అట్లీ ‘క్యాబినెట్ మిషన్ ప్రణాళికను’ఎప్పుడు ప్రకటించాడు?
- భారత రాజ్యాంగం-చారిత్రక నేపథ్యం
1. కింది స్టేట్మెంట్లను పరిశీలించండి?
ఎ. బ్రిటన్ తరహాలో భారత్‌లో రెగ్యులర్ పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్
బి. రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు
సి. భారతీయ శిక్షాస్మృతి 1860లో అమల్లోకి వచ్చింది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
2. రెగ్యులేటింగ్ చట్టం-1773కి సంబంధించి కింది వాటిలో సరైనది?
ఎ. భారత్‌కు సంబంధించిన తొలి లిఖిత చట్టం
బి. ఈ చట్టాన్ని 1773 మే 18న నాటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ వార్త్ బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టాడు
సి. బెంగాల్ గవర్నర్ హోదాను గవర్నర్
జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్చారు
డి. ఈ చట్టం ప్రకారం మొదటి గవర్నర్
జనరల్ వారెన్ హేస్టింగ్స్
1) ఎ, బి 2) బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఏదీకాదు
3. ఏ ప్రణాళిక ఆధారంగా ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ 1947ను బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించింది?
1) ఇండియన్ కాంగ్రెస్ ప్రణాళిక
2) సప్రూ ప్రణాళిక
3) వేవెల్ ప్రణాళిక
4) మౌంట్‌బాటన్ ప్రణాళిక
4. చార్టర్ చట్టం 1813కి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) భారతీయ విద్యాభివృద్ధికి రూ.లక్షతో నిధిని ఏర్పాటు చేశారు
2) సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు
3) ఈ చట్టం ద్వారా మత మార్పిడులకు అవకాశం ఏర్పడింది
4) మత నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు
5. కింది స్టేట్మెంట్లను పరిశీలించండి?
ఎ. 1853 చార్టర్ చట్టం, భారతీయ వర్తకంలో ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది
బి. భారత ప్రభుత్వ చట్టం 1858 ప్రకారం బ్రిటిష్ పార్లమెంటు ఈస్టిండియా కంపెనీని పూర్తిగా రద్దుచేసి, భారత్‌ను నేరుగా పాలించే బాధ్యతను చేపట్టింది.
పై స్టేట్మెంట్లలో సరైనది?
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
6. కింది వాటిని సంవత్సరాల ఆధారంగా సరైన వరుస క్రమంలో అమర్చండి?
ఎ. సైమన్ కమిషన్
బి. రాష్ర్టాలకు స్వయంప్రతిపత్తి
సి. ఫెడరల్ కోర్టు ఏర్పాటు
డి. మూడో రౌండ్ టేబుల్ సమావేశం
1) ఎ, బి, సి, డి 2) బి, ఎ, డి, సి
3) ఎ, సి, డి, బి 4) బి, ఎ, సి, డి
7. భారత రాజ్యాంగంపై ఎక్కువ ప్రభావాన్ని చూపింది ఏది?
1) 1935 భారత ప్రభుత్వ చట్టం
2) అమెరికా రాజ్యాంగం
3) బ్రిటిష్ రాజ్యాంగం
4) ఐక్యరాజ్యసమితి చార్టర్
8. భారత కౌన్సిళ్ల చట్టం-1909కి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ. ఈ చట్టాన్ని మింటో-మార్లే సంస్కరణలు అని పేర్కొంటారు
బి. అప్పటి గవర్నర్/వైశ్రాయ్ లార్డ్ మింటో భారత వ్యవహారాల కార్యదర్శి- మార్లే
సి. గవర్నర్ కార్యనిర్వాహక మండలిలో తొలిసారి భారతీయులకు సభ్యత్వాన్ని కల్పించారు
డి. సభ్యత్వం పొందిన తొలి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, బి, సి, డి
9. భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం ప్రాంతీయ కార్యనిర్వహణకు సంబంధించిన అంశాలు ఏవి?
