రేచర్ల పద్మనాయకులు -పాలనాంశాలు

రాజధానులు
-ఆమనగల్లు: తొలి రాజధాని
– రాచకొండ: 2వ రాజధాని
-దేవరకొండ: బలిష్టమైన కోట. 7 కొండల చుట్టూ దక్షిణంగా ఉన్న బలిష్టమైన దుర్గం.
రాజులు వారి బిరుదులు
-అనపోతానాయకుడు: ఆంధ్రదేశాధీశ్వర, త్రిభువన రామరాయ
– కుమార సింగమనాయకుడు: ఆంధ్ర మండలాధీశ్వరుడు, ప్రతిదండ భైరవుడు, భట్టనారాయణుడు, కల్యా ణ భూపతి.
– 2వ సింగభూపాలుడు: తెలంగాణ కృష్ణదేవరాయలు, సర్వజ్ఞ చక్రవర్తి.
పాలనా విధానం
– పద్మనాయకులు పాలనా విధానంలో ‘కాకతీయులను’ అనుసరించారు. పాలనా విధానంలో..
1. ప్రధానులు 2. సేనానులు
3. పురోహితులు సలహాలిచ్చేవారు.-
-రాచకొండ, దేవరకొండ, అనుముల, పొడిచేడు, ఆమనగల్లు, అనంతగిరి, స్తంభగిరి, భువనగిరి, జల్లపల్లి, పానగల్లు మొదలైన దుర్గాలు వీరి ఆధీనంలో ఉండి ‘దుర్గాధ్యక్షులు’ నియమించబడ్డారు. వీరు రాజ్యాన్ని ‘సీమ’లుగా విభజించారు. రాజ్యానికి గ్రామమే పునాది. గ్రామంలో 12 మంది వృత్తి పనివాళ్లు ఉండేవారు.
పరిశ్రమలు
నేత పరిశ్రమదే అగ్రస్థానం. ‘సింహాసన ద్వాత్రింశిక’ అనే గ్రంథంలో పలు రకాల దుస్తులను పేర్కొన్నారు. ఓరుగల్లు, దేవరకొండ, గోల్కొండ ప్రాంతాలు వస్త్ర పరిశ్రమ కేంద్రాలు.
ఓడరేవులు
వాడపల్లి వీరి ప్రధాన నౌకా కేంద్రం. ఉక్కు, గాజు, అద్దాలు, కాగితం మొదలైనవి ప్రధాన ఎగుమతులు.
మతవిధానం
‘శైవ’ మత ప్రభావం ఎక్కువ. శైవ, వైష్ణవులకు మధ్య తరచూ విభేదాలు తలెత్తేవి. పద్మనాయకుల ఆస్థానంలో ‘శాకల్య భట్టు’కు ‘పరాశర భట్టు’కు జరిగిన వివాదం దీనికి ఒక ఉదాహరణ.
– అనపోతానాయకుడు శైవమతాభిమాని. ఇతడు
1. ఉమామహేశ్వరం వద్ద శ్రీశైల ఉత్తర ద్వారం వద్ద మండపం నిర్మించాడు.
2. శ్రీ పర్వతశిఖరానికి సోపానాలు కట్టించడం, అనేక శివాలయాలు నిర్మించాడు.
– 2వ సింగభూపాలుడు: వైష్ణవ మతాభిమాని.
– 2వ అనపోతానాయకుడు: రామాలయం నిర్మించాడు. రామాయణంపై ‘రాఘవీయ’ అనే వ్యాఖ్యానం రాశాడు. ‘వడగల్, తెంగల్’ అనే వైష్ణవంలో శాఖలు ఏర్పడ్డాయి.
-ఏకవీర: దేవతలకు కూడా ఆలయాలు నిర్మించబడ్డాయి.
-యక్షగానాలు, ‘భాగవతులు’ ప్రాచుర్యం పొందాయి.
వాస్తు శిల్పకళ
– రాచకొండ, దేవరకొండల్లో దుర్గాలు నిర్మించారు.
-మాదానాయుడి భార్య నాగాంబిక ‘నాగసముద్రం’ అనే తటాకం నిర్మించింది.
పన్నుల విధానం
రాజ్యానికి ‘భూమిశిస్తు’ ప్రధాన ఆదాయం. పంట లో 1/6వంతు శిస్తు వసూలు చేసేవారు. మొత్తానికి పన్నుల భారం ఎక్కువ.
వ్యవసాయాభివృద్ధి
కాకతీయుల వలనే వ్యవసాయరంగానికి ప్రాముఖ్యత ఇచ్చారు. వీరు నిర్మించిన తటాకాలు..
1. అనపోతు సముద్రం 2. రాయసముద్రం 3. నాగ సముద్రం 4. పర్వత రావు తటాకం 5. వేదగిరి తటాకం మొదలైనవి ఉన్నాయి.
‘గ్రావిటి’తో నీరందించే చెరువులతోపాటు కొత్త రకాలైన నీటిపారుదల వ్యవస్థలు వీరికాలంలో వచ్చాయి.
