శరీర పనితీరుకు ఆటంకం.. విధులకు తాత్కాలిక విరామంవ్యాధులు
- వ్యాధికారకాలు-లక్షణాలు
వర్షాకాలం, చలికాలంలో వివిధ రకాల వ్యాధులు మానవులకు సోకి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటాయి. కొన్ని రకాల వ్యాధులు వివిధ రకాల సూక్ష్మజీవుల వల్ల సోకుతుంటాయి. వివిధ రకాల కీటకాలు వాహకాలుగా పనిచేస్తాయి. అపరిశుభ్ర వాతావరణ పరిస్థితులు వ్యాధులకు నెలవుగా ఉంటాయి. వ్యాధుల పట్ల సరైన అవగాహన కలిగి ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
వ్యాధి అంటే ఏమిటి?: సక్రమంగా పనిచేసే శరీర విధులను తాత్కాలికంగా గాని, శాశ్వతంగా గాని కల్లోలపరిచే పరిస్థితిని వ్యాధి అంటారు. వ్యాధులు రెండు రకాలు అవి. సంక్రమణ వ్యాధులు, అసంక్రమణ వ్యాధులు.
సంక్రమణ వ్యాధులు: ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించే వ్యాధులను సంక్రమణ వ్యాధులు అంటారు.
ఉదా: డెంగీ, మలేరియా మొదలైనవి
అసంక్రమణ వ్యాధులు: ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించని వ్యాధులను అసంక్రమణ వ్యాధులు అంటారు.
ఉదా: జన్యు రుగ్మతలు, మూత్రపిండ వ్యాధులు మొదలైనవి
అంటు వ్యాధులు: వ్యాధి జనక జీవులు ఒక వ్యక్తి నుంచి ఇతర వ్యక్తులకు పలు మార్గాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఇటువంటి వ్యాధులను అంటు వ్యాధులు అంటారు.
ఉదా: కొవిడ్, జలుబు, కండ్ల కలక మొదలైనవి
వాహకాలు అంటే ఏమిటి?: అస్వస్థతకు గురైన వ్యక్తి నుంచి సూక్ష్మజీవులను అతిథేయిలోకి ప్రవేశింపజేసే జీవులను ‘వాహకాలు’ అంటారు.
ఉదా: దోమలు మలేరియాకు, ఈగలు టైఫాయిడ్‌కు వాహకాలుగా పనిచేస్తాయి
పరాన్నజీవనం: వేర్వేరు జాతులకు చెందిన రెండు జీవుల మధ్య సహవాసం ఏర్పడినప్పుడు అందులో ఒకజీవి రెండో జీవికి నష్టం కలిగిస్తూ తాను లాభం పొందుతూ జీవిస్తుంది. ఇటువంటి పోషణను పరాన్నజీవనం అంటారు.
పరాన్నజీవికి ఆహారం, ఆశ్రయం కల్పించే జీవిని అతిథేయి అంటారు.
పొదిగే కాలం: వ్యాధికారక జీవులు శరీరంలో ప్రవేశించినది మొదలు వ్యాధి లక్షణాలు కనిపించేంత వరకు ఉండే కాలాన్ని పొదిగే కాలం (Incubation Period) అంటారు.
మానవుడికి వివిధ రకాల సూక్ష్మజీవుల వల్ల అనేక వ్యాధులు ముఖ్యంగా బ్యాక్టీరియాలు, వైరస్లు, వివిధ రకాల పరాన్నజీవులు అనేక వ్యాధులు కలిగిస్తాయి.
బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులు
కలరా: ఇది ‘విబ్రియో కలరా’ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. ఈగలు, దోమలు వాహకాలుగా పనిచేస్తాయి. ఇవి ఆహారాన్ని, నీటిని కలుషితం చేయడం ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది. వాంతులు, నీళ్ల విరేచనాలు, కండరాల నొప్పులు వ్యాధి లక్షణాలు.
