ఆర్ట్స్ కాలేజీలో బీఏ ఆనర్స్ సోషియాలజీ కోర్సు
-దక్షిణ భారతదేశంలోనే మొదటిసారి
– కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్
హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం నుంచి బీఏ ఆనర్స్ సోషియాలజీ కోర్సును ప్రారంభిస్తున్నట్టు కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ టీ రమేశ్ వెల్లడించారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఈ కోర్సును ప్రారంభిస్తున్నామని, ఇది భవిష్యత్తులో ఉపాధి కల్పన కోర్సుగా దోహదపడుతుందని చెప్పారు. ఈ కోర్సు ద్వారా ఫండమెంటల్స్ ఆఫ్ సోషియాలజీ, తత్వశాస్త్రం, సమాజ పరిణామక్రమం, జర్నలిజం, రాజకీయ, ఆర్థిక, చరిత్ర, సామాజిక విషయాలను అధ్యయనం చేయవచ్చని తెలిపారు. బ్రిటిష్ కాలంలో ఈ కోర్సు దేశంలో ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఈ కోర్సులో చేరేందుకు దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న అయిలయ్య తెలిపారు.
Previous article
ఆగస్టు 14 నుంచి విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
Next article
ప్రాచీన సామాజిక సంస్థ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు