కేవీపీవై 2021
సైన్స్ పరిశోధకులకు ప్రోత్సాహం !
సైన్స్.. సాంకేతికత ఈ రెండు మానవాళి మనుగడతో ముడిపడి ఉన్న అంశాలు. సైన్స్ ఎంత పురోగమిస్తే ప్రపంచం అంత అభివృద్ధి వైపు పయనిస్తుంది. దీనికోసం దేశంలోని విద్యార్థులను బేసిక్ సైన్సెస్ చదివేలా, సైన్స్‌లో పరిశోధనలను మరింతగా చేసేలా ప్రోత్సహించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) ఏటా నిర్వహించే పరీక్ష కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై). ప్రస్తుతం కేవీవీవై-2021 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పరీక్ష విధానం, అర్హతలు, ప్రయోజనాల గురించి సంక్షిప్తంగా….

కేవీపీవై
కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)ను కేంద్ర ప్రభుత్వం 1999లో ఏర్పాటు చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) ఈ స్కాలర్షిప్స్ ద్వారా విద్యార్థులను సైన్స్ రంగం వైపు ప్రోత్సహించడానికి దీన్ని ఏర్పాటు చేసింది. కేవీపీవై ద్వారా బేసిక్ సైన్సెస్‌లో ప్రతిభను ప్రదర్శించిన అభ్యర్థులకు డిగ్రీ నుంచి పీహెచ్డీ వరకు ఉపకారవేతనాలను అందిస్తుంది. దీనికి సంబంధించిన నిధులను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సమకూరుస్తుంది.
అర్హతలు
సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ ప్రథమ సంవత్సరం కోర్సులు చదువుతున్న వారు అర్హులు. దీనిలో ఎస్ఏ, ఎస్ఎక్స్, ఎస్బీ అని మూడు స్ట్రీమ్‌లు ఉన్నాయి.
స్ట్రీమ్‌ల వారీగా వివరాలు
ఎస్ఏ: ప్రస్తుత విద్యా సంవత్సరం (2021-22)లో సైన్స్ సబ్జెక్టుల్లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ) జూనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ విభాగం కిందకి వస్తారు. పదో తరగతిలో (మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో) ఉత్తీర్ణత సాధించినవారు కేవీపీవై రాతపరీక్షకు అర్హులు. కొవిడ్-19తో ఈసారి 75 శాతం మార్కుల నిబంధనను సడలించారు.
ఎస్ఎక్స్: 2021-22లో సైన్స్ సబ్జెక్టుల్లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ) సీనియర్ ఇంటర్ చదువుతున్నవారు ఈ స్ట్రీమ్ పరిధిలోకి వస్తారు. వీరంతా ఇంటర్ మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం) మార్కులు పొంది ఉండాలి.
ఎస్బీ: 2020-21లో ప్రథమ సంవత్సరం బీఎస్సీ/బీఎస్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ఎంఎస్ కోర్సులు లేదా బీస్టాట్/బీమ్యాథ్స్ చదువుతున్నవారు అర్హులు. కొవిడ్-19తో ఈసారి ఇంటర్లో ఉత్తీర్ణులైతే సరిపోతుంది. దీంతోపాటు డిగ్రీ/పీజీ కోర్సుల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.
ఎంపిక విధానం: జాతీయస్థాయిలో జరిగే ఆన్లైన్ ఆప్టిట్యూడ్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం
రాతపరీక్ష కోసం ప్రత్యేకమైన సిలబస్ ఏమీ నిర్దేశించలేదు. విద్యార్థికి సైన్స్ సబ్జెక్టుల్లో ఉన్న అవగాహన, అర్థం చేసుకునే తీరు, విశ్లేషణను పరిశీలిస్తారు.
స్కాలర్షిప్ వివరాలు
ఎంపికైనవారికి డిగ్రీలో ఉన్నప్పుడు మూడేండ్లపాటు ప్రతినెలా రూ.5000 ఉపకారవేతనంగా చెల్లిస్తారు. అలాగే పీజీలో రూ.7000 అందిస్తారు. వీటితోపాటు ఏటా కంటింజెన్సీ గ్రాంటు కింద డిగ్రీస్థాయి వారికి రూ.20 వేలు, పీజీస్థాయి వారికి రూ.28 వేలు ఇస్తారు. ప్రసిద్ధ సంస్థల్లో వేసవి క్యాంపులూ ఉంటాయి.
సమ్మర్ ప్రోగ్రామ్: ప్రతి ఏడాది వేసవిలో జాతీయ, అంతర్జాతీయస్థాయి విద్యాసంస్థల్లో పరిశోధనలకు అవకాశం కల్పిస్తారు.
ఇతర ఉపయోగాలు: కైవీపీవై ఫెలోలకు ఐడెంటీకార్డు ఇస్తారు. దీనివల్ల జాతీయ పరిశోధన సంస్థలు/యూనివర్సిటీల్లో ల్యాబొరేటరీ, లైబ్రరీలను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: ఆగస్టు 25
పరీక్షతేదీ: 2021, నవంబర్ 7
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్.
వెబ్సైట్: http://www.kvpy.iisc.ernet.in
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
- nipuna
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






