Indian Navy, SVPITM Recruitment | రేపే చివరి గడువు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా?
Last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఇండియన్ నేవీ (Indian Navy) సిపెట్ (CIPET), సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ మేనేజ్మెంట్లో (SVPITM), నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (NABI), ఇండియన్ బ్యాంక్ (Indian bank) లు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది.
1.CIPET Recruitment | చెన్నై సిపెట్‌లో ఉద్యోగాలు
CIPET Recruitment 2023 | అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్, అకౌంట్స్ అసిస్టెంట్ గ్రేడ్-3, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గ్రేడ్-3 తదితర పోస్టుల భర్తీకి చెన్నైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (CIPET), డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 38
పోస్టులు : అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్, అకౌంట్స్ అసిస్టెంట్ గ్రేడ్-3, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గ్రేడ్-3 తదితరాలు.
విభాగాలు : స్కిల్ డెవలప్మెంట్, ప్రాసెసింగ్, టెస్టింగ్, డిజైన్, టూల్ రూమ్, క్యాడ్, క్యామ్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక : రాత, నైపుణ్య పరీక్షలు, ధ్రువపత్రాల పరీశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
ధరఖాస్తు ఫీజు: లేదు
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్), సిపెట్ ప్రధాన కార్యాలయం, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: మే 29
వెబ్సైట్ : www.cipet.gov.in
2. SVPITM | కోయంబత్తూర్‌లో ప్రొఫెసర్ పోస్టులు
SVPITM Recruitment 2023| కోయంబత్తూర్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ మేనేజ్మెంట్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 12
పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్లేస్మెంట్ అండ్ ట్రెయినింగ్, డెవలప్మెంట్ ఆఫీసర్లు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 29
వెబ్సైట్: www.svpitm.ac.in
3. NABI Recruitment | ఎన్‌ఏబీఐలో రిసెర్చ్ స్టాఫ్ పోస్టులు
NABI Recruitment 2023 | సీనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ తదితర రిసెర్చ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం పంజాబ్‌లోని నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (ఎన్ఏబీఐ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బీటెక్, బీఈ, బీఎస్సీ, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ, ఎంఈ, ఎంటెక్, ఎంవీఎస్సీ, పీజీ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 07
పోస్టులు : సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ తదితరాలు
అర్హతలు: పోస్టులను బట్టి బీటెక్, బీఈ, బీఎస్సీ, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ, ఎంఈ, ఎంటెక్, ఎంవీఎస్సీ, పీజీ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు: 50 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: మే 29
వెబ్సైట్ : https://nabi.res.in/site/career
4.Indian Navy Recruitment | ఇండియన్ నేవీలో 372 ఛార్జ్‌మెన్ పోస్టులు
Indian Navy Recruitment 2023 | ఎలక్ట్రికల్ ఫిట్టర్, గైరో ఫిట్టర్, రేడియో ఫిట్టర్, రాడార్ ఫిట్టర్, సోనార్ ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ ఫిట్టర్, కంప్యూటర్ ఫిట్టర్, వెపన్ ఫిట్టర్, బాయిలర్‌మేకర్ తదితర ఛార్జ్‌మెన్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ను ఒక సబ్జెక్టుగా సైన్స్‌లో కలిగి ఉండాలి. రాత పరీక్ష, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ / స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ ప్రకటన ద్వారా 372 పోస్టులను ఇండియన్ నేవీ భర్తీ చేయనున్నది.
మొత్తం పోస్టులు : 372
పోస్టులు : ఎలక్ట్రికల్ ఫిట్టర్, గైరో ఫిట్టర్, రేడియో ఫిట్టర్, రాడార్ ఫిట్టర్, సోనార్ ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ ఫిట్టర్, కంప్యూటర్ ఫిట్టర్, వెపన్ ఫిట్టర్, బాయిలర్‌మేకర్ తదితర సివిలియన్ పోస్టులు
అర్హతలు : పోస్టులను బట్టి ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ను ఒక సబ్జెక్టుగా సైన్స్‌లో కలిగి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ / స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
జీతం : నెలకు రూ.35,400తో పాటు అలవెన్సులు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 29
వెబ్సైట్ : joinindiannavy.gov.in
5. Indian BANK Recruitment | ఇండియన్ బ్యాంక్‌లో 18 స్పెషలిస్ట్ పోస్టులు
Indian BANK Recruitment | ప్రొడక్ట్ మేనేజర్, టీమ్ లీడ్, సీఏ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 18
పోస్టులు : ప్రొడక్ట్ మేనేజర్, టీమ్ లీడ్, సీఏ
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, సీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంబీఏ ఉత్తీర్ణత.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 29
వెబ్సైట్ : https://www.indianbank.in/career/
అడ్రస్ : చీఫ్ జనరల్ మేనేజర్ (CDO & CLO), ఇండియన్ బ్యాంక్ కార్పొరేట్ ఆఫీస్, HRM డిపార్ట్మెంట్, రిక్రూట్మెంట్ సెక్షన్ 254-260, అవ్వై షణ్ముగం సలై, రాయపేట, చెన్నై, పిన్ – 600 014, తమిళనాడు.
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






