Group 2,3 Special | మహిళలు, బాలలు, ట్రాన్స్జెండర్ల చట్టాలు
చట్టాలు – సెక్షన్లు
- వరకట్న నిషేధ చట్టం 1961: సెక్షన్ 304B ప్రకారం వరకట్న వేధింపుల వల్ల చనిపోతే నిందితుడికి 7 సంవత్సరాల జైలు శిక్ష లేదా మరణ శిక్ష కూడా విధించవచ్చు.
- వైవాహిక అత్యాచారం (Marrital Rape) IPC SEC – 375లోని 2వ నిబంధన వల్ల భారతదేశంలో అత్యాచారంగా పరిగ ణించడం లేదు. ఒకవేళ ఈ నిబంధన తొలగిస్తే భర్తపై కూడా భార్య కేసు నమోదు చేయవచ్చు.
* వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిం చాలని కేసు వేసిన వారు: RIT అనే NGO, AIDWA, బాధితురాలు ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు.
* సరోగసీ చట్టాన్ని 2021లో చేశారు. ఈ చట్టం 2022లో అమలులోకి వచ్చింది. - PC PNDT – ACT : (Pre-Con ception and Pre-Natal Diagnostic Techniques )
- గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994: 1996లో అమలులోకి వచ్చింది ఈ కేసు కింద మూడు నెలల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తారు.
* POCSO ACT 2012 : దీన్ని 2019లో సవరించారు. దీని ప్రకారం 7 నుంచి 10 సంవత్సరాలు జైలుశిక్ష
బాలికలపై నేరాలు :
42.6% అపహరణలు
38.8% అత్యాచార కేసులు - దేశ వ్యాప్తంగా మొత్తం 4,07,221 పోక్సో కేసులు నమోదయ్యాయి.
- ఉత్తరప్రదేశ్‌లో, కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో అధికంగా జరుగుతు న్నాయి.
మహిళల రక్షణకోసం తీసుకొచ్చిన మొబైల్ యాప్‌లు
తెలంగాణ: HAWK – EYE APP
ఆంధ్రప్రదేశ్ :DISHA APP
మాతృత్వ ప్రయోజనాలచట్టం 1961 - మాతృత్వ ప్రయోజనాల చట్టం,1961లో అవసరమైన సవరణలతో మాతృత్వ ప్రయోజనాల (సవరణ) బిల్లు, 2016ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
- మాతృత్వ ప్రయోజనాల చట్టం, 1961 కింద గర్భిణుల ఉపాధిని పరిరక్షించేందుకు తగు నియమనిబంధనలు రూపొందించింది. ప్రసవం అనంతరం పుట్టిన శిశువు సంరక్షణ బాధ్యతలు తీసుకునేందుకు ఉద్యోగానికి వెళ్లని రోజులన్నింటినీ పూర్తి వేతనం ఇచ్చే సెలవుగా పరిగణించి మాతృత్వపు ప్రయోజనం కల్పించింది. 10 మంది లేదా అంతకు మించిన ఉద్యోగులు పని చేసే సంస్థలన్నింటికీ ఈ చట్టం వర్తిస్తుంది. తాజాగా ఈ చట్టానికి ప్రవేశపెడుతున్న సవరణల వల్ల వ్యవస్థీకృత రంగంలో పని చేస్తున్న సుమారు 1.8 మిలియన్ మందికి ప్రయోజనం చేకూరుతుంది.
- మాతృత్వ ప్రయోజనాల చట్టం, 1961కి చేయ తలపెట్టిన సవరణలు ఈ కింది విధంగా ఉన్నాయి.
- ఇద్దరు పిల్లల వరకు మాతృత్వ ప్రయోజనం కింద ఇచ్చే సెలవు 12 వారాల నుంచి 26 వారాలకు పెంపు.
- ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల విషయంలో మాతృత్వపు సెలవు 12 వారాలకు పరిమితం.
