గ్రామీణ భారతంలో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలా?
ప్రకటనలు – తీర్మానాలు
ప్రవచనాలు :
1) మొదటి తీర్మానాన్ని పాటిస్తుంది
2) రెండవ తీర్మానాన్ని పాటిస్తుంది
3) రెండు తీర్మానాలు పాటించదు
4) రెండు తీర్మానాలు పాటిస్తుంది
1. ప్రకటన : మేనేజర్ సచిన్‌ను తన సహచరుల వద్ద కించపరిచాడు.
తీర్మానాలు –
I : మేనేజర్‌కు సచిన్ అంటే పడదు
II : సచిన్ గొప్పతనం అతని సహచరులకు తెలియదు
2. ప్రకటన : ‘క్రాఫ్ట్ రంగులను ఉపయోగించండి మీ జీవితాన్ని వెలుగులతో నింపండి’ అనేది ఒక ప్రకటన
తీర్మానాలు –
I : ఆకట్టుకునే నినాదాలు ప్రజలను ఆకర్షించలేవు
II : ప్రజలకు కృష్ణ రంగులు ఇష్టం
3. ప్రకటన : శుక్రవారం మరమ్మతులు చేయటం వల్ల ఎ, బి వార్డులకు 50 శాతం వరకు నీటి సరఫరాపై ప్రభావం చూపుతుంది.
తీర్మానాలు –
I : ఈ వార్డుల్లోని ప్రజలు శుక్రవారం నీటిని చాలా పొదుపుగా ఉపయోగించాలి
II : ఈ వార్డులోని ప్రజలు అంతకముందు రోజే కొంత నీటిని నిల్వ చేసుకోవాలి
4. ప్రకటన : వరకట్నానికి వ్యతిరేకంగా ఎక్కువగా మాట్లాడిన వారే వరకట్నం తీసుకుంటారు
తీర్మానాలు –
I : చేతలకంటే మాటలు తేలిక
II : ప్రజలవి ద్వంద్వ ప్రమాణాలు
5. ప్రకటన : జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి 1000 జనాభాకు 100 పడకలు ఉండాలి. కానీ ఈ రాష్ట్రంలో 150 పడకలు ఉన్నాయి.
తీర్మానాలు –
I : మన జాతీయ నిబంధనలు తగిన విధంగా ఉన్నాయి.
II : ఈ రాష్ట్రం ఆరోగ్యంపై మంచి శ్రద్ధ పెట్టింది.
6. ప్రకటన : శీతాకాలంలో వర్షాలు పంటలకు మంచిది.
తీర్మానాలు –
I : శీతాకాలంలో మంచి నాణ్యతగల పంటలు పండుతాయి
II : మిగిలిన కాలంలో వర్షాలు పంటలను పాడుచేస్తాయి.
7. ప్రకటన : రాజకీయాల్లో డబ్బు చాలా కీలక పాత్ర పోషిస్తుంది
తీర్మానాలు –
I : పేదవారు ఎప్పటికీ రాజకీయ నాయకులు కాలేరు
II : ధనవంతులు అందరూ రాజకీయాల్లో ఉంటున్నారు
8. ప్రకటన : కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి
తీర్మానాలు –
I : కూరగాయలు అరుదైన వస్తువుగా మారుతున్నాయి
II : ప్రజలు కూరగాయలు తినలేరు
ప్రకటనలు – వాదనలు
ప్రవచనాలు :
1) వాదన I బలమైనది
2) వాదన II బలమైనది
3) రెండు వాదనలూ బలమైనవికావు
4) రెండు వాదనలు బలమైనవి
9. ప్రకటన : భారతవరల్డ్ కప్ ఫుట్‌బాల్ పోటీ నిర్వహించవచ్చా?
వాదనలు –
I : అవును ఎందుకు నిర్వహించకూడదు
II : కాదు భారత్ ఫుట్‌బాల్ టీం బలమైంది కాదు
10. ప్రకటన : షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలా?
వాదనలు –
I : అవును అది మంచి లాభాలనిస్తుంది
II : కాదు, అది బలహీనతగా మారుతుంది
11. ప్రకటన : టీవీ యాంకర్లను టీచర్లుగా చేయాలా?
