NID AP Recruitment | నిడ్ ఏపీలో 24 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
NID Andhra Pradesh Recruitment 2023 | డైరెక్ట్, డిప్యూటేషన్, షార్ట్-టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్(teaching), నాన్ టీచింగ్(Non teaching) పోస్టుల భర్తీకి గుంటూరు(Guntur)లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్(NID AP) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్ డిజైనర్, సీనియర్ డిజైనర్, ఫ్యాకల్టీ, హెడ్ లైబ్రేరియన్, సీనియర్ ఇంజినీర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ప్రకటన వచ్చిన తేదీ నుంచి 45 రోజులల్లోగా అప్లై చేసుకోవాలి. టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 24
పోస్టులు : ( ప్రిన్సిపల్ డిజైనర్, సీనియర్ డిజైనర్, ఫ్యాకల్టీ, హెడ్ లైబ్రేరియన్, సీనియర్ ఇంజినీర్ (ల్యాండ్, బిల్డింగ్ అండ్ మెయింటెనెన్స్), అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, అసోసియేట్ సీనియర్ డిజైన్ ఇన్స్ట్రక్టర్, టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, అసిస్టెంట్ ఇంజినీర్) తదితరాలు
అర్హతలు : పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆఫ్‌లైన్
దరఖాస్తు విధానం: ప్రకటన వచ్చిన తేదీ నుంచి 45 రోజులల్లోగా ఆఫ్‌లైన్ దరఖాస్తులను చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నిడ్ ఏపీ, ఏఎన్‌యూ, నాగార్జున నగర్, నంబూరు, గుంటూరు అడ్రస్‌కు పంపించాలి.
ప్రకటన వచ్చిన తేదీ : మార్చి 25
వెబ్సైట్ : https://www.nid.ac.in/careers-at-nid-ap-ad-hoc
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






