అతినిద్ర వ్యాధి దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది?

- ఏ విటమిన్ లోపం వల్ల శరీరం లోపల రక్తస్రావం జరుగుతుంది?
1) విటమిన్-డి 2) విటమిన్-బి1
3) విటమిన్-బి6 4) విటమిన్-బి12 - పాల తెలుపు రంగుకు తోడ్పడేది, మిల్క్ షుగర్‌గా పిలుస్తున్న చక్కెర ఏది?
1) సుక్రోజ్ 2) లాక్టోజ్
3) ఫ్రక్టోజ్ 4) గ్లూకోజ్ - నీటిలో కరగని విటమిన్ ఏది?
1) కాల్సిఫెరాల్ 2) థయమిన్
3) అస్కార్బిక్ ఆమ్లం 4) పైరిడాక్సిన్ - కింది వాటిలో భిన్నమైనది?
1) పోలియో, హెపటైటిస్
2) కలరా, టైఫాయిడ్
3) అమీబియాసిస్, డయేరియా
4) డిప్తీరియా, టెటనస్ - రక్తపింజర కాటుకు ముందుగా ప్రభావం చూపేది?
1) నాడీవ్యవస్థ 2) ఊపిరితిత్తులు
3) రక్తప్రసరణ 4) మెదడు - AB రక్త వర్గపు వ్యక్తిని విశ్వగ్రహీత అనడానికి కారణం?
1) అతని రక్తంలో ప్రతిరక్షకాలు కలిగి ఉండటం
2) రక్తంలో ప్రతిరక్షకాలు లేకుండుట
3) రక్తంలో ప్రతిజనకాలు లేకుండుట
4) ప్రతిజనకాలు, ప్రతిరక్షకాలు లేకుండుట - జతపర్చండి
ఎ. పరాన్నజీవి సంబంధం
1. జాత్యంతర సంబంధం
బి. హానికరకీటకం 2. చెదపురుగు
సి. సాంఘిక జీవనం 3. ఎఫిడ్
డి. సంపర్క పోటీ తత్వం
4. జాతుల మధ్య సంబంధం
5. ఏనుగు
1) ఎ-3, బి-1, సి-5, డి-2
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-3, బి-4, సి-5, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1 - అధిక ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులు మరణించడానికి కారణం?
1) గుండెపోటు
2) కాలేయ క్యాన్సర్
3) సిర్రోసిస్
4) మూత్రపిండాల ఫెయిల్యూర్ - చీకటిలో గబ్బిలాలకు ఉపయోగపడే తరంగాలు?
1) X- కిరణాలు 2) Y-తరంగాలు
3) ఆల్ఫా కిరణాలు
4) అల్ట్రాసోనిక్ తరంగాలు - జతపర్చండి
ఎ. సార్స్ 1. కరోనా వైరస్
బి. ధనుర్వాతం 2. క్లాస్ట్రీడియం టైటాని
సి. స్వైన్ ఫ్లూ 3. హెచ్1, ఎన్ 1
డి. జలుబు 4. రైనో వైరస్
5. హెచ్5, ఎన్1
1) ఎ-3, బి-1, సి-5, డి-2
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-3, బి-4, సి-5, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1 - మూత్రపిండంలోని ఏ భాగం మూత్రాన్ని వడపోస్తుంది?
1) మూత్రాశయం 2) నెఫ్రాన్
3) ప్రసేకం 4) వృక్కధమని - ఆల్కహాల్‌కి రసాయనిక పేరు?
1) ఇథైల్ ఆల్కహాల్
2) హైడ్రేటెడ్ ఆల్కహాల్
3) లెడ్ ఆక్సైడ్
4) కాల్షియం ఆక్సైడ్ - మొక్కలు ఆకుపచ్చగా ఉండటానికి కారణం?
1) UV కాంతిని శోషించడం
2) ఆకుపచ్చ కాంతి శోషణ
3) ఆకుపచ్చ కాంతి పరావర్తనం
4) UV కాంతి పరావర్తనం - జతపర్చండి
ఎ. గుండె 1. ఆంజియాలజీ
బి. రక్తం 2. హెమటాలజీ
సి. వినాళగ్రంథులు 3. కార్డియాలజీ
డి. మూత్రపిండాలు 4. ఎండోక్రైనాలజీ
5. నెఫ్రాలజీ
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-5
3) ఎ-3, బి-2, సి-4, డి-5
4) ఎ-1, బి-2, సి-2, డి-5 - కింది వాటిలో సరికానిది ఏది?
1) మెదడులోని హైపోథాలమస్ శరీర
ఉష్ణోగ్రతను సమన్వయపరుస్తుంది
2) అనుమస్తిష్కం శరీర సమతాస్థితికి
తోడ్పడుతుండి
3) మజ్జాముఖం అనియంత్రిత చర్యలైన మింగడం, దగ్గడం, వాంతులు, హృదయస్పందన, శ్వాసక్రియలను క్రమపరుస్తుంది
4) పార్కిన్సోనియా అంటే బ్రెయిన్ ట్యూమర్ - చిన్న పిల్లల్లో డయేరియా వ్యాధికి కారణం?
1) రోటా వైరస్ 2) కరోనా వైరస్
3) పారామిక్సో వైరస్ 4) ఎంటిరో వైరస్ - వైరస్ ముఖ్య లక్షణం?
1) పత్రహరితం లేకపోవడం
2) నిర్జీవుల్లో మాత్రమే ద్విగుణీకరం
చెందగలవు
3) కొవ్వులతో తయారుచేయబడి ఉంటాయి
4) అతిథేయిల్లో మాత్రమే ప్రత్యుత్పత్తి
జరుపుకోగలవు - జతపర్చండి
ఎ. దుంపకాండం 1. అల్లం, పసుపు
బి. కొమ్ము 2. చేమ, కంద
సి. కందం 3. బంగాళదుంప
డి. లశునం 4. ఉల్లి, వెల్లుల్లి
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-1, బి-3, సి-4, డి-2 - ఔషధంగా వాడే సూక్ష్మజీవనాశిని (యాంటీబయాటిక్) విధి?
