TSPSC | జూన్ 11న గ్రూప్-1 పరీక్ష.. ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహణకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు
TSPSC | హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఆఫ్‌లైన్‌లో, ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. జూన్ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిరుడు ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అక్టోబర్ 16న పరీక్ష జరిగింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 2,85,916 మంది హాజరయ్యారు. మెయిన్స్‌కు 25,050 మందిని కమిషన్ ఎంపిక చేసింది. ఈలోగా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడింది. దీంతో టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్‌తోపాటు మరికొన్ని పరీక్షలను రద్దు చేసింది. మళ్లీ కొత్త పరీక్ష తేదీలను ప్రకటించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పించింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్పీఎస్సీలో ప్రక్షాళనకు సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తొలుత ప్రత్యేకంగా పరీక్ష విభాగాన్ని తీసుకొచ్చింది.
టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శి హోదాలో ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా బీఎం సంతోష్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా ఎన్ జగదీశ్వర్ రెడ్డిని నియమించింది. వీటితోపాటు కొత్తగా డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ ప్రోగ్రామర్, జూనియర్ ప్రోగ్రామర్, లా ఆఫీసర్(జూనియర్ సివిల్ జడ్జి క్యాడర్) పోస్టులను మంజూరు చేసింది. దశలవారీగా భర్తీ ప్రక్రియ జరుగుతున్నది. గతంలో పనిచేసిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరినీ మార్చింది. మళ్లీ కొత్తగా ప్రశ్నపత్రాలను రూపొందించింది. టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని ఉద్యోగుల విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రతి విషయాన్ని డేగ కన్నుతో పరిశీలిస్తున్నది. జూన్ 11నే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ క్షేత్రస్థాయిలో ఇప్పటికే ప్రణాళికలన్నీ సిద్ధం చేసింది. అభ్యర్థులు అనవసరపు ప్రచారాలు నమ్మకుండా, ప్రిపరేషన్ కొనసాగించాలని, షెడ్యూల్ ప్రకారమే పరీక్ష జరుగుతుందని టీఎస్పీఎస్సీలో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
లక్షకు మించితే ఓఎంఆర్ పద్ధతే!
రాష్ట్రంలో ప్రస్తుతం 25 వేలలోపు అభ్యర్థులు మాత్రమే ఆన్లైన్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉన్నది. ఆ సంఖ్యను 50 వేలకు పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం 25 వేల నుంచి 50 వేలలోపు మంది అభ్యర్థులు ఉంటే కంప్యూటర్ బెస్డ్ పరీక్ష నిర్వహిస్తున్నారు. రెండు సెషన్లలో పరీక్షను పూర్తిచేసి, మార్కులను నార్మలైజేషన్ పద్ధతిలో లెక్కిస్తున్నారు. లక్ష కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే మాత్రం ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను సైతం ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది.
అయోమయానికి తెర
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షపై అభ్యర్థుల్లో కాస్త అయోమయం నెలకొంది. సమయం దగ్గర పడుతున్నా కొద్దీ పరీక్ష వాయిదా పడుతుందనే ప్రచారం జరుగుతున్నది. దీంతోపాటు ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమినరీ సైతం ఆన్లైన్లో జరుగుతుందనే ప్రచారం జరిగింది. అసలు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందా? ఒకవేళ షెడ్యూల్ ప్రకారమే జరిగితే.. ఆన్లైన్లో జరుగుతుందా? ఆఫ్‌లైన్‌లోనా? అనే సందేహంలో అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు. పరీక్ష షెడ్యూల్ ప్రకారమే, నోటిఫికేషన్లో పొందుపరిచినట్టే ఓఎంఆర్ పద్ధతిలోనే జరుగుతుందని టీఎస్పీఎస్సీలోని ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. దీంతో అయోమయానికి తెరిపడినట్టయింది.
ఊపందుకొన్న పోటీ పరీక్షలు
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షల నిర్వహణ మళ్లీ ఊపందుకున్నది. ఈ నెలలోనే ఏడు పరీక్షలు నిర్వహణకు సంస్థ తేదీలను ప్రకటించింది. ఇప్పటికే రెండు పరీక్షలు పూర్తవగా, మరో ఐదు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత కోసం ఈసారి ఆన్లైన్లోనే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నది. ఇప్పటివరకు నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)తోపాటు ఇతర పరీక్షలను అన్లైన్లోనే నిర్వహించింది.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






