CBI Notification | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5000 ఖాళీలు
Central Bank of India Apprentice Notification | ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అప్రెంటిస్(Apprentice) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 5000 ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన అర్హతను కలిగి ఉండాలి. మార్చి 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మొత్తం ఖాళీల్లో తెలంగాణ(Telangana) నుంచి (హైదరాబాద్ 65, వరంగల్ 41 ) ఖాళీల్ని భర్తీ చేయనుండగా.. ఏపీ(Andhra Pradesh) నుంచి 141 (విజయవాడ రీజన్లో 41, గుంటూరు 60, విశాఖ 40) భర్తీ చేయనున్నారు. శిక్షణ కాలం ఒక యేడాది పాటు ఉంటుంది. ఈ అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికయ్యే వారికి రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, అర్బన్ శాఖల్లో రూ.12 వేలు, మెట్రో నగరాల్లో రూ.15 వేలు చొప్పున సెంట్రల్ బ్యాంక్ స్టైఫండ్ అందజేస్తుంది.
మొత్తం పోస్టులు : 5000
పోస్టులు : అప్రెంటిస్ (తెలంగాణలో 106, ఆంధ్రప్రదేశ్‌లో 141 ఖాళీలు ఉన్నాయి)
కేటగిరీ వారీగా ఖాళీలు: జనరల్- 2159, ఎస్సీ- 763, ఎస్టీ- 416, ఓబీసీ- 1162, ఈడబ్ల్యూఎస్- 500.
శిక్షణ కాలం: ఒక యేడాది
అర్హతలు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయస్సు : మార్చి 31 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయసు సడలింపు ఉంటుంది).
స్టైపెండ్: నెలకు రూ.10000(రూరల్), రూ.12000(అర్బన్), రూ.15000(మెట్రో).
ఎంపిక : ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ అనుసరించి ఎంపిక.
రాత పరీక్ష: ఆబ్జెక్టివ్ టైప్. 1. క్వాంటిటేటివ్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ 2. బేసిక్ రిటైల్ లయబిలిటీ ప్రొడక్ట్స్ 3. బేసిక్ రిటైల్ అసెట్ ప్రొడక్ట్స్ 4. బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ 5. బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: రూ.800(ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.600; దివ్యాంగులకు రూ.400).
దరఖాస్తు : ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 03
ఆన్లైన్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 2వ వారం
వెబ్సైట్: @https://www.centralbankofindia.co.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