వాదనలు –
I : అవును, టీవీ యాంకర్లకు చాలా ప్రజాదరణ ఉంది
II : కాదు, టీవీ యాంకర్లకు విషయ జ్ఞానం ఉండదు.
12. ప్రకటన : రోడ్లపై ప్రతి కిలోమీటరుకు మెటల్ డిటెక్టర్లను బిగించాలా?
వాదనలు –
I : కాదు, అది చాలా ఖరీదైన విషయం
II : అవును, టెరరిస్ట్ ఎటాక్‌లు పెరుగుతున్నాయి.
13. ప్రకటన : కాలేజీలు, యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ యూనియన్స్ ఉండాలా?
వాదనలు –
I: కాదు, దానివల్ల కాలేజీలో రాజకీయ వాతావరణం నెలకొంటుంది
II : అవును, ఇది చాలా అవసరం, ఎందుకంటే నేటి విద్యార్థులే రేపటి రాజకీయ నాయకులు
16. ప్రకటన : ఇండియా కశ్మీర్‌ను పాకిస్థాన్‌కు ఇవ్వాలా?
వాదనలు –
I : లేదు. కశ్మీర్ చాలా అందమైన రాష్ట్రం. కశ్మీర్ ద్వారా ఇండియాకు చాలా ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం వస్తుంది
II : అవును దీనివల్ల ఇరుదేశాల మధ్య గొడవలు ఉండవు
17. ప్రకటన : గ్రామీణ భారతంలో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలా?
వాదనలు –
I : అవును, గ్రామీణ ప్రజలు చాలా సృజనాత్మకత కలిగి ఉన్నారు
II : అవును, దీనివల్ల కొంతవరకు నిరుద్యోగం తగ్గించవచ్చు
18. ప్రకటన : అయిదవ తరగతి వరకు అన్ని వార్షిక పరీక్షలను రద్దుచేయాలా?
వాదనలు –
I : అవును, చిన్న పిల్లలపై పరీక్షల భారం పెడితే వారి సహజసిద్ధమైన పెరుగుదల ఆగిపోతుంది.
II : కాదు, వారు సరైన శ్రద్ధతో నడవకపోవడం వల్ల అది వారి భవిష్యత్‌పై ప్రభావం చూపుతుంది.
ప్రకటనలు – ఊహలు
ప్రవచనములు :
1) ఊహ I మాత్రమే అంతర్లీనంగా ఉంది
2) ఊహ I I మాత్రమే అంతర్లీనంగా ఉంది
3) ఏ ఊహ అంతర్లీనంగా లేదు
4) రెండు ఊహలు అంతర్లీనంగా ఉన్నాయి
19. ప్రకటన : ‘ఒకసారి అమ్మిన వస్తువులు మార్చబడవు’
ఊహలు –
I : ఖాతాదారులు నోటీసుకు కట్టుబడి ఉండాలి
II : కొందరు తమకున్న వస్తువులను మార్చుకోడానికి వస్తారు
20. ప్రకటన : ఆపరేషన్ తరువాత రోగిస్థితి మెరుగుపగుతుంది
ఊహలు –
I : ప్రస్తుత పరిస్థితిలో రోగికి ఆపరేషన్ చేయవచ్చు
II : ప్రస్తుత పరిస్థితిలో రోగికి ఆపరేషన్ చేయకూడదు
21. ప్రకటన : ‘నువ్వు అల్లరి చేసి నన్ను ఇబ్బంది పెడితే ఒకటిస్తా’ అని తల్లి బిడ్డతో అన్నది
ఊహలు –
I : తల్లి ఇలా బెదిరించడం వల్ల బిడ్డ అల్లరి మానేస్తాడు
II : పిల్లలందరూ అల్లరివారే
22. ప్రకటన : ఆరు నెలలకే మీ సొమ్ము రెట్టింపు.. ఒక ప్రకటన
ఊహలు –
I : ఈ ప్రకటన సరైనది కాదు
II : ప్రజలు తమ డబ్బు వృద్ధి చెందాలని కోరుకుంటారు
23. ప్రకటన : నేను ఎప్పుడూ 9pm వార్తలు రేడియోలో వింటూ తాజా సమాచారం తెలుసుకుంటాను.
