Government Jobs 2023 | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1.BMRCL Recruitment | బెంగళూరు మెట్రోలో ఇంజినీర్ పోస్టులు
BMRCL Recruitment 2023 | డిప్యూటీ చీఫ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలోని బెంగళూరుకు చెందిన బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సిగ్నలింగ్, రోలింగ్ స్టాక్, టెలికమ్యునికేషన్, ట్రాక్షన్, ఈసీఎస్, డిపో మెషినరీ, ఆపరేషన్ సేఫ్టీ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 68
పోస్టులు: డిప్యూటీ చీఫ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్.
విభాగాలు: సిగ్నలింగ్, రోలింగ్ స్టాక్, టెలికమ్యునికేషన్, ట్రాక్షన్, ఈసీఎస్, డిపో మెషినరీ, ఆపరేషన్ సేఫ్టీ తదిరతాలు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 40-55 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : 1. డిప్యూటీ చీఫ్ ఇంజినీర్: నెలకు రూ.1.4 లక్షలు
2. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: నెలకు రూ.85000
3. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: నెలకు రూ.65000
4. అసిస్టెంట్ ఇంజినీర్: నెలకు రూ.50000
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో
అడ్రస్ : జనరల్ మేనేజర్ (HR), బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, III అంతస్తు, BMTC కాంప్లెక్స్, K.H. రోడ్, శాంతినగర్, బెంగళూరు 560 027.
చివరి తేది: ఏప్రిల్ 17
వెబ్సైట్: https://www.bmrc.co.in
2. CUK Recruitment 2023 | సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో 50 టీచింగ్ పోస్టులు
Central University of Karnataka | హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, సైకాలజీ, కామర్స్, సోషల్ వర్క్, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎడ్యుకేషన్, తదితర సబ్జెక్టుల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కలబురగిలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 50 ఖాళీలను భర్తీ చేయనున్నది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకాగా.. ఏప్రిల్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత రంగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్, పరిశోధన రంగంలో పని అనుభవం ఉండాలి. పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 50
పోస్టులు : 1. ప్రొఫెసర్: 18 పోస్టులు
2. అసోసియేట్ ప్రొఫెసర్: 32 పోస్టులు
సబ్జె్క్టులు: జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, సైకాలజీ, కామర్స్, సోషల్ వర్క్, ఎడ్యుకేషన్, లా తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత రంగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్, పరిశోధన రంగంలో పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.2,500 (ఎస్సీ/ ఎస్టీలకు రూ.1,000; మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు)
ఎంపిక: పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్
చివరి తేదీ: ఏప్రిల్ 17
దరఖాస్తు హార్డ్‌కాపీకి చివరి తేదీ: ఏప్రిల్ 25
వెబ్సైట్ : www.cuk.ac.in
3.IICA Recruitment 2023 | ఐఐసీఏలో సీనియర్ రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
IICA Recruitment 2023 | సీనియర్ రిసెర్చ్ అసోసియేట్ (Senior Research Associate), సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, రిసెర్చ్ అసోసియేట్ తదితర పోస్టుల భర్తీకి గురుగ్రామ్‌లోని భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్(ఐఐసీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లై చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్, సీఏ, మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్, ఈమెయిల్ ద్వారా ఉండగా.. ఏప్రిల్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 08
పోస్టులు: సీనియర్ రిసెర్చ్ అసోసియేట్, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, రిసెర్చ్ అసోసియేట్ తదితరాలు.
అర్హతలు: పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్, సీఏ, మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జీతం: నెలకు రూ.30000-రూ.75000 చెల్లిస్తారు.
ఎంపిక : రాతపరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆఫ్‌లైన్/ ఈమెయిల్ ద్వారా
ఈమెయిల్: hr@iica.in
చిరునామా: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, P-6, 7 & 8, సెక్టార్-5, IMT మనేసర్, జిల్లా. గురుగ్రామ్-122052.
చివరి తేది: ఏప్రిల్ 17
వెబ్సైట్: https://iica.nic.in/
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






