శిలల మీద పెరిగే మొక్కలను ఏమంటారు?
జనరల్ స్టడీస్
1. ఆహార పదార్థాలను నిల్వచేయడానికి ఉపయోగించే పదార్థం ఏది?
1) సోడియం కార్బోనేట్
2) లాక్టిక్ ఆమ్లం
3) ఎసిటిక్ ఆమ్లం
4) బెంజోయిక్ ఆమ్లం
2. కింది దేనిలో చర్మం శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది?
1) బొద్దింక 2) కప్ప
3) సొరచేప 4) తిమింగలం
3. క్లోరోఫిల్‌లో ఉన్న మెటాలిక్ అయాన్ ఏది?
1) మెగ్నీషియం 2) ఇనుము
3) జింకు 4) కోబాల్ట్
4. కణాల ఆత్మహత్య అని కింది వాటిలో వేటిని అంటారు?
1) లైసోజోమ్స్ 2) రైబోజోమ్స్
3) న్యూక్లియోజోమ్స్ 4) గాల్జీ బాడి
5. కుళ్లిన సేంద్రియ పదార్థం కోనిఫెరస్ అటవీ నేలలో ఉండేది?
1) A హారైజన్ 2) B హారైజన్
3) C హారైజన్ 4) O హారైజన్
6. నీటి ఉపరితలం మీద ఏర్పడిన అలలు దేనికి ఉదాహరణ?
1) తిర్యక్ అలలు 2) దీర్ఘ అలలు
3) సిర్థ అలలు 4) పురోగామి అలలు
7. టైఫాయిడ్ వల్ల శరీరంలో ఏ భాగం ప్రభావితమవుతుంది?
1) గుండె 2) గొంతు
3) పేగు 4) ఊరిపితిత్తులు
8. కింది వాటిలో వంటగదిలో బేకింగ్ పౌడర్‌గా వాడేది?
1) సోడియం బైకార్బోనేట్
2) పొటాషియం నైట్రేట్
3) సోడియం క్లోరైడ్
4) సోడియం కార్బోనేట్
9. ఓజోన్ పొర తగ్గుదలకు కారణమైన వాయువు?
1) క్లోరోఫోరో కార్బన్
2) కార్బన్ మోనాక్సైడ్
3) కార్బన్ డై ఆక్సైడ్
4) నైట్రస్ ఆక్సైడ్
10. వైమానికుడు నడిపే మొట్టమొదటి హెలికాప్టర్‌ను కనుగొన్నది?
1) ఎడిసిన్ 2) హిల్లర్
3) లారెన్స్ 4) కోర్‌ను
11. బాయిల్స్ సూత్రం వేటి మధ్య సంబంధానికి చెందింది?
1) పరిమాణం, సాంద్రత
2) పీడనం, పరిమాణం
3) పీడనం, ఉష్ణోగ్రత
4) పరిమాణం, ఉష్ణోగ్రత
12. గంధకాన్ని రబ్బర్‌తో కలిపి వేడిచేయడాన్ని ఏమంటారు?
1) గాల్వనైజేషన్ 2) సల్ఫోనేషన్
3) వల్కనైజేషన్ 4) బేసెమిరైజేషన్
13. ఎయిడ్స్‌ను ఏ సంవత్సరంలో కనుగొన్నారు?
1) 1980 2) 1981
3) 1982 4) 1983
14. పాలు దేని కొల్లాయిడ్ ద్రావణం?
1) కొవ్వులో నీరు విక్షేపణ చెందగా ఏర్పడింది
2) నీటిలో కొవ్వు విక్షేపణ చెందడం వల్ల ఏర్పడింది
3) కొవ్వులో మాంసకృత్తులు విక్షేపణ చెందగా ఏర్పడింది
4) మాంసకృత్తుల్లో కొవ్వు విక్షేపణ చెందగా ఏర్పడింది
15. ఆడియో టేపులు దేనితో పూతపూసి ఉంటాయి?
1) అల్యూమినియం ఆక్సైడ్
2) సిల్వర్ అయోడైడ్
3) ఫెర్రిక్ ఆక్సైడ్
4) పొటాషియం నైట్రేట్
16. కింది వాటిని జతపరచండి.