- పిల్లలను దత్తత తీసుకున్న లేదా ఇతరులకు గర్భం అద్దెకిచ్చి వారి పిల్లలను మోస్తున్న తల్లులకు 12 వారాల మాతృత్వపు సెలవు.
- ఇంటి వద్దే ఉండి పనిచేసే సౌకర్యం (వర్క్ ఫ్రం హోమ్): 50 మంది, అంతకు పైబడిన ఉద్యోగులు పని చేస్తున్న సంస్థల్లో బాలల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు.
న్యాయబద్ధత: పిల్లల పరిపక్వత, అభివృద్ధికి శైశవ దశలో తల్లుల శ్రద్ధ చాలా అవసరం. - 44వ, 45వ, 46వ భారతీయ కార్మిక సమ్మేళనాల్లో ప్రసూతి సెలవు ప్రయోజనాలను 24 వారాలకు పెంచాలని సిఫారసు చేశారు.
- మాతృత్వపు ప్రయోజనాలను 8 నెలలకు పెంచాలని మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రతిపాదించింది.
- మాతృత్వపు సెలవు పెంపునకు సంబంధించిన ప్రతిపాదనకు త్రైపాక్షిక సంప్రదింపుల్లో సంబంధిత వర్గాలు అన్నీ తమ మద్దతును తెలియజేశాయి.
గమనిక : – ప్రభుత్వ లేదా ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న మహిళలకు కూడా వర్తిస్తుంది.
SEC306 : ఆత్మహత్యకు ప్రేరేపించడం 10 సంవత్సరాలు జైలుశిక్ష
SEC312 : మూడు నెలల గర్భం దాల్చిన స్త్రీకి గర్భస్రావం కలిగిస్తే మూడు సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా. మూడు నెలలు దాటిన తర్వాత గర్భస్రావం కలిగిస్తే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష.
SEC 326 A: ఆమ్లదాడుల వల్ల గాయాలకు కారణమైతే పది సంవత్సరాల నుంచి యావజ్జీవ జైలుశిక్ష.
SEC 372: వ్యభిచారం కోసం మైనర్లను అమ్మడం – పది సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా
SEC 373: వ్యభిచారం కోసం మైనర్లను కొనుగోలు చేస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష
SEC 375: అత్యాచారానికి నిర్వచనం
SEC 497: వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఐదు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా (పురుషుడికి శిక్ష విధిస్తారు).
CEDAW: Convention on the Elimin -ation of all forms of Discrimi -nation Against Women - 1979లో యూఎన్వో ఈ సంస్థను స్థాపించింది.
- 1980లో భారతదేశం దీని మీద సంతకం చేసింది.
కేసులు - మేరీరాయ్ v/s కేరళ 1986: ఈ కేసు ద్వారా తండ్రి ఆస్తిలో మహిళలకు కూడా హక్కులు ఉంటాయని చెప్పింది.
- లలిత్‌సింగ్ v/s రాజస్థాన్ జూలై 2006: మేజర్ అయిన యువతికి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకొనే హక్కు ఉంటుంది.
- రుక్సాన్ శర్మ v/s అరుణ్ శర్మ 2015: భార్యకు పిల్లలకు దూరంగా ఉంటున్న తండ్రికి పిల్లలపై ఎలాంటి హక్కు ఉండదు అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
- సుహాస్ కట్టి v/sతమిళనాడు 2004: మహిళలకు అసభ్యకరమైన సందేశాలు పంపితే, మహిళను అగౌరవానికి గురి చేస్తే శిక్ష విధించబడుతుంది.
- మధురాకేసు :1975-Custodial Rape
- లక్ష్మి v/s ఇండియా 2013 : లక్ష్మీదేవి అనే మహిళపైన యాసిడ్ దాడి జరిగినప్పుడు సుప్రీం కోర్టు మార్గదర్శకం జారీ చేసింది.
హజ్రత్ అలీ దర్గాకేసు 2016 : ముస్లిం మహిళలకు ప్రార్థనా మందిరాల్లో ప్రవేశం ఉంటుంది అని తీర్పును ఇచ్చింది.
