కుతుబ్ షాహీల సామాజిక స్థితి ఎలాంటిదో తెలుసా?
న్యాయ విచారణను రాజధానిలో, స్థానికంగా కూడా కాజీలు, పండితులు నిర్వహించేవారు. సుల్తానులు కూడా ఈ విషయంలో ఎంతో ఆసక్తి కనబరిచేవారు. న్యాయమందించే విషయంలో మహ్మద్ కులీ కుతుబ్ షాను విదేశీ పర్యాటకులు మెచ్చుకున్నారు. కులీ కుతుబ్‌షా దాద్ మహల్ అనే న్యాయమందిరాన్ని కట్టించాడు. తుఫాన్లవల్ల దెబ్బతిన్న ఈ భవనాన్ని మహ్మద్ కులీ తర్వాత వచ్చిన సుల్తాన్ మహమ్మద్ బాగుచేయించాడు. దీంతోపాటు అమన్ మహల్ అనే భవంతిని కూడా సుల్తాన్ మహ్మద్ నిర్మించాడు. లాపాలను వర్ణించాడు. ఉదాహరణకు.. బ్రాహ్మణుల్లో కొందరు పౌరోహిత్యం చేసి విద్య బోధించేవారు. మరికొందరు వ్యవసాయం చేశారు. మర్రి ఆకులతో ఇస్తరాకులు కుట్టి అమ్మడం, కూరగాయలు పండించి అమ్మడం ద్వారా జీవనం సాగించేవారని కదిరీపతి పేర్కొన్నాడు.
-బ్రాహ్మణులు చదువుకోవడంతో వారి జ్ఞానం, నైపుణ్యం పరిపాలనలో అవసరమయ్యేవి. కాబట్టి వారిని మహ్మదీయులు ఉద్యోగాల్లో నియమించుకునేవారనీ, శుభముహూర్తాలు నిర్ణయించగల సమర్థులైన జోతిష్యులు కాబట్టి వారి ఉపయోగం ప్రజలకు, ప్రభుత్వానికి ఎంతో ఉండేదని మోర్లాండ్ చెప్పారు. మహమ్మదీయులు కూడా వారిని సంప్రదించి ముహూర్తం నిర్ణయించుకోకుండా ప్రయాణం చేసేవారు కాదని చెప్పాడు. ఆ కాలపు పురోహితుని గురించి సురవరం ప్రతాపరెడ్డి తన ఆంధ్రుల సాంఘిక చరిత్రలో వివరించాడు. పూటకూటి ఇండ్లను ఎక్కువగా బ్రాహ్మణ వితంతువులే నడిపించేవారని, అక్కడికి వచ్చే వివిధ ప్రాంతాలకు చెందిన కవి, గాయక పండితులు, ఉద్యోగులు, బాటసారులు వెళ్లి మినుములు ఇచ్చి భోజనం చేసేవారని పేర్కొన్నాడు.
-అబుల్ హసన్ తానీషా తన కొలువులోని మాదన్న పనితీరును మెచ్చుకొని అతనికి ఆలంపనా అనే బిరుదును ఇచ్చాడు. గ్రామస్థాయిలో కరణం పెద్ద అధికారి. వీరు బ్రాహ్మణులు. కదిరీపతి తన రచనలో కరణం వేషాన్ని వర్ణించాడు. వీరితోపాటు గోల్కొండ దర్బారులోను, పెద్ద పదవుల్లోను ఉండే హిందూ నాయకుల గురించి చెప్పాడు.
-పెదపాటి ఎర్రనార్యుడు తన మల్హణ చరిత్ర రెండో అశ్వాసంలో కోమట్ల గురించి వర్ణించాడు. వర్తక వ్యాపారమే వీరి ప్రధాన వృత్తి. వీరి పేర్లు గౌరయ్య, గౌరమ్మ అని ప్రధానంగా ఉండేవి. కోమట్లు ధనవంతులని సమకాలీన రచనలు తెలుపుతున్నాయి.