ఎ. అనిమోమీటర్ 1. అధిక ఉష్ణోగ్రత
బి. టాకోమీటర్ 2. యంత్ర సామర్థ్యం
సి. పైరోమీటర్ 3. భ్రమణ వేగం
డి. డైనమోమీటర్ 4. ద్రవ వేగం
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
17. మనం జీవించడానికి దోహదపడే ఆక్సిజన్ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడుతుంది. ఇది దేని నుంచి వస్తుంది?
1) కార్బన్ డై ఆక్సైడ్
2) భూమి నుంచి గ్రహించిన కార్బోనేట్
3) ఖనిజ కారకాల ఆక్సైడ్స్
4) నీరు
18. సముద్ర మట్టానికి పైన ఉన్న ఎత్తును కొలిచే సాధనం?
1) హిస్సోమీటర్ 2) లాక్టోమీటర్
3) హైగ్రోమీటర్ 4) హైడ్రోమీటర్
19. శిలల మీద పెరిగే మొక్కలను ఏమంటారు?
1) లితోఫైట్స్ 2) ఎరిమోఫైట్స్
3) చారోఫైట్స్ 4) ఆక్సిలోఫైట్స్
20. హైడ్రోజన్ బాంబులో ఉండే సూత్రం?
1) అణు సంలీనం 2) అణు విచ్ఛిత్తి
3) పై రెండూ 4) ఏదీ కాదు
21. నీటి లోపలి ధ్వని తరంగాలను కొలిచే సాధనం?
1) హైడ్రోఫోన్ 2) జైరోస్కోప్
3) ఎపిటియోస్కోప్ 4) ఫొటోమీటర్
22. కింది వాటిలో మిశ్రమ గ్రంథి ఏది?
1) పీయూష గ్రంథి 2) అడ్రినల్ గ్రంథి
3) పాంక్రియాస్ 4) ఓవరీ
23. కంటిలో ఏ కణాలు రంగుల వ్యత్యాసాన్ని గుర్తించగలవు?
1) రాడ్స్ 2) కోన్స్
3) కార్నియా 4) పైవేవీ కాదు
24. శిశువు లింగ నిర్ధారణ ఎప్పుడు తెలుసుకోవచ్చు?
1) స్పెర్మ్ ప్రవేశ సమయం
2) ఓవమ్ ఫలదీకరణ సమయం
3) గర్భధారణ జరిగిన ఆరు నుంచి ఏడు వారాల సమయం
4) మూడో నెల గర్భధారణ సమయం
25. మనిషి కిడ్నీలో ఏర్పడే రాళ్లలో అధికంగా ఉండేది?
1) కాల్షియం ఆక్సలేట్
2) సోడియం ఎసిటేట్
3) మెగ్నీషియం సల్ఫేట్
4) కాల్షియం
26. మానవ శరీరంలోని ఏ అంగంలో లింఫోసైట్ కణాలు ఏర్పడుతాయి?
1) కాలేయం 2) పొడవైన ఎముక
3) క్లోమం 4) ప్లీహం
27. శిలలు, ఖనిజాల్లో ఎక్కువ భాగం ఉండే మూలకం?
1) ఇనుము 2) కార్బన్
3) సిలికాన్ 4) సోడియం
28. విద్యుత్ ఫ్యూజ్ తీగలో వాడే పదార్థంలో ఉండవలసిన గుణం?
1) అధిక నిరోధకత
2) అల్ప నిరోధకత
3) అల్ప ద్రవీభవన స్థానం
4) అధిక ద్రవీభవన స్థానం
29. దగ్గరి వస్తువులను చూడలేకపోవడాన్ని వేటి ద్వారా సరిచేయవచ్చు?
1) పుటాకార కటకం ద్వారా
2) కుంభాకార కటకం ద్వారా
3) పుటాకార-కుంభాకార కటకం ద్వారా
4) కుంభాకార- పుటాకార కటకం ద్వారా
30. లేజర్ ఆధార శాస్త్రీయ సూత్రాలను మొదట వెల్లడించింది?