ఎ. సంస్థానాల కార్యనిర్వహణ అధికారాలను గవర్నర్‌కు ఇవ్వడం
బి. మంత్రి మండలి గవర్నర్‌కు సలహాలు ఇవ్వడం
సి. ప్రాంతీయ శాసన సభ్యుల ఓటింగ్ ద్వారా గవర్నర్ తొలగిస్తారు
పై వాటిలో సరైనవి
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) బి
10. కింది వాటిలో జరిగిన సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో సరైనదాన్ని గుర్తించండి?
1) ఆగస్టు ప్రతిపాదనలు, సిమ్లా సమావేశం, సీఆర్ ఫార్ములా, క్యాబినెట్ మిషన్
2) క్రిప్స్ ప్రతిపాదనలు, ఆగస్టు ప్రతిపాదనలు, వేవెల్ ప్రణాళిక, క్యాబినెట్ మిషన్
3) ఆగస్టు ప్రతిపాదనలు, క్రిప్స్ ప్రతిపాదనలు, సీఆర్ ఫార్ములా, సిమ్లా సమావేశం, క్యాబినెట్ మిషన్
4) క్రిప్స్ ప్రతిపాదనలు, ఆగస్టు ప్రతిపాదనలు, వేవెల్ ప్రణాళిక, సీఆర్ ఫార్ములా, క్యాబినెట్ మిషన్
11. కింది వాటిలో 1919 భారత చట్టంలోని ప్రధాన లక్షణాలు?
ఎ. రాష్ర్టాల కార్యనిర్వహణ ప్రభుత్వంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడం
బి. ముస్లింలకు విడిగా మతపరమైన నియోజక గణాలను ప్రవేశపెట్టడం
సి. కేంద్ర, రాష్ర్టాలకు శాసనపరమైన అధికారాన్ని దత్తం చేయడం
డి. కేంద్ర, రాష్ట్ర శాసన వ్యవస్థల విస్తరణ, పునర్వ్యవస్థీకరణ
సరైనది గుర్తించండి?
1) ఎ, బి, సి 2) సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
12. ప్రస్తుత భారత రాజ్యాంగం కేంద్ర రాష్ర్టాలకు మధ్య శాసన నిర్మాణధికారాల విభజన, కొన్ని విషయాల్లో 1935 భారత ప్రభుత్వ చట్టం కింద కేంద్రానికి రాష్ర్టాలకు (ప్రావిన్స్‌లకు) మధ్యగల అధికారాలను పోలి ఉన్నాయి.ఆ విషయాలు ఏవి?
ఎ. మూడు జాబితాల విషయాల మధ్య ఏదయినా ఒక విషయం అతి వ్యాపనం చెంది నట్లయితే, రెండింటిలోనూ కేంద్రశాసన వ్యవస్థకే ప్రాధాన్యం ఉంటుంది
బి. ఉమ్మడి జాబితా ప్రతికూలత ఉన్న సందర్భంలో రెండింటిలోనూ రాష్ట్ర శాసనం మీద కేంద్ర శాసనానికే చెల్లుబాటు ఉంటుంది
సి. రెండింటిలోనూ అవశిష్టాధికారాలను కేంద్ర శాసన వ్యవస్థకు అప్పగించారు
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) ఎ, సి 4) బి, సి
13. రెగ్యులేటింగ్ చట్టం 1773కి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
1) ఈ చట్టం ఆధారంగా 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు
2) ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులు ఉన్నారు
3) మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే
4) పైవన్నీ సరైనవే
14. మతప్రాదిపదికన తొలిసారి నియోజకవర్గ గణాల ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం?
1) భారత కౌన్సిళ్ల చట్టం- 1919
2) భారత కౌన్సిళ్ల చట్టం- 1935
3) భారత కౌన్సిళ్ల చట్టం- 1909
4) భారత కౌన్సిళ్ల చట్టం- 1947
15. భారత ప్రభుత్వ చట్టం-1935లోని ముఖ్యాంశాలు ఏవి?
ఎ. ప్రావిన్స్‌ల స్వతంత్రత
బి. కేంద్రంలో ద్విసభా విధానం
సి. రాష్ర్టాల్లో ద్వంద్వ సభ రద్దు
1) బి, సి 2) ఎ, బి
3) ఎ, సి 4) ఎ, బి, సి
16. ఇంగ్లండ్ ప్రధాని అట్లీ ‘క్యాబినెట్ మిషన్ ప్రణాళికను’ ఎప్పుడు ప్రకటించాడు?