-గ్రామాల్లో కాపు, రెడ్డి, నేత, వెలమ, చాకలి, మంగలి, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి మొదలైన కులాలవారు ఉన్నారు. కుతుబ్‌షాహీల నాటి హిందూ వివాహ తంతును గంగాధరుడు తన తపతీ సంవరణోపాఖ్యానంలో, సారంగ తమ్మయ్య వైజయంతీ విలాసంలో వర్ణించారు. శుకసప్తతి, హంసవింశతి నాటి పండుగలను, పిల్లలు, పెద్దలు ఆడుకునే ఆటలను వర్ణించాయి. సమాజంలో శూద్రుల స్థితి దీనంగా ఉండేది. వారు గ్రామాల్లో వ్యవసాయం చేసేవారు. రెడ్డి, కరణం, వైశ్య మొదలైన వారికి సేవలు, కూలీ చేసేవారు. నగరాల్లో ప్రభువులకు, ఉన్నతాధికారులకు నౌకర్లుగా పనిచేసేవారు. సైన్యంలో వీరే ఎక్కువగా ఉండేవారు.
సతీసహగమన దురాచారం
-భర్త చనిపోయాక స్త్రీలకు నచ్చజెప్పి, పుణ్యం ఆశ చూపి బలవంతంగా లేదా మాదక ద్రవ్యాలు ఇచ్చి ఈ ఆచారాన్ని ప్రోత్సహించేవారని విదేశీ యాత్రికులు పేర్కొన్నారు.
-భర్తను కోల్పోయిన స్త్రీకి ఇష్ట పూర్వకంగా సతీసహగమనం ఆచరించడం, పట్టణాల్లో ఉంపుడుగత్తెలా బతకడం, తల్లిదండ్రుల ఇంట్లో దాసీగా జీవించడం, ధాన్యం లాంటివి అమ్ముకుని బతకడం వంటి నాలుగు ప్రత్యామ్నాయాలు ఉండేవని మరో విదేశీ యాత్రికుడు థెవ్నాట్ చెప్పాడు. అయితే ఏ స్త్రీకైనా బతుకుమీద ఆశ ఉంటే ఆమెను బలవంతంగానైనా మంటలకు ఆహుతి కావాల్సిందేనని, వారు తమ సర్వాభరణాలతో అగ్గిలో ఆహుతైన తర్వాత బ్రాహ్మణుడు ఆ బూడిద నుంచి బంగారం, వెండి తీసుకునేవాడు కాబట్టి ఈ ఆచారాన్ని ప్రోత్సహించేవాడని టావెర్నియర్ వ్యాఖ్యానించాడు.
-ఒక స్త్రీని సతీసహగమనం చేయకుండా ఒక స్థానిక అధికారి జోక్యం చేసుకున్నాడని, కానీ లంచానికి అలవాటుపడిన ఆ అధికారి డబ్బు తన ఉద్యోగులకు అందగానే ఆమెను సతీసహగమనం చేయడానికి అనుమతించాడని టావెర్నియర్ పేర్కొన్నాడు. దీన్నిబట్టి ఆ రోజుల్లో అవినీతి, లంచగొండితనం ఉందని తెలుస్తున్నది. అయితే కుతుబ్ షాహీలకు కూడా అధిక సంఖ్యాకులైన హిందువుల మతాచారాల్లో జోక్యం చేసుకుని వారి అసంతృప్తిని పెంచడం ఇష్టంలేక సతీసహగమనాన్ని మార్చే ప్రయత్నం చేయలేదు.
స్త్రీల హోదా
-గోల్కొండ రాజ్యంలో స్త్రీ హోదా, స్థితి దీనంగానే ఉన్నట్లు సాహిత్యంలో వర్ణించబడింది. పొన్నగంటి తెలగనార్య తన యయాతి చరిత్రలో యయాతిని అత్తగారింటికి పంపే సందర్భంలో ఆమెను ఉద్దేశించి చెప్పిన మాటలు, హితవు స్త్రీకి ఏమాత్రం స్వేచ్ఛ, స్వాతంత్య్రం లేదని ఆమె భర్త, అత్త ఆధీనంలో బతికేదని తెలుస్తున్నది. ఇదే విషయాన్ని ప్రేయర్ వివరిస్తూ హిందూ స్త్రీలు పరదా వాడారనీ, ముస్లిం స్త్రీలు తప్పనిసరిగా పరదాలోనే బయటికి వెళ్లాలని వారి మగవారు ఆదేశించేవారని పేర్కొన్నాడు. స్త్రీని భోగపు వస్తువుగా చూపారనీ విలియం మెథోల్డ్ చెప్పాడు. రాజకీయ లబ్దికోసం సుల్తాన్లు వివాహ సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. బలవంతపు పెండ్లిండ్లు, కొన్ని ప్రాంతాల్లో దేవదాసి వ్యవస్థ ఆచరణలో ఉండేది. బహు భార్యత్వం, బాల్య వివాహాలు సాధారణం. సామాన్య స్త్రీలు వ్యవసాయ పనులు, కూలి, నేత మగ్గాలు, నిర్మాణాల దగ్గర పనిచేసేవారు. ఇలాంటివారికి విద్య అందుబాటులో లేదు. అయితే రాజపరివారపు బాలికలు, స్త్రీలు సంగీతం, నృత్యం, చిత్రలేఖనం మొదలైన కళలు నేర్చుకునేవారు.