తృప్తిదేశాయ్ కేసు: ఈ కేసులో శని దేవాలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. - యంగ్ ఇండియా న్యాయవాదులు-శబరిమల కేసు 2018: ఈ కేసు ప్రకారం శబరిమల దేవాలయంలో మహిళలకు ప్రవేశం ఉంటుంది, ప్రవేశించవచ్చు అని తీర్పు ఇచ్చింది.
మానవ అక్రమ రవాణా నిషేధ చట్టం: 1956
జాతీయ న్యాయ రికార్డు బ్యూరో : 2020 ప్రకారం మానవ అక్రమ రవాణా కేసులు
మొత్తం కేసులు : 1714
అధికంగా.. 1. మహారాష్ట్ర
2. తెలంగాణ 3. ఆంధ్రప్రదేశ్ - IPC 370 A – ప్రకారం నమోదైన అత్యధిక కేసులు: 1. మహారాష్ట్ర 2. కేరళ
- అంతర్జాతీయ అక్రమ రవాణా ప్రొటోకాల్ 2000: ఏడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు.
- బాలల న్యాయచట్టం 2017 (Juvenile justice act ): 2016లో అమలులోకి వచ్చింది.
బాలల హక్కుల కన్వెన్షన్
- 1989లో బాలల హక్కుల కన్వెన్షన్ అంతర్జాతీయంగా రూపొందించింది.
- దీన్ని 2021లో సవరించారు. దీని ప్రకారమే బాలల న్యాయ చట్టం 2021లోకి వచ్చింది.
- బాల కారగారాలు ఏర్పాటు చేయాలి. బాలల కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేయాలి.
- జిల్లా బాలల సంరక్షణ యూనిట్స్ ఏర్పాటు చేశారు.
CARA (Child Adoption & Resources Authority): ఈ చట్టం ద్వారా 2021 ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతి ప్రకారం మాత్రమే పిల్లలను దత్తత తీసుకోవాలి.
ఉజ్వల పథకం 2007-08: వ్యభిచారంలో ఉన్న మహిళలను తీసుకెళ్లి వేరే ప్రాంతాల్లో ఉంచుతారు. వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి రక్షణ కోసం పునరావాసం కల్పిస్తున్నారు.
స్వధార్ గృహ పథకం 2001-02 : అనాథలు, వ్యభిచార వృత్తిలో ఉన్న మహిళలకు పునరావాసం, నైపుణ్య శిక్షణ కల్పిస్తారు. జైలు నుంచి విడుదలైన మహిళలకు, ఒంటరి మహిళల కోసం ఇందులో వసతి కల్పిస్తారు. ఈ పథకానికి కేంద్ర నిధులు 60 శాతం రాష్ట్ర నిధులు 40 శాతం కేటాయిస్తారు.
ఖోయా-పాయా వెబ్సైట్ 2015: దీనిలో తప్పిపోయిన బాలలకు సంబంధించిన సమాచారాన్ని ఉంచుతారు.
ఆపరేషన్ స్మైల్: సెప్టెంబర్ 2014లో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఆపరేషన్‌ను ప్రారంభించింది. దీని ఫలితంగా ఒక నెలలో 227 మంది పిల్లలను రక్షించారు. విజయవంతమైన ఈ ఆపరేషన్ రాష్ట్ర పోలీసు విభాగాలకు శిక్షణ ఇవ్వడానికి, ఆపరేషన్ ముస్కాన్‌ను అమలు చేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖను ప్రేరేపించింది. - ఇది రాష్ట్ర పోలీసు అధికారులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే నెల రోజుల ప్రచారం. ఘజియాబాద్ పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లలో జాబితా చేయబడిన, తప్పిపోయిన పిల్లలను గుర్తించడానికి శిక్షణ పొందిన, దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపబడిన పోలీసు సిబ్బంది ఈ ప్రయత్నం చేశారు.
