గీతికా పాదంలోని శ్లోకాల సంఖ్య?
చరిత్ర-స్వభావం-మూల్యాంకనం
- ఎవరి అభిప్రాయం ప్రకారం విద్యాలక్ష్యాలు ఎంతమేరకు సాధించబడ్డాయో తెలపడానికి తెలియజేసేదే మూల్యాంకనం?
1) రాల్ఫ్ టేలర్ 2) బ్లూమ్స్
3) కొఠారి 4) నార్మన్ గ్రీన్లాండ్ - కింది వాటిలో మూల్యాంకనం ప్రయోజనం కానిది?
1) మూల్యాంకనం ఉపాధ్యాయుని సంసిద్ధతలను, బాధ్యతను సూచిస్తుంది
2) విద్యాప్రణాళికను సరైన మార్గంలో అనుసరించడానికి తోడ్పడుతుంది
3) విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తనా మార్పులను మాపనం చేయడానికి తోడ్పడదు
4) పాఠశాల, సమాజం తల్లిదండ్రుల మధ్య వారధిగా ఉంటుంది - సంకలన మూల్యాంకనం చేయదగిన సమయం?
1) శిక్షణ ఇచ్చే ముందు
2) శిక్షణ పూర్తయిన తర్వాత
3) శిక్షణ జరుగుతున్నప్పుడు
4) అభ్యసనలో ఇబ్బందులు అవగాహన చేసుకోడానికి - కింది వాటిలో ఒకటి స్వీయ వివరణ సాధనం?
1) రేటింగ్ స్కేల్ 2) చెక్లిస్ట్
3) క్యుములేటివ్ రికార్డ్ 4) ఇంటర్వ్యూ - విద్యార్థుల నుంచి ఏ రకమైన ప్రశ్నల ద్వారా వ్యవస్థాపనం, సంబంధ స్థాపనం, భావనోద్భవం వివరణ వంటి అభ్యసనాంశాలను రాబట్టవచ్చు?
1) వ్యాసరూప 2) లఘుసమాధాన
3) సంక్షిప్త సమాధాన 4) విషయనిష్ఠ - సమాధానాన్ని ఎంపిక చేసే రకం ప్రశ్న?
1) ప్రత్యామ్నాయ ప్రతిస్పందన రకం
2) ఖాళీలు పూరించడం
3) సాదృశ్య రకం 4) సంసర్గ రూపం - ఒక గణిత పరీక్ష నిర్వహించారు. ఏ ఉద్దేశంతో ఆ పరీక్ష నిర్వహించారో ఆ ఉద్దేశం నెరవేరలేదని గమనించారు. కాబట్టి ఆ పరీక్షకు కింద తెలిపిన ఏ లక్షణం లేదని భావించవచ్చు?
1) విశ్వసనీయత 2) లక్ష్యాత్మకత
3) ఉపయోగిత 4) సప్రమాణత - ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న నిర్మాణాత్మక మదింపులో అధిక మార్కులు కేటాయించబడుతున్న
మూల్యాంకన సాధనం?
1) పిల్లల భాగస్వామ్య-ప్రతిస్పందనలు
2) రాత పనులు
3) ప్రాజెక్టు పనులు
4) లఘు పరీక్ష - ‘ఒక వృత్తాన్ని గీసి అందులో కేంద్రం, వ్యాసార్థం, వ్యాసం, చాపాన్ని గుర్తించండి’. దీని ద్వారా పరీక్షించగల విద్యాప్రమాణం?
1) కారణాలు చెప్పడం-నిరూపణలు చేయడం
2) వ్యక్తపరచడం
3) అనుసంధానం
4) ప్రాతినిధ్యపరచడం-దృశ్యీకరణ - ‘భూ కంపాలు, వరదలు భూమిపై తరచుగా ఎందుకు ఏర్పడుతున్నాయి’ అనే ప్రశ్న ఏ విద్యాప్రమాణాన్ని సాధించే ఉద్దేశం కలిగి ఉంది?
1) విషయావగాహన 2) ప్రశంస
3) పటనైపుణ్యాలు
4) సమాచార నైపుణ్యాలు - 5వ తరగతిలో ఒక విద్యార్థి పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో 85 శాతం మార్కులు సాధించాడు. అతడి గ్రేడు?
1) B+ 2) B 3) A 4) A+ - బ్లూ ప్రింట్లో బ్రాకెట్ లోపల, బ్రాకెట్ వెలుపల సూచించే సంఖ్యలు వరుసగా
1) ప్రశ్నలు, మార్కులు
2) ప్రశ్నలు, జవాబులు
3) జవాబులు, మార్కులు
4) మార్కులు, ప్రశ్నలు - సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని పేర్కొన్నవారు?
1) జేఎం ఫారెస్టర్ 2) ఈబీ వెస్లీ
3) జేమ్స్ హెమ్మింగ్స్ 4) జేవీ మైకేల్స్ - ‘విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి’ అని అభిప్రాయపడినవారు?
1) కార్ల్ పియర్సన్ 2) హెన్రీ పాయింకేర్
3) ఐన్స్టీన్ 4) ఏడబ్ల్యూ గ్రీస్ - కింది వాటిలో యూక్లిడ్ చేసిన
గణిత సేవ?
1) చతుర్భుజంలో వర్తించే సూత్రాన్ని రూపొందించాడు
2) ప్రస్తారాలు-సంయోగాల గురించి
వివరించాడు
3) అంకశ్రేఢిలో ‘n’ పదాల మొత్తానికి సూత్రాన్ని తెలియజేశాడు
4) జ్యామితికి సంబంధించిన సిద్ధాంతాలు, స్వీకృతాలు రూపొందించాడు - ఆర్యభట్టీయంలోని 4 పాదాల్లో గీతికా పాదం కలిగి ఉన్న శ్లోకాల సంఖ్య?
1) 33 2) 10 3) 25 4) 50 - ఉష్ణోగ్రత, పీడనం, ఆర్ధ్రతలకు సంబంధించిన జ్ఞానం ఒక ప్రాంత శీతోష్ణస్థితి అవగాహన చేసుకోడానికి ఉపయోగపడుతుంది. ఈ వాక్యం ఏ రెండు విషయాల మధ్య సహసంబంధం సూచిస్తుంది?
1) విజ్ఞాన శాస్త్రం-భూగోళ శాస్త్రం
2) విజ్ఞాన శాస్త్రం-చరిత్ర
3) విజ్ఞాన శాస్త్రం-కళలు
4) విజ్ఞాన శాస్త్రం-అర్థశాస్త్రం - కింది వాటిలో విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరిచిన అంశం?
1) యథార్థాలు 2) భావనలు
3) సిద్ధాంతాలు 4) ప్రయోగాలు - కింది వాటిలో సరైనవి?
ఎ-ఆర్యభట్ట- పాటలీపుత్రం
బి-భాస్కరాచార్య- ఉజ్జయిని
సి-బ్రహ్మగుప్త- భిల్లమం
డి-యూక్లిడ్- రాజస్థాన్
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి, డి, ఎ 4) డి, ఎ, బి - ‘ఓకియో, నామస్’ అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించిన విషయం?
1) పౌరశాస్త్రం 2) అర్థశాస్త్రం
3) భూగోళ శాస్త్రం 4) చరిత్ర
- Tags
- nipuna
Previous article
DEET ఉద్యోగాలు
Next article
మూల్యాంకన ప్రక్రియలో మొట్టమొదటి అంశం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు