The largest desert in the Southern Hemisphere | దక్షిణార్ధ గోళంలో అతిపెద్ద ఎడారి?
1. ఓటీఈసీ/ఓషియన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ టెక్నాలజీ సముద్ర జలాల్లోని ఉష్ణోగ్రతా వ్యత్యాసాలను ఉపయోగించి విద్యుత్‌ను/శక్తిని సృష్టించే ప్రక్రియ. ఇది మన దేశంలో ఇంకా అభివృద్ధి కాలేదు. తరంగ శక్తి, ఉష్ణశక్తి, సహజ వాయుశక్తి లాంటివెన్నో సముద్ర జలాల నుంచి పొందవచ్చు. తరంగ జనిత శక్తిని వాడుకోవడంలో యూకే, జపాన్, నార్వే ముందంజలో ఉన్నాయి. సముద్ర మట్టానికి అతి దిగువన ఉండి తరంగ శక్తిపై అధికంగా ఆధారపడిన దేశాన్ని గుర్తించండి.
1) నెదర్లాండ్స్/హాలండ్ 2) బెల్జియం
3) లగ్జంబర్గ్ 4) డెన్మార్క్
2. ప్రపంచంలో అతి తక్కువ లోతున్న సముద్రం ఆజోన్/13 మీ. అత్యంత పొడవైన జలసంధి మలక్కా, ఎర్రసముద్రం, హిందు మహాసముద్రాన్ని కలిపేది బాబ్-ఎల్-మండేబ్. ఆసియా, ఉత్తర అమెరికాను వేరుచేసేది జిబ్రాల్టర్, బాల్టిక్ సముద్రాన్ని ఉత్తర సముద్రంతో కలిపేది కీల్ కాలువ. అంటే సముద్రాలు వాటి ప్రవాహ పర్యవసానాలు ఒక దేశ ఆర్థికాభివృద్ధిని ప్రత్యక్షంగా డామినేట్ చేస్తాయి. పసిఫిక్ మహాసముద్ర కదలిక గురించి సరైనది ఏది?
1) ఉత్తర పసిఫిక్-సవ్యదిశ, దక్షిణ పసిఫిక్-అపసవ్య దిశ
2) ఉత్తర పసిఫిక్-అపసవ్యదిశ, దక్షిణ పసిఫిక్-సవ్యదిశ
3) ఎడమ నుంచి కుడికి భూమి తిరుగుతుంటే దానికి వ్యతిరేక దిశలో కదులుతుంది
4) ఎల్‌నినో, లానినో ప్రభావాల వల్ల ఉత్తర పసిఫిక్, ఉత్తరం వైపు, దక్షిణ పసిఫిక్ దక్షిణం వైపు కదులుతూ, ధృవాలను భారంగా మారుస్తూ మంచు గడ్డలుగా మారిపోతుంది
3. ప్లవకాలు అంటే?
1) ఆక్టోపస్ పిల్లలు 2) మొక్కలు
3) తిమింగలాలు 4) సూక్ష్మజీవులు
4. ప్రపంచ పెట్రోలియం ఉత్పత్తిలో 1/5వ వంతు లేదా 4 బిలియన్ బ్యారెళ్లు సముద్రాల నుంచే డ్రిల్లింగ్ చేయబడుతుంది. ప్రపంచ బ్రొమైన్ ఉత్పత్తిలో 66 శాతం సముద్రాలదే. డైమెర్సెల్ అనే పదం చేపలతో, డయాటం-సిలికాతో, లోయస్ మట్టి-పసుపురంగుతో, చిలీ దేశం-నైట్రేట్స్‌తో ముడిపడి ఉన్నాయి. సముద్రాల మరో ముఖ్యమైన సంపద మత్స్య సేకరణ గురించి సరికానిది గుర్తించండి.
1) ఆయన రేఖ సముద్రాల కన్నా, సమశీతోష్ణ సముద్రాల్లో అధికం
2) ఖండతీరపు అంచు (200 మీ.) వరకు చేపల వృద్ధి అధికంగా ఉంటుంది
3) గ్రాండ్ బ్యాంక్స్ (కెనడా) డాగర్ బ్యాంక్ (యూకే) చేపల ఉత్పత్తికి ప్రపంచ ప్రసిద్ధి
4) చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ 1/28 వంతు ముందుకు జరగడం వల్ల సంభవించే పాటు పోటుల వల్ల చేపల వృద్ధి అధికం
5. ప్రపంచాన్ని ఎన్ని సహజ, ప్రకృతిసిద్ధ మండలాలుగా వర్గీకరించవచ్చు?
1) 7 2) 9 3) 11 4) 13
6. కిందివాటిలో భూమధ్య రేఖ, ఉష్ణమండల, వర్షారణ్య ప్రాంతం కానిది?
1) నైలునది పరివాహక ప్రాంతం
2) అమెజాన్ పరివాహక ప్రాంతం
3) కాంగోనది పరివాహక ప్రాంతం
4) ఆగ్నేయాసియా
7. భూమధ్య రేఖా మండలంలో ఏడాది అంతా రాత్రి-పగల్లు సమానం, శీతాకాలం ఉండదు. ప్రతిరోజు సాయంత్రం వర్షం, రేయింబవళ్ల మధ్య ఉష్ణోగ్రతా వ్యత్యాసం చాలా తక్కువ. ఈ మండలం గురించి కింది వాటిలో సరికానిది ఏది?
