నేల తల్లికి పచ్చల హారం


నేనొక పచ్చల హారం
తయారు చేసే పనిలో పడ్డాను..
కాలుష్యం మంటలు సోకి
మచ్చలు పడ్డ వసుధ కంఠానికి
నేనొక పచ్చల హారం
బహూకరించే పనిలో పడ్డాను
ఒక చెట్టును నాటుతూ..
ఒక పిట్టను ఎగరేస్తూ..
ప్రాణవాయువుల కలలు పొదిగిన
ఒక మెరుపు తీగను
తయారు చేసే పనిలో పడ్డాను నేను
నా పచ్చల హారాన్ని మెడలో వేసుకొని
మురిసిపోయే నా నేలతల్లి
ఆకుపచ్చని నవ్వు నా కల
కొన్ని ఆకులను పుష్పాలను
పందిళ్లుగా పరిచి
నా భూతల్లి పాదాలకు
పచ్చపచ్చని చందమామలను
మువ్వలుగా చుట్టి
నర్తింపజేయటం నా స్వప్నం
పచ్చలహారపు మెరుపుల్లో
కళ్లు బైర్లు కమ్మి
భూమి చివరి అంచుదాకా
దిక్కుతోచక పరుగెత్తుతున్న
కాలుష్యపు ఇనుప పాదాల
చివరి చప్పుడు నా ఊహ
నేనొక పచ్చల హారం
తయారు చేసే పనిలో పడ్డాను
మీరు కూడా హారంలో
ఒక మణి పూసలా
గాయానికి పూసిన
హరితలేపనపు మెరుపులా
అంటుకుంటారు కదూ..
-చిత్తలూరి ,82474 32521
- Tags
Previous article
సైన్స్ కోర్సుల వేదిక ఐసర్
Next article
అడ్మిషన్ వచ్చిందా.. ప్రయాణానికి సిద్ధం కండి
Latest Updates
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు
మరో 532 టీచర్ల పరస్పర బదిలీలు
త్వరలో ఏఈ నోటిఫికేషన్
గైర్హాజరైన వారు మళ్లీ పరీక్షలు రాయొచ్చు
18 నుంచి వెబ్సైట్లో ఐసెట్ హాల్టికెట్లు
అగ్రికల్చరల్ యూనివర్సిటీలో తాత్కాలిక పోస్టుల భర్తీ
గురుకుల క్రీడా పాఠశాలల్లోప్రవేశాలు
రైల్టెల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు ఉద్యోగాలు
Start observing your ecosystem for answers