average life expectancy in the country | దేశ సగటు ఆయుఃప్రమాణం ఎంత?
1. గ్రాండ్ కాన్యన్ అగాథధరి ఏ నదిపై ఉంది?
1) డాన్యూబ్ 2) కొలరాడో
3) నైలు 4) యాంగ్హో
2. ప్రపంచం మొత్తం నీటి శాతంలో హిమనీ నదాల శాతం?
1) 1.5 శాతం 2) 2.05 శాతం
3) 0.01 శాతం 4) 0.5 శాతం
3. Isohaline అని దేన్ని అంటారు?
1) ఒకే లవణీయత కలిగిన ప్రాంతాలను కలిపే రేఖ
2) ఒకే వర్షపాతం కలిగిన ప్రాంతాల రేఖ
3) ఒకే ఎత్తు కలిగిన ప్రాంతాల రేఖ
4) 1, 2
4. బ్రెజిల్ ప్రవాహం అనేది ఏ రకమైన ప్రవాహం?
1) శీతల ప్రవాహం 2) ఉష్ణ ప్రవాహం
3) 1, 2 4) ఏదీకాదు
5. ట్రోపో ఆవరణం భూ మధ్యరేఖ వద్ద ఎంత ఎత్తువరకు విస్తరించింది?
1) 10 కి.మీ. 2) 18 కి.మీ.
3) 13 కి.మీ. 4) 15 కి.మీ.
6. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిన 7 మండలాల్లో లేని మండలం?
1) బూర్గంపాడు 2) కుకునూర్
3) వరరామచంద్రాపురం 4) అశ్వాపురం
7. కాగ్నా నది జన్మస్థానం ఏది?
1) అనంతగిరి కొండలు 2) నల్లమల కొండలు 3) జగిత్యాల కొండలు 4) ఏదీకాదు
8. ఎర్రనేలలను తెలంగాణలో ఏమని పిలుస్తారు?
1) ఎర్ర చెల్కలు 2) దుబ్బ నేలలు
3) 1, 2 4) ఏదీకాదు
9. లాటరైట్ నేలలు తెలంగాణలో ఏ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి?
1) జహీరాబాద్ 2) నారాయణఖేడ్
3) సంగారెడ్డి 4) 1, 2
10. రేకొండ-పాండవులగుట్ట అనే ప్రదేశం ….?
1) ఒక రాతి చిత్రకళా స్థావరం
2) ఒక గుహ చిత్రకళా స్థావరం
3) 1, 2 4) ఏదీకాదు
11. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధికంగా గ్రామీణ కుటుంబాలు కలిగిన జిల్లా ఏది?
1) ఆదిలాబాద్ 2) మహబూబ్‌నగర్
3) ఖమ్మం 4) వరంగల్లు
12. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన జిల్లా ఏది?
1) కరీంనగర్ 2) వరంగల్లు
3) హైదరాబాద్ 4) నిజామాబాద్
13. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా వృద్ధిరేటు ఎంత?
1) 13.5 శాతం 2) 13.6 శాతం
3) 14.3 శాతం 4) 12.5 శాతం
14. భారతదేశానికి ఏ రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు?
1) 821/20 తూర్పు రేఖాంశం
2) 821/20 పశ్చిమ రేఖాంశం
3) 831/20 తూర్పు రేఖాంశం
4) ఏదీకాదు
15. భారతదేశ తూర్పు, పడమరల మధ్యదూరం ఎంత?
1) 2944 కి.మీ. 2) 2933 కి.మీ.
3) 2833 కి.మీ. 4) 2993 కి.మీ.
16. హిమాలయాలు ఏ ప్రాంతంలో అత్యంత వెడల్పుగా ఉంటాయి?
1) తూర్పు 2) పశ్చిమ
3) మధ్యప్రాంతం 4) దక్షిణ ప్రాంతం
17. కాంగ్రా, కులు లోయలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) జమ్ముకశ్మీర్ 2) ఉత్తరాఖండ్
3) హిమాచల్‌ప్రదేశ్ 4) సిక్కిం
18. శివాలిక్ కొండలను మిష్మికొండలు అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు?
1) అసోం 2) సిక్కిం
3) అరుణాచల్‌ప్రదేశ్ 4) మేఘాలయ
19. అంతర్వేది అనేది …..?
1) రెండు కొండల మధ్య ప్రాంతం
2) రెండు లోయల మధ్య ప్రాంతం
3) రెండు నదుల మధ్య ప్రాంతం
4) ఏదీకాదు
20. పళని కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) కేరళ 2) కర్ణాటక
3) తమిళనాడు 4) మహారాష్ట్ర
21. దేశంలోని థార్ ఎడారికి నీటి సదుపాయం కలిపిస్తున్న కాలువ?
1) జవహర్లాల్ నెహ్రూ కాలువ
2) ఇందిరాగాంధీ కాలువ
3) లాల్ బహదూర్ కాలువ 4) ఏదీకాదు
22. కుడంకుళం అణువిద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
1) కేరళ 2) తమిళనాడు
3) కర్ణాటక 4) గోవా
23. భారత సగటు ఆయుఃప్రమాణం ఎన్నేండ్లు (మానవాభివృద్ధి సూచీ ప్రకారం)?
1) 68.5 2) 65.8 3) 86.5 4) 56.8
24. ప్రపంచంలోని అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని ఏ కరెన్సీతో పోలుస్తారు?
1) రూపి 2) పౌండ్
3) అమెరికన్ డాలర్ 4) లీరా
25. శీతోష్ణస్థితి అంశాల క్రమాన్ని ఏ గ్రాఫ్‌ల ద్వారా సూచిస్తారు?