1) డోల్డ్రమ్స్
2) బోగోర్‌లో (జావా) 322 రోజులు ఉరుముల శబ్దం
3) రాత్రిని చలికాలంగా చమత్కరించడం
4) భూగోళం చుట్టు ఇది ఒక అధిక పీడన మేఖల
8. భూమధ్య రేఖా మండలంలో సతత హరిత అరణ్యాలు, వెడల్పు ఆకులు, గట్టికలప వేగంగా పెరుగుతాయి. ఇవి అత్యంత దట్టమైనవి. ఈ అడవుల గురించి సరికానిది ఏది?
1) తీగజాతి చెట్లు-లయనాలు
2) వృక్షాల అగ్రభాగం పెనవేసుకుంటాయి-కెనోపి
3) జాపోటో వృక్షాల స్రావం చికిల్తో చూయింగ్ గమ్ తయారు చేస్తారు
4) రోగాలను వ్యాప్తి చేసే విష క్రిములు ఉండవు
9. భూమధ్య రేఖా ప్రాంతం అననుకూల వాతావరణం వల్ల జనసాంద్రత తక్కువ. ఇండోనేషియా తప్ప మిగతా ప్రాంతాల్లో ఆదిమ తెగలుంటాయి. తెగలు, ప్రాంతాలు కలవనిది ఎంపిక చేయండి?
1) అమెజాన్-రెడిండియన్స్
2) కాంగో- పిగ్మీలు, బింటునిగ్రోలు
3) బోర్నియో, న్యూగినియా- హెడ్‌హంటర్స్
4) శ్రీలంక-కాబూలు
10. క్రూరమృగాలు ఉండని మండలం?
1) టైగా 2) టండ్రా 3) మధ్యధరా 4) భూమధ్యరేఖా
11. అనకొండ నివాసముండే ప్రాంతం?
1) భూమధ్యరేఖ 2) చైనారీతి మండలం
3) తారాషియా 4) రుతుపవన మండలం
12. చెట్ల పై కర్రలతో అర్ధచంద్రాకారపు నివాసాలు నిర్మించుకునే ఆదిమతెగ?
1) సెమాంగ్లు 2) డయాక్స్లు
3) పిగ్మీలు 4) హెడ్ హంటర్స్
13. ఆదిమ తెగలు మారక/విస్తాపన వ్యవసాయం చేస్తాయి. ఈ రకమైన వ్యవసాయానికి మలేషియాలో లడాంగ్ అని, ఫిలిప్పైన్స్‌లో మిలాప్ అని, శ్రీలంకలో చైనా అని పిలుస్తారు. భారతదేశంలో కూడా ఈ రకమైన వ్యవసాయం చేసే గిరిజన తెగలు అనేకం ఉన్నాయి. కేరళలో పోనం, పశ్చిమకనుమల్లో కుమారి, తెలంగాణ, ఒడిశాలో పోడు వ్యవసాయం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో పెండా లేదా పేషా/బెవార్ వ్యవసాయం, రాజస్థాన్‌లో వాత్రా, ఈశాన్యరాష్ర్టాల్లో జాంజాం అనే పేర్లతో పిలుస్తారు. మరి ఈ తెగల ప్రధాన వృత్తి?
1) చేపలు పట్టడం 2) వేట
3) పశుపోషణ 4) తోటల పెంపకం
14. పోడు వ్యవసాయం కోసం కొట్టివేసిన చెట్లు మళ్లీ పెరిగితే దాన్ని ఏమంటారు?
1) బెలకార్స్ 2) గౌణ అడవులు 3) బెంగోజి 4) పూనం
15. కాఫీ జన్మస్థానం ఇథియోపియా. రబ్బరు జన్మస్థానం బ్రెజిల్, ఘనా. కోకో ఎస్టేట్లకు ప్రసిద్ధి ఇండోనేషియా. రబ్బరు ఉత్పత్తికి ప్రసిద్ధి మలేషియా. అయితే బ్రెజిల్లో ఉన్న కాఫీ తోటలను/ఎస్టేట్లను ఏమని పిలుస్తారు?
1) సెడార్లు 2) ఫ్రంకోనాస్
3) ఫజెండాస్ 4) హెవియాబ్రాసిల్లాస్
16. సహారా ఎడారి కెనరీ శీతల ప్రవాహం వల్ల ఉద్భవించింది. దీని పొడవు 6400 కి.మీ. ఇది అమెరికా కన్నా రెండింతలు పెద్దది. భారత వైశాల్యం కంటే 16 రెట్లు పెద్దది. ఈ ఎడారి వ్యాపించని దేశాన్ని గుర్తించండి.
1) ఈజిప్టు 2) సోమాలియా
3) సౌది 4) ఇథియోపియా

17. దక్షిణార్థగోళంలో అతిపెద్ద ఎడారి ఏది?
1) అటకామా 2) సహారా 3) అరేబియా 4) గిబ్బన్
18. ప్రపంచ వేటగాళ్ల స్వర్గం అని దేన్ని అంటారు?
1) టండ్రా 2) టైగా 3) సవన్నా 4) కాంపోలు
19. పెరు దేనికి ప్రసిద్ధి?
1) ఎల్‌నినో 2) ఆంటిలోప్ 3) ైగ్జెరోఫైట్స్ 4) రెట్ట
20. అధిక జనసాంద్రత గల ద్వీపం?
1) శ్రీలంక 2) మడగాస్కర్ 3) బాలి 4) జావా
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