- తప్పిపోయిన పిల్లలను తిరిగి పొందడం/పునరావాసం కల్పించడం కోసం గతంలో చేపట్టిన కార్యక్రమాలకు కొనసాగింపుగా, దేశవ్యాప్తంగా జూలై 2017లో “ఆపరేషన్ ముస్కాన్ -III” ప్రారంభించబడింది.
ప్రజ్వల సంస్థ : తెలంగాణలోని హైదరాబాద్‌లో మహిళలను అక్రమ రవాణా, వ్యభిచారానికి గురి కాకుండా కాపాడుతుంది.
పూర్ణ శక్తి కార్యక్రమం 2013: బాలికల సమస్యల పట్ల అవగాహన కల్పించడం కోసం.
ట్రాన్స్ జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) బిల్లు, 2019: సామాజిక న్యాయం, సాధికారత మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ 2019 జూలై 19న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. - ట్రాన్స్‌జెండర్ వ్యక్తి నిర్వచనం: ఈ బిల్లు ట్రాన్స్‌జెండర్ వ్యక్తిని పుట్టినప్పుడు కేటాయించిన లింగంతో సరిపోలని వ్యక్తిగా నిర్వచిస్తుంది.
- ఇందులో ట్రాన్స్-మెన్, ట్రాన్స్- ఉమెన్, ఇంటర్ సెక్స్ వైవిధ్యాలు ఉన్న వ్యక్తులు, లింగ-క్వీయర్లు, కిన్నార్, హిజ్రా వంటి సామాజిక – సాంస్కృతిక గుర్తింపులు ఉన్న వ్యక్తులు ఉన్నారు.
- ఇంటర్ సెక్స్ వైవిధ్యాలు అంటే పుట్టినప్పుడు అతని లేదా ఆమె ప్రాథమిక లైంగిక లక్షణాలు, బాహ్య జననేంద్రియాలు, క్రోమోజోమ్‌లు లేదా మగ లేదా స్త్రీ శరీరం సాధారణ ప్రమాణం నుంచి హార్మోన్లలో వైవిధ్యాన్ని చూపించే వ్యక్తి అని అర్థం.
- ఈ బిల్లు ట్రాన్స్‌జెండర్ వ్యక్తిపై వివక్షను నిషేధిస్తుంది. ఇందులో సేవా నిరాకరణ: (i) విద్య (ii) ఉపాధి (iii) ఆరోగ్య సంరక్షణ (iv) ప్రజలకు అందుబాటులో ఉన్న వస్తువులు, సౌకర్యాలు, అవకాశాలను యాక్సెస్ చేయడం లేదా అనుభవించడం (v) ఉద్యమ హక్కు (vi) నివాసం, అద్దెకు లేదా ఆస్తిని ఆక్రమించే హక్కు; (vii) ప్రభుత్వ లేదా ప్రైవేట్ కార్యాలయాన్ని నిర్వహించే అవకాశం. (viii) లింగమార్పిడి వ్యక్తి సంరక్షణ లేదా అదుపులో ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థకు కూడా వెళ్లవచ్చు.
నివాస హక్కు: - ఉపాధి: రిక్రూట్మెంట్, ప్రమోషన్‌తో సహా ఉద్యోగ విషయాల్లో లింగమార్పిడి చేసిన వ్యక్తి పట్ల ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థ వివక్ష చూపకూడదు.
- విద్య: సంబంధిత ప్రభుత్వం నిధులు లేదా గుర్తింపు పొందిన విద్యాసంస్థలు లింగమార్పిడి చేయని వ్యక్తులకు సమగ్ర విద్య, క్రీడలు, వినోద సౌకర్యాలను అందించాలి.
- ఆరోగ్య సంరక్షణ: లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులకు ప్రత్యేక HIV నిఘా కేంద్రాలు, లింగమార్పిడి శస్త్రచికిత్సలతో సహా ఆరోగ్య సౌకర్యాలను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
బి.పురుషోత్తం రెడ్డి
శ్రీలక్ష్మీ నరసింహ కోచింగ్ సెంటర్, ఆదిలాబాద్
9030925817
Next article
SAT Preparation | SAT… Short and Digital
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?