1) ైక్లెమోగ్రాఫ్లు 2) ైక్లెమాటోగ్రాఫ్లు
3) 1, 2 4) ఏదీకాదు
26. భూమధ్యరేఖ నుంచి దూరం పెరుగుతుంటే వార్షిక సగటు ఉష్ణోగ్రతలు?
1) తగ్గుతాయి 2) పెరుగుతాయి
3) సమానంగా ఉంటాయి
4) తగ్గుతూపెరుగుతాయి
27. ఓజోన్ పొర దెబ్బతినడంవల్ల కలిగే నష్టాలు ఏమిటి?
1) మానవుల్లో చర్మ క్యాన్సర్ రావడం
2) పంటల దిగుబడి తగ్గడం/ఉత్పాదకత తగ్గడం
3) సముద్ర పర్యావరణ మార్పులు
4) పైవన్నీ
28. అత్యంత వేగంగా జనాభా తగ్గుతున్న దేశం ఏది?
1) జపాన్ 2) ఆస్ట్రేలియా
3) ఫిలిప్పైన్స్ 4) దక్షిణ కొరియా
29. దేశాన్ని సమానంగా విభజించే రేఖ ఏది?
1) మకర రేఖ 2) కర్కాటక రేఖ
3) భూమధ్య రేఖ 4) పైవేవీకావు
30. వ్యాపార పవనాలను ఇంగ్లిష్‌లో ట్రేడ్ విండ్స్ (Trade winds) అంటారు. ట్రేడ్ అనే పదం ఏ భాష పదం?
1) గ్రీకు 2) జర్మనీ 3) లాటిన్ 4) ఇంగ్లిష్
31. నైరుతి రుతుపవనాలను భారత ద్వీపకల్పం ఏఏ శాఖలుగా విభజిస్తుంది?
1) బంగాళాఖాతం 2) అరేబియా
3) పై రెండూ
4) హిందూ మహాసముద్ర శాఖ
32. 2009లో దేశంలో ఐలా తుపానువల్ల అతలాకుతలం అయిన ప్రదేశం ఏది?
1) ఒడిశా 2) ఆంధ్రప్రదేశ్
3) సుందర్బన్ 4) పై మూడు
33. నదులు ఏర్పరిచే V ఆకారపు లోయలు కింది ఏ నదిలో అత్యధికంగా కనబడుతాయి?
1) గంగా 2) సింధు
3) బ్రహ్మపుత్ర 4) 2, 3
34. దేశంలో మొదటి జనగణన ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1882 2) 1872 3) 1827 4) 1892
35. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఏ సంవత్సరంలో స్త్రీ, పురుష లింగనిష్పత్తి అతి తక్కువగా (929) నమోదైంది?
1) 1991 2) 1981 3) 1971 4) 2011
36. అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది?
1) ఉత్తరప్రదేశ్ 2) పశ్చిమబెంగాల్
3) రాజస్థాన్ 4) మహారాష్ట్ర
37. తెలంగాణలో అతితక్కువ జనసాంద్రత కలిగిన జిల్లా ఏది?
1) రంగారెడ్డి 2) ఖమ్మం
3) ఆదిలాబాద్ 4) కరీంనగర్
38. భీంబెట్కా అనే ప్రాంతంలోని గుహలలో ఆదిమానవులు నివసించారని చరిత్రకారులు చెబుతారు. అయితే ఆ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) రాజస్థాన్ 4) ఛత్తీస్‌గఢ్
39. ఎంత జనాభా ఉన్న ప్రాంతాలను పట్టణాలు అంటారు?
1) 5,000-50,000 2) 5,000-1,00,000
3) 5,000-25,000 4) 5,000-75,000
40. ప్రపంచ వాణిజ్య సంస్థలో (WTO లో) సభ్యుల సంఖ్య ఎంత?
1) 120 2) 130 3) 150 4) 160
41. సుందర్‌లాల్ బహుగుణ ఆధ్వర్యంలో చిప్కో ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1950 2) 1965 3) 1969 4) 1970
42. 100 శాతం సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్న రాష్ర్టాలు ఏవి?
1) సిక్కిం 2) ఉత్తరాఖండ్
3) 1, 2 4) అసోం
43. సిలికేట్లు అనే రసాయనాలు ఏ పొరలో ఉంటాయి?
1) భూ పటలం 2) భూ ప్రావారం
3) భూ కేంద్రమండలం 4) 2, 3
44. అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం ఏది?
1) గురుడు 2) బుధుడు
3) భూమి 4) శుక్రుడు
45. పాంజియా అనే పదానికి మూల భాష ఏమిటి?
1) గ్రీకు 2) లాటిన్ 3) ఫ్రెంచి 4) ఇంగ్లిష్
46. అంతర్జాలన్ని ఉపయోగించి ఒక ప్రదేశపు అక్షాంశ రేఖాంశాలను కింది దేని సాయంతో తెలుసుకోవచ్చు?
1) గూగుల్ ఎర్త్ 2) గూగుల్ మ్యాపు
3) 1, 2 4) ఏదీకాదు
47. కింది వాటిలో వేటిని మెరీడియన్స్ అంటారు?
1) అక్షాంశాలు 2) రేఖాంశాలు
3) 1, 2 4) పైవేవీకావు
48. టెక్టాన్ అనే గ్రీకు పదానికి అర్థం ఏమిటి?
1) వడ్రంగి 2) భవన నిర్మాణదారు
3) 1, 2 4) పైవేవీకావు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?