1) 1942 2) 1946
3) 1943 4) 1944
17. భారత రాజ్యాంగ చరిత్ర క్రమంలోని కింది వాటిని వరుస క్రమంలో అమర్చండి?
ఎ. క్యాబినెట్ మిషన్ ప్లాన్
బి. మింటో-మార్లే నివేదిక
సి. మాంటెగ్-ఛేమ్స్ఫోర్డ్ నివేదిక
డి. సైమన్ కమిషన్ నివేదిక
1) బి, సి, డి,ఎ 2) సి, బి, ఎ, డి
3) ఎ, డి, బి, సి 4) సి, డి, ఎ, బి
18. భారత కౌన్సిళ్ల చట్టం- 1909ని ఉద్దేశించి హిందువులకు, ముస్లింలకు మధ్య వేర్పాటు బీజాలు వేసి, వారి మధ్య విభేదాలు సృష్టించందని, భారత విభజనకు నాంది పలికిందని వ్యాఖ్యానించింది ఎవరు?
1) డా.బీఆర్ అంబేద్కర్
2) గాంధీజీ
3) జవహర్లాల్ నెహ్రూ
4) ఎవరూకాదు
19. కింది స్టేట్మెంట్లు పరిశీలించండి- భారత ప్రభుత్వ చట్టం 1935 ?
ఎ. రాష్ట్రీయ స్వయం ప్రతిపత్తిని సమకూర్చింది
బి. ఫెడరల్ కోర్టు ఏర్పాటుకు వీలు కల్పించింది
సి. కేంద్రంలో అఖిల భారత సమాఖ్యకు వీలు కల్పించింది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
20. 1919 చట్టానికి సంబంధించి కింది వాటిలో సరైనవి?
ఎ. 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని మాంటేగ్-ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలుగా పేర్కొంటారు
బి. నాటి భారత కార్యదర్శి మాంటేగ్
సి. నాటి భారత వైశ్రామ్ ఛేమ్స్‌ఫర్డ్
డి. ఈ చట్టాన్ని 1919లో రూపొందించినప్పటికీ 1921 నుంచి అమల్లోకి వచ్చింది
1) ఎ, బి, సి, డి 2) ఎ, డి
3) ఎ, బి, సి 4) ఏదీకాదు
21. 16 మే 1946లో వచ్చిన క్యాబినెట్ మిషన్ ప్రణాళికకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ. బ్రిటిష్ ఇండియా చేత రాష్ర్టాలకు కార్య
నిర్వహణ, శాసనపర అధికారాలు కేంద్రం నుంచి బదిలీ అయ్యాయి
బి. సంస్థానాల కార్యనిర్వహణ, శాసన
పర అధికారాల నుంచి విముక్తి పొందాయి
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
22. మాంటెగ్-ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు -1919కి సంబంధించి కింది వాటిలో సరైంది?
1) రాష్ట్రస్థాయిలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు
2) దేశంలో మొదటిసారిగా ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు
3) భారత హైకమిషనర్ అనే పదవిని సృష్టించారు
4) పైవన్నీ సరైనవే
23. ఏ కమిటీ సూచన మేరకు భారత్‌కు విడిగా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు?
1) లీ కమిషన్ 2) సైమన్ కమిషన్
3) క్రిప్స్ కమిషన్ 4) ఏదీకాదు
24. సమాఖ్య అనే పదాన్ని తొలిసారి సూచించింది?
1) సైమన్ కమిషన్
2) మకల్ కమిషన్
3) మౌంట్ బాటన్ కమిషన్
4) ఏదీకాదు
25. మత ప్రాతినిధ్యం ప్రకారం సిక్కులు, క్రిస్టియన్లు, ఆంగ్లోఇండియన్స్, ఐరోపా వారికి ప్రత్యేక నియోజకవర్గాలను ఏ చట్టం ప్రకారం ప్రకటించారు?