ఊహలు –
I : ఈ వ్యక్తి వార్తా పత్రికలు చదవడు
II : తాజా వార్తలను రేడియోలో మాత్రమే ప్రసారం చేస్తారు
24. ప్రకటన : ఈ విషయం మీద అంతగొప్ప పుస్తకం ఇంతవరకు రాలేదు.
ఊహలు –
I : ఈ విషయం మీద మరికొన్ని పుస్తకాలు ఉన్నాయి
II : మీరు అతి కొద్ది విషయాలు మీదనే గొప్ప పుస్తకాలు రాయగలరు
25. ప్రకటన : ఒక పత్రికలో ప్రకటన ఇలా ఉన్నది ‘మీరు మా షాప్‌లో కొంటే మీ డబ్బుకు సరైన విలువ దొరుకుతుంది’
ఊహలు –
I : వేరే షాప్‌లలో కొన్ని వస్తువుల ధరలు వాటి విలువ కన్నా ఎక్కువ
II : ప్రజలు తమ డబ్బుకు పూర్తి విలువ పొందాలని అనుకుంటారు
వివరణలు
1. (3)
I : పాటించదు. మేనేజర్ సచిన్‌ను కించపరిచినంత మాత్రాన అతనికి సచిన్ అంటే పడదనుకోనక్కరలేదు
II : పాటించదు. ఎందుకంటే సచిన్ గొప్పతనం గురించి ఇచ్చిన ప్రవచనంలో లేదు.
2. (3)
I : పాటించదు. ఇచ్చిన ప్రవచనానికి వ్యతిరేకమైన తీర్మానం
II : పాటించదు. ప్రజలకు ఇష్టమైన రంగుల గురించి ఎక్కడా చెప్పలేదు.
3. (4)
I : నీరు తక్కువ ఉంటుంది. కాబట్టి శుక్రవారం పొదుపుగా ఉపయోగించాలనే తీర్మానం సరైనది
II : ముందు ప్రకటించారు. అంటే ముందు జాగ్రత్తలు తీసుకోమని అర్థం. అంటే అంతకుముందు రోజు స్టోర్ చేసుకోవటం అనేది సరైన తీర్మానం.
4. (4)
I : ఇచ్చిన ప్రవచనం నుంచి ‘చేతలకంటే మాటలు తేలిక’ అనేది సరైన తీర్మానం
II : I, II తీర్మానాల అర్థం ఒకటే. కావున ఇది కూడా పాటిస్తుంది
5. (2)
I : పాటించదు. మిగతా రాష్ట్రాల్లో తెలియకుండా జాతీయ నిబంధనల గురించి మాట్లాడలేం
II : అవసరమైన పడకల కంటే ఎక్కువ పడకలు ఉన్నాయంటే ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టినట్లు. కాబట్టి ఈ తీర్మానం సరైనది.
6. (3)
I : పాటించదు. ఎందుకంటే తీర్మానంలో వర్షాల గురించి లేదు
II : పాటించదు. శీతాకాల వర్షాలు మంచివంటే మిగిలిన కాలాల్లో వర్షాల వల్ల నష్టమని కాదు
7. (3)
I : పాటించదు. డబ్బు ముఖ్యపాత్ర పోషిస్తున్నంత మాత్రాన పేదవారెవరూ రాజకీయ నాయకులు కాలేరని కాదు.
II : పాటించదు. ఎందుకంటే ధనవంతులు అందరి గురించి మనం చెప్పలేం
8. (3)
I : పాటించదు. ఎందుకంటే ధరలు పెరుగుతున్నాయన్నారు. కానీ, కూరగాయల లభ్యత గురించి చెప్పలేదు.
