Indian Actions on Climate Change | వాతావరణ మార్పులపై భారత్ చర్యలు
ప్రపంచంలో గ్రీన్హౌస్ ఉద్గారాల విడుదలలో భారత్ మూడో స్థానంలో ఉన్నది. యూరోపి యన్ యూనియన్ను ఒక దేశంగా పరిగణిస్తే నాలుగో స్థానంలో ఉంది. అయినా తలసరి ఉద్గారాల్లో భారత్ 122వ స్థానంలో ఉన్నది.
-2008 నాటికి భారత్ సగటు గ్రీన్హౌస్ ఉద్గారాల విలువ 1.52 కార్బన్ డై ఆక్సైడ్ టన్నులు. చైనా 5.3 కార్బన్ డై ఆక్సైడ్ టన్నులు, కతార్ 49.05 కార్బన్ డై ఆక్సైడ్ టన్నులు, కువైట్ 30.11 కార్బన్ డై ఆక్సైడ్ టన్నులతో పోలిస్తే భారత్ సగటు ఉద్గారాలు చాలా తక్కువ.
-2030 నాటికి కూడా భారత్ తలసరి ఉద్గారాల్లో 2.77 నుంచి 5.00 టన్నుల మధ్య ఉంటుందన్నది అంచనా. కనుక ప్రపంచ శీతోష్ణస్థితి మార్పుకి భారత్ పెద్దగా కారణం కాదు. అయినా, శీతోష్ణస్థితి మార్పువల్ల భారత్ తీవ్ర ప్రభావానికి లోనవుతున్నది.
-భవిష్యత్‌లో ప్రభావాల తీవ్రత మరింత పెరుగనున్నట్లు 2010లో విడుదలైన INCCA (Indian Network for Climate change Assesment) నివేదిక తెలియజేస్తుంది.
-వ్యవసాయం, ఆరోగ్యరంగాలు తీవ్ర ప్రభావానికి గురికానున్నాయని ఈ నివేదికలో పేర్కొన్నారు.
-రబీకాలంలో సగటు ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగితే గోధుమ ఉత్పత్తి 6 మి. టన్నుల మేరకు తగ్గే ప్రమాదం ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొన్నది.
-శీతోష్ణస్థితి మార్పు ద్వారా పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం దాని ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దాని అనుగుణంగానే నూతన పద్ధతులను అవలంబించే లక్ష్యంతో 2008 జూన్ 30న National Action Plan on Climate Change (NAPCC) అనే కార్యచరణ ప్రణాళికను విడుదల చేసింది.
-ఈ కార్యచరణ ప్రణాళికలో భాగంగా శక్తి భద్రత, సుస్థిర వ్యవసాయం, నీటి భద్రత, ఆవాసాల రక్షణ, హిమాలయాల పరిరక్షణ మొదలైనవి లక్ష్యాలని ఉద్దేశించిన ఎనిమిది మిషన్లను రూపొందించారు.
-2020 వరకు 2005 నాటి ఉద్గారాల్లో 20 నుంచి 25 శాతం మేరకు తగ్గించనున్నట్లు భారత్ ప్రకటించింది. ఇందుకోసం 12వ పంచవర్ష ప్రణాళికలో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా రూపొందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
-రాష్ర్టాల స్థాయిలో శీతోష్ణస్థితి మార్పు ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ ప్రణాళికలు సహకరిస్తాయి.
శీతోష్ణస్థితి మార్పు – నివారణ చర్యలు
-కార్బన్ డై ఆక్సైడ్ వంటి ఉద్గారాలకు కారణమవుతున్న బొగ్గు, చమురు వంటి సంప్రదాయ వనరుల స్థానంలో ప్రత్యామ్నాయ శక్తి వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలి.
-సౌరశక్తి, పవనశక్తి, చిన్నతరహా జల విద్యుత్ తదితర కాలుష్య రహిత శక్తి వనరులను అభివృద్ధిలోకి తీసుకురావాలి. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా సహజ వాయువు వినియోగాన్ని ప్రోత్సహించాలి.
-ఈ విధంగా భారత్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి. జియోథర్మల్, హైడ్రోజన్, సముద్రతరంగాల శక్తి, జీవ ఇంధనాల వంటి నవీన శక్తి వనరులను ప్రోత్సహించాలి.
-మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి మంచి కార్బన్ తొట్టెలుగా వ్యవహరిస్తాయి. కాబట్టి భారీ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించాలి.
-బంజరు భూముల్లో మొక్కలను పెంచాలి. అడవుల నరికివేత ద్వారా 20 శాతం వరకు ప్రపంచంలో గ్రీన్హౌస్ ఉద్గారాలు పెరుగుతున్నాయని IPCC గుర్తించింది.
-శక్తి సామర్థ్యాన్ని పెంచే విధానాలను కూడా అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం ఇప్పటికే కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ (CFL) కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే వీటికంటే సమర్థవంతమైన LED (లైట్ ఎమిటింగ్ డయోడ్) పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించాలి.
-భారత్‌లో విద్యుత్ సరఫరా నష్టాలు 24 శాతం వరకు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై దృష్టి సారించడం ద్వారా కూడా శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
-మీథేన్ ఒక సమర్థవంతమైన గ్రీన్హౌస్ ఉద్గారం. పశువుల పేడ వినియోగం ద్వారా మీథెన్ అధిక మొత్తంలో గాలిలోకి విడుదలవుతున్నది. కాబట్టి గ్రామీణ ప్రాంత ఘనవ్యర్థాన్ని బయోగ్యాస్ ప్లాంట్లలో వినియోగించడం ద్వారా మీథేన్ విడుదలను అరికట్టడమే కాకుండా బయోగ్యాస్ రూపలో వంటకు, లైట్లను వెలిగించడానికి ఉపయోగిస్తారు.
-కాబట్టి మరింత అధిక సామర్థ్యంలో చిన్న కుటుంబాలు కూడా వినియోగించదగ్గ సమర్థవంతమైన బయో గ్యాస్ ప్లాంట్లను వినియోగిస్తారు.
-పట్టణ ప్రాంతాల్లో ఘనవ్యర్థ పదార్థాలను సక్రమంగా నిర్వహించడం ద్వారా కూడా మీథేన్ విడుదలను నిరోధించవచ్చు.
-ముఖ్యంగా చెత్త ఉత్పత్తయిన చోటనే తడి, పొడి చెత్త వేరుచేసి వాటి రవాణను వేగవంతం చేసి రీసైక్లింగ్‌ను ప్రోత్సహించాలి.
-జీవక్షయం చెందే ఘనవ్యర్థం ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేసే విధానాలను తయారుచేసి ఆ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?