వేశ్య వ్యవస్థ
-వేశ్యలు తమ పేర్లను నమోదు చేయించుకుని, అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని షేర్వానీ తెలిపాడు. టావెర్నియర్ ప్రకారం అబ్దుల్లా కాలంలో దారోగా పుస్తకంలో నమోదు చేయించుకున్న వేశ్యలు 20 వేల వరకు ఉన్నారు. ఈ గృహాలను పావనం చేసేవారిపట్ల సామాజిక కళంకమేమీ ఉండదని టావెర్నియర్ చెప్పాడు. అబుల్ హసన్ కాలంలో వేశ్యలు ప్రభుత్వ ఖజానా నుంచి మూడు లక్షల ఇరవై నాలుగువేల వార్షికాదాయం పొందేవారని తెలుస్తున్నది. వేశ్యలు మద్యం మత్తులో ఉండే విటులను అన్ని విధాలుగా దోపిడీ చేసేవారని థామస్ బేరీ రాశాడు.
తెలుగు భాషా వికాసం
గోల్కొండ కేంద్రంగా సుమారు రెండు శతాబ్దాల పాటు పరిపాలించిన కుతుబ్‌షాహీ సుల్తానులు స్థానిక ప్రజల మాతృభాష తెలుగును ఆదరించారు. వీరిలో కొందరు తెలుగు భాషలో పట్టుసాధించారు. వీరి పోషణలో పర్షియన్, అరబిక్, ఉర్దూ భాషలకు రాజ్య ఆదరణ లభించింది. అనేక తెలుగు కవులను, పండితులను ఆదరించారు. మధ్యయుగ దక్కన్ చరిత్రలో మిగతా ఏ ముస్లిం పాలకులు ఈ రకమైన ఔదర్యాన్ని ప్రదర్శించలేదు. ముఖ్యంగా ఇబ్రహీం కులీ కుతుబ్‌షా కాలంలో గోల్కొండ సుల్తాన్ దర్బార్ తెలుగు భాషా పండితులకు, కవులకు భువన విజయంగా మారింది. అద్దంకి గంగాధరకవి ఈ సుల్తాన్ పోషణ అందుకున్నాడు. ఆయన తన తపతీ సంవరణోపాఖ్యానాన్ని సుల్తాన్‌కు అంకితమిచ్చాడు. కందుకూరి రుద్రకవి పాండిత్యం వల్ల ప్రభావితుడైన సుల్తాన్ అతనికి చింతలపాలెం అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.
ఇబ్రహీం కులీ కుతుబ్‌షా అధికారులు కూడా సుల్తాన్ సేవల వల్ల ప్రభావితులయ్యారు. పటాన్ చెరువు ప్రాంతానికి అధికారిగా ఉన్న అమీన్ ఖాన్ పొన్నెగంటి తెలగనార్యుణ్ని ఆదరించాడు. దీంతో ఆయన తన గ్రంథం యయాతి చరిత్రను అమీన్ ఖాన్‌కు అంకితమిచ్చాడు. ఇది అచ్చ తెలుగులో రాసిన మొదటి గ్రంథం.మహమ్మద్ కులీ కుతుబ్‌షా కాలంలో తెలుగు భాష మరింత వికాసం పొందింది. ఇతని ఆస్థానకవి గణేష పండితుడు. వైజయంతీ విలాసం రాసిన సారంగు తమ్మయ్య ఇతని ఆస్థానానికి చెందినవాడే.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