II : పాటించదు. ఎందుకంటే కూరగాయలు తినే విషయం గురించి ఇక్కడ లేదు
9. (3)
I : అసంపూర్ణంగా ఉంది. కాబట్టి బలమైనది కాదు
II : జుట్టు బలం/ బలహీనతలకు పోటీ నిర్వహించడానికి సంబంధం లేదు
10. (1)
I : మంచి లాభాలు రావడం అనేది బలమైన విషయం
II : బలహీనత గురించి ఏమీ చెప్పలేదు. అసందర్భ వాదన
11. (2)
I : టీచర్ వృత్తికి కావలసింది ప్రజాదరణ కాదు. కాబట్టి బలమైనది కాదు
II : వారికి విషయ పరిజ్ఞానం ఉండదనేది బలమైన వాదన
12. (3)
I : ఖరీదైన విషయమనేది అప్రమత్తం కాబట్టి వాదన కాదు
II : టెరరిస్ట్ ఎటాక్‌లను నిరోధించడానికి ప్రతి కిలోమీటరుకు మెటల్ డిటెక్టర్లు అవసరం లేదు. కాబట్టి బలమైనది కాదు.
13. (4)
రెండూ బలమైన వాదనలే
16. (1)
I : కశ్మీర్ చాలా విదేశీమారక ద్రవ్యాన్ని మంచి ఆదాయ మార్గాన్ని వదలకూడదు కాబట్టి బలమైన వాదన
II : గొడవలు తగ్గుతాయని మన ఆదాయ మార్గాన్ని ఇవ్వలేం. కాబట్టి బలమైన వాదన కాదు.
17. (2)
I : గ్రామీణ ప్రాంతాల సృజనాత్మకత గురించి తెలియదు
II :బలమైన వాదన
18. (1)
I : బలమైన వాదన. పరీక్ష అనేది పిల్లల మీద చాలా పెద్ద భారం అవుతుంది
II : బలమైన వాదన కాదు. ఎందుకంటే నర్బంధ విద్య అందించరాదు
19. (4)
I : ఏ నోటీసు ఇచ్చేది దానికి కట్టుబడి ఉండాలనేది అంతర్లీనంగా ఉంది
II : అంతర్లీనంగా ఉంది. వినియోగదారులు అలా మార్చడానికి వస్తారనే ఊహతోనే ఈ నోటీసు ఇస్తారు
20. (1)
I : ఊహ I, IIలలో I మాత్రమే అంతర్లీనంగా ఉంది. ఆపరేషన్‌కు అనుకూలం అనే ఊహతోనే ఈ ప్రవచనం ఇచ్చారు.
21. (1)
I : అంతర్లీనంగా ఉంది. పిల్లవాడు భయపడి అల్లరి చేయడనే ఊహతోనే తల్లి ఇలాంటి హెచ్చరిక చేస్తుంది
II : అంతర్లీనం కాదు. ఎందుకంటే ఇక్కడ అందరి పిల్లల గురించి లేదు.
22. (2)
I : అంతర్లీనం కాదు. ఎందుకంటే ఇచ్చిన ప్రకటన నుంచి ఈ ఊహ రాదు
II : ప్రజలు తమ డబ్బు వృద్ధి చెందాలని కోరుకుంటారు అనే ఊహతోనే ఇలాంటి ప్రకటన చేస్తారు. కాబట్టి అంతర్లీనంగా ఉంది.
23. (3)
I : అంతర్లీనంగా కాదు. రేడియోలో వార్తలు వింటానంటే వార్తా పత్రిక చదవడానికి కాదు
II : అంతర్లీనం కాదు. అతను తాజా వార్తలు రేడియోలో వింటానంటే దాని అర్థం వేరెవరు తాజావార్తలు ప్రసారం చేయరని కాదు
24. (1)
I : అంత గొప్ప పుస్తకం ఇంత వరకు రాలేదంటే కొన్ని పుస్తకాలు వచ్చాయని అర్థం. కాబట్టి అంతర్లీనంగా ఉంది.
II : అంతర్లీనం కాదు. ఇచ్చిన ప్రకటనకు సంబంధం లేని విషయం
25. (2)
I : అంతర్లీనం కాదు. వేరే షాపుల ధరల గురించి తెలియును
II : ప్రజలు తమ డబ్బుకు సరిపడా విలువ ఉన్న వస్తువులను కావాలనుకుంటారు. కావున ఇలాంటి ప్రకటన ఇస్తారు. కావున అంతర్లీనంగా ఉంది
బీవీ రమణ
డైరెక్టర్, ఏకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