కుష్ఠు: ఇది ‘మైకో బ్యాక్టీరియం లెప్రె’ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. ఈ వ్యాధిని ‘హన్సన్ వ్యాధి’ అని కూడా అంటారు. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అంటువ్యాధి. ప్రారంభ దశలో అలసట, తలనొప్పి, ఆకలి తగ్గడం వంటి లక్షణాలతో మొదలై క్రమంగా చర్మంపై పుండ్లు రావడం స్పర్శ లేకపోవడం ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధిని ‘ఫ్లోరోసెంట్ లెప్రసీ యాంటీబాడీ ఎబ్ జాస్టన్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. ఏటా జనవరి 30న అంతర్జాతీయ కుష్ఠు నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తారు.
క్షయ: ఇది మైకో బ్యాక్టీరియం ట్యుబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. గాలి, ఈగలు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి. సాయంత్రం వేళల్లో జ్వరం, శ్లేష్మంతో కూడిన దగ్గు, అలసట, బరువు తగ్గడం, తెమడ రావడం ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి నిర్ధారణకు ‘మాంటెక్స్ పరీక్ష’ నిర్వహిస్తారు. BCG (Bacille Calmatte-Guerin) వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. ఏటా మార్చి 24న ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవంగా నిర్వహిస్తారు.
డిప్తీరియా: ఇది కార్నీ బ్యాక్టీరియం డిప్తీరియే అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. ఈ వ్యాధిని వంగుడు వ్యాధి అనే మరొక పేరుతో పిలుస్తారు. ప్రత్యక్ష స్పర్శ, కలుషిత ఆహారం, బ్యాక్టీరియా సోకిన శ్వాసనాళం నుంచి వచ్చే తుంపరలు ఈ వ్యాధి వాహకాలు. జ్వరం, వాంతులు, గొంతులో గాయం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఈ వ్యాధి లక్షణాలు. దీన్ని షీక్ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తారు. DPT (Diphtheria Pertussis Tetanus) వ్యాక్సిన్‌ను తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.
కోరింత దగ్గు: ఇది ‘బొర్డిటెల్లా పెర్టుసిస్’ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్టీరియా గాలిలోకి వ్యాపిస్తుంది. దగ్గినప్పుడు చివర్లో ఉఫ్ అనే శబ్దం రావడం వల్ల దీన్ని Whooping Cough అంటారు. చలి, పొడిదగ్గు, తీవ్రమైన దగ్గు, ఎగశ్వాస ఈ వ్యాధి లక్షణాలు.
టెటానస్: ఈ వ్యాధి ‘క్లాస్ట్రీడియం టెటానై’అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. దవడలోని కండరాల నొప్పులు, మెడ కండరాల నొప్పులు, మింగడం కష్టం అవుతుంది. DPT టీకాను తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు.
టైఫాయిడ్: ఈ వ్యాధి ‘సాల్మోనెల్లా టైఫీ’ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. దీన్నే ‘ఎంటరిక్ జ్వరం’ అంటారు. ఈగలు, కలుషిత ఆహారం, కలుషిత నీరు వ్యాధి వాహకాలుగా పనిచేస్తాయి. విడువని జ్వరంతో ఈ వ్యాధి ప్రభావితమవుతుంది. వైడల్ టెస్ట్ ద్వారా టైఫాయిడ్‌ను నిర్ధారిస్తారు.
న్యుమోనియా: ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో మరణానికి అత్యంత సాధారణ కారకం న్యుమోనియా. ఇది ఊపిరితిత్తులకు సోకే ఇన్ఫెక్షన్. వాయునాళ గోణులు చీముతో నిండి ఉంటాయి. ‘స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే’ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. ఏటా నవంబర్ 12న అంతర్జాతీయ న్యుమోనియా దినోత్సవం జరుపుతారు.
