CPRI Recruitment | సీపీఆర్ఐలో 99 ఇంజినీరింగ్ పోస్టులు
CPRI Recruitment 2023 | ఇంజినీరింగ్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్, అసిస్టెంట్లు తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వం విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (Central Power Research Institute) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్(Recruitment) ద్వారా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. అప్లై చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, ఇంజినీరింగ్ డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ అర్హత సాధించి ఉండాలి. గేట్ స్కోర్, కంప్యూటర్ పరీక్ష ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 99
పోస్టులు: ఇంజినీరింగ్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్, అసిస్టెంట్లు తదితరాలు.
విభాగాలు: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ , ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, ఇంజినీరింగ్ డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ అర్హత సాధించి ఉండాలి.
నోట్ : ఇంజినీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గేట్ 2021, 2022, 2023లో అర్హత సాధించాలి.
వయస్సు : 28-35 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.25,500 నుంచి 1,42,400 వరకు
పని ప్రదేశాలు: హైదరాబాద్, భోపాల్, బెంగళూరు, గువాహటి, నాసిక్, నాగ్పూర్, నోయిడా, కోల్కతా.
ఎంపిక : గేట్ స్కోర్, కంప్యూటర్ పరీక్ష ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.1000
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 14
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: ఏప్రిల్ 23
స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్: మే 15
వెబ్సైట్ : https://cpri.res.in/career
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