1. ఏతాం 2. పరే కాలువలు 3. కోల్, నూతులు, రాట్నాలు, మోటలు 4. బావులు, వాగులు, కాలువలు, మొదలైన పద్ధతులు ఉపయోగించారు. ప్రజల ప్రధానవృత్తి వ్యవసాయం. పోతన లాంటి మహాకవులు కూడా వ్యవసాయం చేయడం దీనికి నిదర్శనం. వరి, జొన్న, సజ్జ, చెరుకు, నువ్వులు, పత్తి మొదలైనవి వీరి ప్రధాన పంటలు.
సాహిత్యసేవ
– ‘తెలుగు’ను అధికార భాషగా ప్రకటించారు.
– కుమార సింగమనాయకుని ఆస్థానంలో ఉన్న కవులు
– 1. బొమ్మకంటి అప్పయామాత్యుడు
– 2. విశ్వేశ్వర కవి ఉన్నారు.
-బొమ్మకంటి అప్పయామాత్యుడు అమరసిండు రాసిన ‘అమరకోశానికి వ్యాఖ్యానం’ రాశాడు. (అమరసిండు గుప్తులకాలంలో గొప్ప వ్యాకరణకర్త . ఇతడు కాళిదాసు సమకాలికుడు)
-మాదానాయకుడు ‘రామాయణంపై’ రాఘవీయం అనే వాఖ్య రాసి ‘శ్రీరాముని’కి అంకితం ఇచ్చాడు.
– ఈ వంశంలో రెండవ సింగభూపాలుడు గొప్పవాడు. స్వరాజ్య అనే బిరుదు కూడా ఉన్నది. ఇతను సంస్కృతంలో గొప్ప పండితుడు. ఆయన రాసిన గ్రంథాలు..
– 1. రసార్ణవ సుధాకరం
– 2. రత్న పాంచాలిక
-3. సంగీత సుధాకరం (సారంగదేవుడు రచించిన ‘సంగీత రత్నాకరం’ అనే గ్రంథానికి ఇది వ్యాఖ్యానం)
-4. కందర్పసంభవం
-ఇతని ఆస్థానంలో గొప్ప పండితులు ఉన్నారు. వారిలో…
– బమ్మెర పోతన: పరమ భాగవతుడు. వైష్ణవ భక్తుడు. పోతన రాసిన గ్రంథాలు..
– 1. భోగిని దండకం
– 2. వీరభద్ర విజయం
– 3. ఆంధ్ర మహాభాగవతం (తెలుగులో రచించాడు)
– 4. నారాయణ శతకం (8 స్కందాలు)
– శాకల్యమల్లయ్య భట్టు: నిరోష్ట్య రామాయణం, ఊదార రాఘవం రచించాడు. ‘చతుర్భాషా కవితా పితామడు’ అనే బిరుదాంకితుడు.
ఇతర కవులు
-మాయిభట్టోపాధ్యాయుడు: పదవాక్య ప్రమాణజ్ఞుడు
-శంబునాథకవి: నాగాంబిక, తటాక శాసనం రచించాడు.
– మడికి సింగన: ‘పద్మపురాణం, నీతితారావళి’ ఆనాటి మనుషుల ప్రవర్తనను తెలుపుతుంది.
-గౌరన: నవనాథ చరిత్ర రచించాడు. ఇతనికి ‘సరస సంగీత లక్షణ చక్రవర్తి’ అనే బిరుదు ఉన్నది.
-కుమారస్వామి సోమపథి: ‘ప్రతాపరుద్రీయం’కు వ్యాఖ్యానం రచించాడు. దీనిపేరు ‘రత్నాపణం’
– భైరవకవి: ఇతడు ‘గౌరన’ కుమారుడు. తెలంగాణలో బందకవిత్వ ప్రక్రియకు ఆద్యుడు. ఇతని రచనలు
-1. శ్రీరంగ మహత్యం
-2. రత్న పరీక్ష
-3. కవి గజాంకుశం (చందోగ్రంథం).
– అనంతమాత్యుడు: ఈ యుగంలో మరో ప్రసిద్ధకవి అనంతమాత్యుడు. ఇతని రచనలు..
-1. భోజరాజీయ కావ్యం 2. ఛందో దర్పణం
– 3. రసాభరణం
– త్రిలోక భేది: భైరవకవి కుమారుడు, గౌరన మనుమడు. ఆయన ‘సకల ధర్మసారం’ రచించాడు.
-వేదాంత దేశికుడు: సుభాషిత నీతి, తత్త్వ సందేశం, రహస్య సందేశం రచించాడు.
-నాగనాధుడు: విష్ణుపురాణం, మదన విలాస బాణం రచించాడు.
ముఖ్యాంశాలు
-సర్వజ్ఞ చక్రవర్తి: 2వ సింగభూపాలుడు. ‘కువలయావళి’ పేరుతో రత్నపాంచాలిక నాటకం రాశాడు.
– 2వ సింగభూపాలుడు: ‘సంగీతసుదాకరం’ అనే సంగీత పరమైన గ్రంథం రచించాడు. ఇది సారంగదేవుడు రాసిన ‘సంగీత రత్నాకరానికి’ వ్యాఖ్యానం.