వైరస్ల వల్ల కలిగే వ్యాధులు
తట్టు: ఇది పారామిక్సో వైరస్ వల్ల సంక్రమిస్తుంది. ఈవ్యాధికి మరొక పేరు ‘రుబియోల’. దగ్గు, జ్వరం, జలుబు, కళ్లు ఎరుపెక్కి నీరు కారడం ఈ వ్యాధి లక్షణాలు.
ఆటలమ్మ: ఇది ‘వెర్టిసెల్లా జోస్టర్’ అనే వైరస్ వల్ల సంక్రమిస్తుంది. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన రెండు, మూడు రోజుల్లో శరీరంపై ఎర్రటి పొక్కులు ఏర్పడతాయి. ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా శరీరంపై ఉన్న నీటి పొక్కుల ద్వారా ఈ వ్యాధి పక్కవారికి వ్యాపిస్తుంది.
గవద బిళ్లలు: ఇది ‘మిక్సో వైరస్ పెరోటైడిస్’ అనే వైరస్ వల్ల సంక్రమిస్తుంది. చెవికి ముందు ఉండే లాలాజల గ్రంథి అయిన ‘పెరోటిడ్ గ్రంథి’ వాపునకు గురై నొప్పిగా ఉంటుంది. ఇది అంటువ్యాధి. వైరస్లు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి.
ప్రొటోజోవన్ వ్యాధులు
అమీబియాసిస్: ఇది ఎంటామీబా హిస్టోలిటికా అనే ప్రొటోజోవన్ పరాన్నజీవి వల్ల సంక్రమిస్తుంది. ఈగలు, బొద్దింకలు యాంత్రిక వాహకాలుగా పనిచేస్తాయి. కలుషిత ఆహారం, నీటి వల్ల సంక్రమిస్తుంది. అమీబిక్ విరేచనాలు కలుగుతాయి.
- ప్రొటోజోవా, హెల్మింథిస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు మొదలైన వివిధ జీవులు మానవుడికి వ్యాధులను కలిగిస్తాయి. వీటిని వ్యాధి జనకాలు అంటారు.
- ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రొటోజోవా పరాన్నజీవి వల్ల మలేరియా వ్యాధి కలుగుతుంది. దీనికి వాహకంగా ఆడ అనాఫిలిస్ దోమ ఉంటుంది.


మాదిరి ప్రశ్నలు
1. కింది వాటిని జతపరచండి.
1. ఆస్కారిస్ ఎ. ఢిల్లీ బోయిన్స్
లుంబ్రికాయిడిస్
2. ట్రిపనోసోమా బి. బోదకాలు
గాంబియెన్సీ
3. ఉకరేరియా సి. ఆఫ్రికన్
బాంక్రాప్టి అతినిద్రవ్యాధి
4. లీష్మానియా డి. ఆస్కారియాసిస్
ట్రాఫికా
1) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2. కింది వాటిలో సరైన జతను గుర్తించండి.
1) కలరా- వైరస్
2) మలేరియా- బ్యాక్టీరియా
3) డిప్తీరియా- శిలీంధ్రం
4) తట్టు- వైరస్
3. కింది వాటిని జతపరచండి.
1. కుష్ఠు వ్యాధి ఎ. జనవరి 30
నివారణ దినోత్సవం
2. న్యుమోనియా బి. నవంబర్ 12
దినోత్సవం
3. క్షయ నివారణ సి. మార్చి 24
దినోత్సవం
4. జాతీయ టీకా డి. మార్చి 16
దినోత్సవం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4. సూక్ష్మజీవుల ద్వారా వ్యాపించే వ్యాధులను ఏమంటారు?
1) అంటు వ్యాధులు
2) సాంక్రమిక వ్యాధులు
3) సంక్రమణ వ్యాధులు
4) అసంక్రమణ వ్యాధులు
5. షీక్ టెస్ట్ ద్వారా ఏ వ్యాధిని నిర్ధారిస్తారు?
1) క్షయ 2) కుష్ఠు
3) డిప్తీరియా 4) కోరింత దగ్గు


Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






