వెబ్సైట్లో ఎస్సై ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు
యూనిఫాం ఉద్యోగాల భర్తీలో భాగంగా ఆగస్టు 7న ఎస్సై అభ్యర్థులకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ఈ నెల 30 నుంచి ఆగస్టు 5 వరకు www.tslprb.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రిలిమ్స్ నిర్వహిస్తామన్నారు. మొత్తం 554 పోస్టులకు 2,47,217 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 503 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో సందేహాలుంటే 9393711110 లేదా 9391005006ను సంప్రదించాలని కోరారు.
Previous article
ఆగస్టు 11 నుంచి సీపీగెట్
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