1) ఛార్లెస్ డార్విన్
2) ఛార్లెస్ టావెన్స్
3) ఛార్లెస్ బాబేజి
4) క్రిష్టియన్ హైజిన్స్
31. డాప్లర్ ఎఫెక్ట్‌కు దేనితో సంబంధం?
1) ధ్వని 2) కాంతి
3) అయస్కాంత శక్తి
4) ఎలక్ట్రో మేగ్నటిక్ ఇండక్షన్
32. ఆవర్తన పట్టిక స్థాపకుడైన డి.ఐ మెండలీఫ్ ఏ దేశానికి చెందినవారు?
1) రష్యన్ రసాయన శాస్త్రవేత్త
2) బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త
3) అమెరికన్ జీవశాస్త్రవేత్త
4) జర్మన్ పర్యావరణ శాస్త్రవేత్త
33. మానవ శరీరంలోని ఏ భాగానికి క్షయ వ్యాధి హాని కలిగిస్తుంది?
1) ఊపిరితిత్తులు 2) మూత్రపిండాలు
3) కళ్లు 4) చెవులు
34. పొట్టలోని లోపలి భాగాన్ని పరీక్షించడానికి డాక్టర్లు ఎండోస్కోప్ వాడతారు. అది ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది?
1) కాంతి పరివర్తన
2) కాంతి విస్తరణ
3) కాంతి వక్రీభవనం
4) పూర్తిగా అంతర్గత కాంతి పరివర్తన
35. క్రోనో మీటర్‌ను కనుగొన్నది ఎవరు?
1) జాన్ హరిసన్ 2) ఫాకాల్డ్
3) మాలెట్ 4) పాల్సన్
36. వెల్లుల్లి మొక్క శాస్త్రీయ నామం?
1) గీటిస్ వినిఫెరా 2) ఏలియం సటైవం
3) సిట్రస్ లైమస్
4) బ్రాసికా ఒలరేసియా
37. మొదటి యాంత్రిక కంప్యూటర్ను 1642లో తయారు చేసింది?
1) పాస్కల్ 2) ఛార్లెస్ బాబేజి
3) హవార్డ్ అకీస్ 4) జె.పి. ఎసెర్ట్
38. అరటి పండు ఏ విటమిన్‌కు చక్కటి వనరు?
1) విటమిన్-ఎ 2) విటమిన్-బి
3) విటమిన్-సి 4) విటమిన్-డి
39. పుట్టగొడుగు కింద పేర్కొన్న ఏ జీవరాశికి చెందినది?
1) ఆల్గే 2) ఫెరెన్స్
3) ఫంగి 4) లీచెన్స్
40. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ను కనిపెట్టిన వ్యక్తి?
1) కెప్లర్ 2) గెలీలియో
3) న్యూటన్ 4) కోపర్నికస్
41. క్షార భూమి మీద పెరిగే చెట్లను ఏమంటారు?
1) హాలోఫైట్స్ 2) హైడ్రోఫైట్స్
3) మీసోఫైట్స్ 4) థాలోఫైట్స్
42. విమానం సూర్సోనిక్ వేగాన్ని దేని ద్వారా ప్రకటిస్తారు?