1) భారత కౌన్సిళ్ల చట్టం- 1909
2) భారత కౌన్సిళ్ల చట్టం- 1919
3) భారత కౌన్సిళ్ల చట్టం- 1935
4) భారత కౌన్సిళ్ల చట్టం- 1947
26. కింది వాటిలో ఆలిండియా స్టేట్ పీపుల్స్కాన్ఫరెన్స్ లక్ష్యం?
1) సంస్థానాల్లో బాధ్యాతాయుత ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం
2) సంస్థానాల్లో కాంగ్రెస్ పలుకుబడిని వ్యతిరేకించడం
3) సంస్థానాల్లో ప్రజామండళ్లను అణచివేయడం
4) సంస్థానాల సమావేశం ఏర్పాటు చేయడం
27. భారత రాజ్యాంగానికి ప్రధాన ఆధారం?
1) అమెరికా రాజ్యాంగం
2) ఫ్రెంచ్ రాజ్యాంగం
3) బ్రిటిష్ రాజ్యాంగం
4) భారత ప్రభుత్వ చట్టం 1935
28. ‘1919 సంస్కరణలు అసంతృప్తి, నిరాశతోపాటు సూర్యుడు లేని ఉదయంగా’ ఉందని అభిప్రాయం వ్యక్తం చేసినది ఎవరు?
1) బాలగంగాధర్ తిలక్
2) బిపిన్ చంద్రపాల్
3) లాలా లజపతిరాయ్
4) అరవింద్ ఘోష్
29. 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని దేనికి ప్రథమ చర్యగా పేర్కొంటారు?
1) భారత్ కోసం శాసనం చేసే బ్రిటిష్ పార్లమెంట్ హక్కును నొక్కి చెప్పడం
2) కార్యనిర్వాహక వర్గం నుంచి శాసన వ్యవస్థను వేరు చేయడం
3) కార్యనిర్వాహక వర్గం నుంచి న్యాయ వ్యవస్థను వేరుచేయడం
4) శాసన నిర్మాణాన్ని కేంద్రీకరించడం
30. ఏ సంస్కరణలను బ్రిటిషర్లు ప్రకటించి ఉండాల్సింది కాదని, ఏ చట్టాన్ని భారతీయులు స్వీకరించడం తగదని అనీబిసెంట్ ఏ చట్టాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు?
1) భారత కౌన్సిళ్ల చట్టం- 1909
2) భారత కౌన్సిళ్ల చట్టం- 1919
3) భారత కౌన్సిళ్ల చట్టం- 1935
4) భారత కౌన్సిళ్ల చట్టం- 1947
31. సైమన్ కమిషన్‌ను బ్రిటన్ ప్రధాని ఎప్పుడు ప్రకటించాడు?
1) 1927 జనవరి 2) 1927 ఆగస్టు
3) 1927 నవంబర్ 4) 1927 డిసెంబర్
32. కింది పత్రాల్లో ‘మానవులను సమానంగా సృష్టించడమైంది’ అని మొదట ప్రకటించిన పత్రం ఏది?
1) మాగ్నాకార్టా
2) మానవ హక్కుల ప్రకటన 1789
3) స్వాతంత్య్ర ప్రకటన 1776
4) భారత రాజ్యాంగం 1950
33. భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పౌర, సైనిక, రెవెన్యూ వ్యవహారాలను బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా నియంత్రించడానికి వీలుగా బ్రిటన్‌లో నియంత్రణ బోర్డు(బోర్డ్ ఆఫ్ కంట్రోల్) ఏర్పాటుకు మూలమైన చట్టం ఏది?
1) 1773 రెగ్యులేటింగ్ చట్టం
2) 1784 పిట్స్ ఇండియా చట్టం
3) 1833 ఛార్టర్ చట్టం
4) 1858 భారత ప్రభుత్వ చట్టం
34. జతపరచండి?
చట్టాలు నిబంధనలు
ఎ. 1215 1. పిటిషన్ ఆఫ్ రైట్
బి. 1628 2. మాగ్నాకార్టా
సి. 1689 3. మినిస్టర్స్ ఆఫ్ ది క్రౌన్ యాక్ట్
డి. 1937 4. హక్కుల బిల్లు
(బిల్ ఆఫ్ రైట్స్)
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2

Ppnipunaa
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