-పేయింటింగ్స్: రాచకొండలో బయల్పడ్డాయి
-అలంకారశాసా్త్రలు: 1. రసవర్ణ సుధాకరం (2వ సింగభూపాలుడు)
2. చమత్కార చంద్రిక (విశ్వేశ్వరుడు)
ముఖ్య బిరుదులు పొందిన కవులు
– గౌరన: సరససాహిత్య లక్ష్మణ చక్రవర్తి
-2వ సింగభూపాలుడు: ప్రతిదండ భైరవ
-పోతన: మహాభాగవతకర్త, భక్తపోతన
ఆధార గ్రంథాలు
-వెలుగోటి వంశావళి
– 30 శాసనాలు బయటపడ్డాయి.
– భేతాళరెడ్డి: వెల్మవంశం మూల పురుషుడు.
చిత్రకళ
– రాచకొండ కొండపై వీరి అద్భుతమైన పేయింటింగ్స్ 2015లో బయల్పడ్డాయి.
మాదిరి ప్రశ్నలు
1. ముసునూరి నాయక వంశస్థుల రాజధాని?
ఎ. రాచకొండ బి. కొండవీడు
సి. ఆమనగల్లు డి. రేఖపల్లి
2. ‘కలువచేరు శాసనం’లో ఎవరి విజయాలు ఉన్నాయి?
ఎ. కాపయనాయకుడు
బి.ప్రోలయనాయకుడు
సి.అనపోతానాయకుడు
డి. పైవారందరూ
3. ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్రసుత్రాణ అనే బిరుదులు ఎవరికి కలవు?
ఎ. ప్రోలయనాయకుడు బి. కాపయనాయకుడు
సి. గణపతిదేవుడు డి. రేచెర్ల రుద్రుడు
4. ‘ఆంధ్ర మండలాధీశ్వరుడు’ బిరుదు ఎవరికి ఉంది?
ఎ. కుమారసింగనాయకుడు
బి. రెండో సింగభూపాలుడు
సి. అనపోతానాయకుడు డి. దామానాయుడు
5. బహ్మనీ రాజ్యాన్ని 1347లో స్థాపించినది ఎవరు?
ఎ. మాలిక్ మక్బూల్ బి. హసన్గంగూ
సి. మాలిక్నబి డి. మీర్ఖమ్రుద్దీన్
6. బహ్మనీ రాజ్య తొలి రాజధాని?
ఎ. బీదర్ బి. గోల్కొండ
సి. బీరార్ డి. గుల్బర్గా
7. రేచెర్ల పద్మనాయకుల తొలి రాజధాని?
ఎ. ఓరుగల్లు బి. రాచకొండ
సి. దేవరకొండ డి. ఆమనగల్లు
8. ‘ప్రతిదండ భైరవుడు’ బిరుదు ఎవరికి కలదు?
ఎ. మాలిక్ మక్బూల్ బి. సింగభూపాలుడు సి. కుమార సింగనాయకుడు డి. దామానాయుడు
9. ‘అమరకోశాని’కి వ్యాఖ్యానం రచించినది ఎవరు?
ఎ. బొమ్మకంటి అప్పయామాత్యుడు బి. భక్తపోతన
సి. రెండో సింగభూపాలుడు డి. విశ్వేశ్వర కవి
10. ‘చమత్మార చంద్రిక’ గ్రంథ రచయిత?
ఎ. గౌరన బి. పోతన
సి. విశ్వేశ్వరుడు డి. అనపోతానాయ
సమాధానాలు
1. ఎ 2. ఎ 3. బి 4. బి 5. బి 6.డి 7. డి 8. సి 9. ఎ 10. సి
డా౹౹ మురళి
అసిస్టెంట్ ప్రొఫెసర్
నిజాం కళాశాల, హైదరాబాద్.
9701674383
RELATED ARTICLES
-
Telangana Govt Schemes & policies | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు- పథకాలు
-
General Essay – Groups Special | సూయజ్ కంటే చవక… ఈ నడవ
-
Groups Special – Geography | సూర్యుడు ఉదయించే దేశాలు.. శృంగాకారపు అడవులు
-
Indian History – Groups Special | బంగారు పుట్టలు పెట్టే చీమలు.. అబద్ధాలెరుగని ప్రజలు
-
IIT/NEET Foundation – chemistry | The strength of a bond depends upon?
-
English Grammar | We should all love and respect
Latest Updates
Economy | ప్రపంచంలోని డైనమిక్ సిటీస్ కేటగిరీలో హైదరాబాద్ ర్యాంక్ ఎంత?
Indian Cultures And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
IIT Jam Notification | జాతీయ సంస్థలో మాస్టర్స్.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా…
Groups Special – Science | సహజ శక్తి అనంతం … కాలుష్య రహితం.. పర్యావరణ హితం
DSC SGT MATHS | చతురస్రాకార పొలం వైశాల్యం 1024 చ.మీ అయితే దాని భుజం ?
Physics – IIT/NEET Foundation | The acceleration of a body has the direction of
Economy – Groups Special | అండమాన్లో అల్పం… దాద్రానగర్లో అధికం
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?