1) బ్యాక్టీరియాను చంపడం
2) బ్యాక్టీరియా భవిష్యవృద్ధిని పరీక్షించడం
3) బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడే WBC కణాల ఉత్పత్తిని ప్రేరేపించడం
4) యాంటీబాడీల ఉత్పత్తిని ప్రేరేపించడం - వైరస్ వ్యాధి కానిది?
1) గవద బిల్లలు (మంప్స్)
2) టైఫాయిడ్
3) ఫ్లూ (ఇన్‌ఫ్లూయెంజా)
4) పచ్చకామెర్లు (జాండీస్) - కింది వాటిలో జన్యుసంబంధ వ్యాధి కానిది?
1) హీమోఫీలియా- రక్తం గడ్డ కట్టకపోవడం
2) వర్ణాంధత్వం- ప్రాథమిక వర్ణాలను
గుర్తించకపోవడం
3) ఆల్బునిజం- మెలనిన్ అనే చర్మవర్ణకం లోపం వల్ల చర్మం తెల్లగా ఉండటం
4) అథ్లెట్‌ఫూట్- పాదం బాగా వాచి
రక్తస్రావం కావడం - వివృత బీజాలకు, ఆవృత బీజాలకు గల భేదం?
1) వివృత బీజాల్లో ఫలం ఉండదు.
ఆవృత బీజాల్లో ఉంటుంది
2) వివృత బీజాల్లో ఫలం ఉంటుంది.
ఆవృత బీజాల్లో ఉండదు
3) వివృత బీజాల్లో, ఆవృత బీజాల్లో ఫలం ఉండదు
4) వివృత బీజాల్లో, ఆవృత బీజాల్లో ఫలం ఉంటుంది - కింది వాటిలో సరికానిది?
1) సిల్వికల్చర్- ఫలాల పెంపకం
2) ఎపికల్చర్- తేనెటీగల పెంపకం
3) వర్మికల్చర్- వానపాము
4) ష్రింప్కల్చర్- రొయ్యలు - అయోడిన్ అధికంగా గల పదార్థాలు?
1) సముద్రపు రొయ్యలు, చేపలు
2) సముద్రపు కలుపు మొక్కలు, ఉప్పు
3) కాలేయం, గుడ్లు 4) 1, 2 - అల్బుమిన్యూరియా అంటే?
1) మూత్రం ద్వారా ప్రొటీన్ల నష్టం
2) మూత్రం ద్వారా రక్తం నష్టం
3) మూత్రం ద్వారా రాళ్లు నష్టం
4) మూత్రం ద్వారా గ్లూకోజ్ నష్టం - కింది వాటిలో సరైనది?
ఎ. ఆల్డోస్టిరాన్ అనేది ఒక గ్లూకోకార్టికాయిడ్
బి. లైంగిక కార్టికాయిడ్స్ స్త్రీలలో ఎక్కువయితే మగవారి లాగా మీసాలు రావడాన్ని
‘విరిలిజం’ అంటారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు - జతపర్చండి
ఎ. థైరాక్సిన్ 1. టానింగ్
బి. పారాథార్మోన్ 2. గ్రేవ్స్ వ్యాధి
సి. లైంగిక కార్టికాయిడ్స్
3. ఆస్టియోపోరోసిస్
డి. MSH 4. విరిలిజం
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-2, బి-4, సి-2, డి-1
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-2, బి-4, 1-4, డి-3 - కింది వాటిలో సరైనది?
ఎ. అలైంగిక ప్రత్యుత్పత్తి వల్ల జీవపరిమాణం జరుగుతుంది
బి. అలైంగిక ప్రత్యుత్పత్తి అభివృద్ధి చెందని జీవుల్లో జరుగుతుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు - కవలల్లో కూడా వేలిముద్రలు ఒకేవిధంగా ఉండవు కారణం?
1) బాహ్యచర్మంలో ఎత్తులు ఉండటం
2) అంతఃచర్మంలో ఎత్తులు ఉండటం
3) బాహ్యచర్మంలో ఎత్తుపల్లాలు ఉండటం
4) అంతఃచర్మంలో ఎత్తుపల్లాలు ఉండటం - అతినిద్ర వ్యాధి దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది?
1) సీ-సీ ఈగ 2) శాండ్ ఫ్లై
3) రాట్ ఫ్లై 4) ఏడిస్ - ఫిర్రమోన్స్ అంటే?
1) వృక్షహార్మోన్స్
2) జీర్ణక్రియను నియంత్రించే జంతు హార్మోన్స్
3) పునరుత్పత్తి శక్తిని ప్రేరేపించే హార్మోన్స్
4) తమ జాతి జీవులను గుర్తించే కీటక హార్మోన్స్ - వేటిలో నాలుగు గదుల హృదయం ఉండదు?
1) పక్షులు 2) మొసళ్లు
3) సరీసృపాలు 4) క్షీరదాలు - బంగాళదుంప అధికంగా తినడం వల్ల కలిగే లక్షణం?
1) పక్షవాతం
2) అతిసార (డయేరియా)
3) న్యుమోనియా
4) బ్రాంఖైటీస్

- Tags
- Education News
Previous article
శబ్దాలే భాషోత్పత్తికి మూలం అని వాదించేవారు?
Next article
వ్యక్తిలో న్యాయ భావన వికాసమే?
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