1) మాచ్ నంబర్ 2) డెసిబుల్
3) హర్జజ్ 4) పైవేవీ కాదు

పరికరాలు- ఉపయోగాలు
- అల్టీమీటర్ – విమానాలు వెళ్లే ఎత్తును కొలిచే సాధనం
- అమ్మీటర్ – విద్యుత్ ప్రవాహ బలాన్ని కొలిచే పరికరం
- ఆటోమీటర్- నీటి ఆవిరి రేటు తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం
- ఆడియోమీటర్- శబ్ద తీవ్రతను కొలవడానికి వినియోగిస్తారు
- ఎనిమోమీటర్- గాలి వీచే దిక్కును, వేగాన్ని కొలిచే పరికరం
- ఓడో మీటర్- మోటారు వాహనాల వేగాన్ని కొలిచే సాధనం
- సముద్రంలో నౌక ఏ రేఖాంశం మీద ఉన్నదో కనుగొనేందుకు వాడే పరికరం
- క్రెస్కోగ్రాఫ్- మొక్కల పెరుగుదలను కొలిచే పరికరం
- గైరోస్కోప్- విశ్వాంతరాల్లో దిశను తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం
- టైడ్‌గేజ్- సముద్ర మట్టాన్ని కొలిచే సాధనం
- నెఫోస్కోప్- మేఘాలు, ఇతర ఖగోళ వస్తువుల దూరాన్ని కొలిచే పరికరం
- పాథోమీటర్- సముద్రాల లోతులను కొలిచే సాధనం
- ప్లానీ మీటర్- చదునుగా ఉండే ప్రదేశాల ఉపరితల వైశాల్యాన్ని కొలిచే సాధనం
- పెరిస్కోప్- జలాంతర్గామిలో ఉన్న నావికులు సముద్ర ఉపరితలం పైనున్న వస్తువులను చూడటానికి ఉపయోగించే పరికరం
పైరోమీటర్- అత్యుష్ణోగ్రతలను కొలిచే పరికరం
- బారోమీటర్- వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం
- మాగ్నటోమీటర్- అయస్కాంత క్షేత్రాలను, భ్రమకాలను పోల్చే పరికరం
- మానోమీటర్- వాయువుల పీడనాన్ని కొలిచే సాధనం
- హైగ్రోమీటర్- వాతావరణంలో నీటి ఆవిరి (ఆర్ధ్రత)ని కొలిచే సాధనం
- రెయిన్ గేజ్- ఒక ప్రదేశంలోని వర్షపాతాన్ని కొలిచే సాధనం
- రాడార్- విమానాల రాకపోకలను పసిగట్టే సాధనం (వాతావరణ విశ్లేషణం)
- రేడియోమీటర్- అణు ధార్మికతను కొలిచే పరికరం
- రిఫ్రాక్టో మీటర్- ఒక పదార్థం వక్రీభవన గుణకాన్ని కనుగొనడానికి వాడే సాధనం
- రిక్టర్ స్కేలు- భూకంప తీవ్రత కొలవడానికి ఉపయోగించే పరికరం
- లాక్టోమీటర్- పాల సాంద్రతను కొలిచే పరికరం
- విస్కా మీటర్- ద్రవాల చిక్కదనం కొలవడానికి ఉపయోగిస్తారు
- స్పిగ్మోమానో మీటర్- రక్తపీడనాన్ని కొలిచే సాధనం
- సెక్సంట్- సూర్యుడు, తదితర సుదూర ఖగోళ పదార్థాల ఎత్తును కొలిచే పరికరం
- స్పీడోమీటర్- విమానాల సరాసరి వేగాన్ని కొలిచే పరికరం
- స్రోబోస్కోప్- వేగంగా చలించే వస్తువులు ఆగి ఉన్నట్లు చూడటానికి వాడే పరికరం
- సిస్మోగ్రాఫ్- భూకంప తీవ్రతను కొలిచే సాధనం
- స్పెక్ట్రో- మెదడులోని తరంగాలను రికార్డు చేసే ఎన్‌సెఫలోగ్రాఫ్ పరికరం
- శాకరి మీటర్- ఒక ద్రావణంలో చక్కెర అనుపాతాన్ని కనుగొనడానికి వాడతారు
- శాలినో మీటర్- ఉప్పు ద్రావణాల సాంద్రతను కనుగొనే పరికరం
- హైడ్రోమీటర్- ద్రవాల విశిష్ట సాంద్రతను కొలిచే సాధనం
- హైడ్రోఫోన్- జల ఉపరితలం కింద శబ్ద వేగాన్ని కొలవడానికి వాడే పరికరం
- హైడ్రోస్కోప్- నీటి అడుగున ఉండే వస్తువులను స్పష్టంగా చూడటానికి ఉపయోగించే పరికరం
జీబీకే పబ్లికేషన్స్హైదరాబాద్, 8187826293
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






