులు: 42
పోస్టులు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2022 అర్హత సాధించి ఉండాలి. అదేవిధంగా సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
దరఖాస్తు : ఆన్లైన్లో
జీతం : నెలకు రూ.50000
దరఖాస్తు ఫీజు: రూ.500.
అప్లికేషన్లకు చివరితేదీ: జూలై 17
వెబ్సైట్: www.nmdc.co.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






