Government Jobs 2023 | యూపీఎస్సీలో 1312 పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1.UPSC CMS Recruitment | యూపీఎస్సీలో 1261 పోస్టులు..
UPSC CMS Notification 2023 |వివిధ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్, జీడీఎంవో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ (CMS) ఎగ్జామినేషన్-2023 ప్రకటనను న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. మే 9లోగా అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 1261
పోస్టులు : 1.మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ : 584 పోస్టులు
2. అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(రైల్వే): 300
3. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ : 01
4. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 : 376
అర్హతలు : ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 32 ఏండ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు : రూ.200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
ఎంపిక : రాత పరీక్ష , ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 09
వెబ్సైట్ : upsc.gov.in.
2.UPSC IES ISS Notification | యూపీఎస్సీలో 51 పోస్టులు
UPSC IES ISS Notification 2023 | ఎకనామిక్స్/ స్టాటిస్టికల్ విభాగాల్లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 ప్రకటనను న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీ (ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్) డిగ్రీ (స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. మే 9లోగా అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 51
పోస్టులు : ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్
అర్హతలు : పీజీ (ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్) డిగ్రీ (స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్) పీజీ(స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.200(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 09
వెబ్సైట్ : upsc.gov.in.
3.Narayanapet DMHO Recruitment | నారాయణపేట జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
Narayanapet DMHO Recruitment 2023 | అర్బన్ హెల్త్ సెంటర్ నారాయణపేటలో ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎంపీహెచ్ఏ (ఎఫ్) పోస్టుల భర్తీకి నారాయణపేటలోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, డీఎంఎల్టీ, ఎంఎల్టీ, ఎంపీహెచ్ఏ(ఎఫ్) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 07
పోస్టులు : ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎంపీహెచ్ఏ(ఎఫ్).
అర్హతలు: పోస్టులను బట్టి డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, డీఎంఎల్టీ, ఎంఎల్టీ, ఎంపీహెచ్ఏ(ఎఫ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.27,300.
దరఖాస్తు ఫీజు : రూ.350. ఎస్సీ, ఎస్టీలకు రూ.150, బీసీలకు రూ.250.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, సింగారం ఎక్స్-రోడ్, నారాయణపేట అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: మే 09
వెబ్సైట్ : https://narayanpet.telangana.gov.in/recruitment/
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






