New car | గ్లోబల్ మార్కెట్లోకి సరికొత్త ఫీచర్స్ తో ఫోర్డ్ కార్..
హైదరాబాద్ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మార్కెట్లోకి సరికొత్త ఫీచర్స్ తో మరో కారును ప్రవేశపెట్టింది. ” 2022 ఫోర్డ్ రేంజర్ పికప్ ట్రక్ ” పేరుతో లేటెస్ట్ వెర్షన్‌ను గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేసింది. అప్డేటెడ్ డిజైన్, రివైజ్డ్ క్యాబిన్ తోపాటు, ఆధునిక ఫీచర్స్ ను రూపొందించారు. అంతేకాదు న్యూ టెక్నాలజీతో మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. కొత్త సంవత్సరం నాటికి విక్రయాలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో విక్రయాలు ప్రారంభించినట్లు సమాచారం.
ఫోర్డ్ కంపెనీ ఇప్పటికే భారతదేశంలో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. అయితే ఈ కొత్త 2022 ఫోర్డ్ రేంజర్ పిక్-అప్ ట్రక్ కొనుగోలు చేసేవారికి ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా దిగుమతి అవుతుంది. కొత్త 2022 ఫోర్డ్ రేంజర్ పిక్-అప్ ట్రక్ ఇప్పుడు అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. దీని ఫ్రన్ట్ ఫేస్ చాలా బోల్డ్‌గా ఉంటుంది.
రేడియేటర్ గ్రిల్, సి-ఆకారంలో ఎల్ఈడీలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఇన్స్టాల్ చేసిన సిల్వర్ స్కిడ్ ప్లేట్ 2022 ఫోర్డ్ రేంజర్ లుక్ ను మరింతగా పెంచుతుంది. ఫాగ్ ల్యాంప్ కోసం హౌసింగ్ హుక్ వంటి బ్లాక్ థీమ్‌లో వచ్చింది. ఫోర్డ్ కొత్త రేంజర్ కోసం దాదాపు 600 యాక్ససరీస్ కూడా అందుబాటులో ఉండనున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు